Wednesday, October 23

21 SEPT CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

1. మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏ మహనీయుడి బంగారు విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ, ఆ దేశాధ్యక్షుడు ఖల్డ్ మాగీన్ బట్టూగ్లాతో కలసి ప్రారంభించారు ?

2. స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఏ రోజున నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

3. పద్మ అవార్డుల మాదిరిగానే ఇకపై దేశ ఐక్యత, సమగ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులు లేదా సంస్థలకు ఎవరి పేరుతో ఐక్యతా అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది ?

4. జాతీయ స్థాయిలో బ్యాంకింగ్ ఫ్రాంటియార్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచే బ్యాంకులకు వివిధ కేటగిరీల్లో అవార్డులు ఇస్తుంది.  రాష్ట్ర సహకార బ్యాంకుల కేటగిరీలో ఈ అవార్డుకు తెలంగాణ రాష్ట్ర సహకార ఏపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఎండీకి దక్కింది.  ఆయన పేరేంటి ?

5. ATM, కార్డ్ స్వైప్, కార్డు ద్వారా నగదు బదిలీ, IMPS, NEFT, UPI, AADHAR, మొబైల్ వాలెట్స్ ద్వారా చెల్లింపు చేసినప్పుడు మన ఖాతా నుంచి డబ్బు కట్ అయిన అవతలి సంస్థకు చేరకపోతే... నిర్ధిష్ట గడువులోగా మన డబ్బులు వాపస్ రావాలి.  అలా కాని పక్షంలో సంబంధింత బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రతి రోజుకి రూ.100 చొప్పున వినియోగదారుడికి పరిహారం చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ఇచ్చింది.  ఈ ఆదేశాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి

6. దేశంలో ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోడానికి కార్పొరేట్ పన్నులు 30శాతం నుంచి ఎంతకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ?

7. ) గోవాలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన  జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఎన్ని వస్తువులపై 12 సేవలపై పన్నుల్లో మార్పులు చేశారు.  ఇవి 2019 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి

8. 2019-20 సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ABC) ఛైర్మన్ గా ఎవరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ?

9. ప్రపంచ పురుషుల బాక్సంగ్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు చేరిన మొదటి భారతీయుడిగా ఎవరు ఘనత సాధించారు ?

10. అమెరికాలో వారం రోజుల పర్యటనకు ప్రధాన నరేంద్రమోడీ బయల్దేరి వెళ్లారు.  హౌడీ మోడీ పేరుతో (హౌడీ అంటే హౌ డూ యూ డు- ఎలా ఉన్నారు అని అర్థం) ఏ నగరంలో 50వేల మందికి పైగా భారతీయులతో సమావేశం అవుతున్నారు ?

11. ఇంధన పొదుపు చర్యల్లో దక్షిణ మధ్య రైల్వేకి ఎన్ని అవార్డులు దక్కాయి.  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తుంది ?

12. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.560.89 కోట్లు కేటాయించింది.  రాష్ట్రంలో 5.3కోట్ల మందికి ఆరు విడతలుగా ఉచితంగా కంటి పరీక్షలు చేసేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది ?

13. రెపిచేజ్ ఫైనల్ రౌండ్లో నెగ్గడం ద్వారా భారత స్టార్ రెజ్లర్ బజ్ రంగ్ పునియా కాంస్యం దక్కించుకున్నాడు. పునియా ఖాతాలో ఇది మూడో ప్రపంచ పతకం.  రెపి చేజ్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి ?