Sunday, February 23

21 JAN 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ లింక్ ద్వారా క్విజ్ వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

22 జనవరి 2020 కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

Please subscribe Telangana Exams Youtube Channel with this link

 ఇక్కడ క్లిక్ చేయండి: తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ని Subscribe చేసుకోండి

1. పాలన వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.  ఈ బిల్లుకు సంబంధించి ఈ కింది వాటిల్లో ఏవి సరైనవి

1) అమరావతి - శాసనాపరమైన రాజధాని, శాసన సభ, శాసన మండలి భవనాలు ఇక్కడే ఉంటాయి

2) విశాఖపట్నం – ఇది పరిపాలన రాజధాని, రాజ్ భవన్, సెక్రటరియేట్, శాఖాధిపతుల కార్యాలయాలు ఇక్కడ ఉంటాయి

3) కర్నూలు – ఇది న్యాయ రాజధాని, ఇక్కడ ప్రధాన న్యాయమూర్తితో కూడిన రాష్ట్ర హైకోర్టు ఉంటుంది... ఇతర ప్రాంతాల్లో బెంచ్ లు ఏర్పాటవుతాయి

2. తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన  జనగణన విజయవంతంగా పూర్తయింది.  దీనికి సంబంధించి ఈ ప్రకటనల్లో సరైనది ఏది ?

1) రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 జిల్లాల్లో ఈ జన గణను నిర్వహించారు

2) తెలంగాణలో – నిజామాబాద్ టౌన్, వరంగల్ అర్భన్ జిల్లాలోని వేలేరు మండలం, మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట మండలంలో నిర్వహించారు

3) ఏపీలో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని 8 గ్రామాల్లో, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో, గుంటూరు జిల్లా నరసరావు పేట పట్టణంలో నిర్వహించారు

4) 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30లోగా దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాల వివరాలను NPR లో నమోదు చేస్తారు

3. ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

1) దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019 అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు

2) దీపా వెంకట్ ( స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు )

3) అల్లు అరవింద్ ( చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవా కార్యక్రమాలు )

4) సురేష్ చుక్కపల్లి ( ఫీనిక్స్ ఛైర్మన్ – స్వచ్ఛ అభియాన్ కింద శ్మశాన వాటికలను నిర్వహిస్తున్నందుకు)

4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరిని ప్రభుత్వం నియమించింది ?

5. అగ్రశ్రేణి యుద్ధ విమానం సుఖోయ్ 30 MKI ను మొదటిసారిగా దక్షిణ భారత దేశంలోని ఏ రాష్ట్రంలో భారత వైమానిక దళం మొహరించింది.  ?

6. ఆర్థికంగా, సామాజికంగా, వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత స్థాయిలకు చేరేందుకు అనువైన పరిస్థితులను సూచించే సోషల్ మొబిలిటీ సూచీలో మొత్తం 82 స్థానాల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది

7. భారత ఆర్థికవృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20 సంవత్సరానికి ఎంతశాతం నమోదు అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) అంచనా వేసింది ?

8. 2018 ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రంపంచ GDP ర్యాంకింగ్స్ లో 20.5 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశం ఏది ?

9. దేశంలో ప్రస్తుతం ఉన్న పులుల సంఖ్యను 2022 కల్లా రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దేశంలో అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రం ఏది ?

10. భారత్ లో 331.3 మిలియన్ల SUBSCRIBERS లను కలిగిన అత పెద్ద టెలికాం కంపెనీ ఏది ?