వాతావరణ నిధి కోసం ప్రత్యేక నిధి : కాప్ 27 సదస్సులో ఒప్పందం

  • భూమి ఉష్ణోగ్రతలు పెరగడంతో నష్టపోతున్న పేద దేశాలకు పరిహారం ఇచ్చేందుకు ప్రపంచ దేశాలు మొదటిసారిగా ఒప్పుకున్నాయి.
  • కాలుష్య ఉద్గారాలతో కలిగిస్తున్న హానికి ఇలాంటి ఒక ‘పరిహార నిధి’ ఏర్పాటు చేయాలని వివిధ దేశాలు కొన్ని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి.
  • ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ లో 2022 నవంబర్ 20 న ముగిసిన కాప్ 27 సదస్సులో దీనిపై ఒప్పందం కుదిరింది.
  • కరవు, వరదలు, వడగాల్పులు, తుపాన్లు లాంటి వైపరీత్యాలతో సతమతం అవుతున్న పేద దేశాలకు దానికి తగ్గట్టుగా పరిహారం ఇస్తారు.
  • పరిహార నిధి ఏర్పాటుకు ఒప్పందం కుదరడంపై భారత్ సంతోషం వ్యక్తం చేసింది. ఇది చరిత్రాత్మక పరిణామమని అన్నారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్.
  • భూతాపానికి ప్రధానమైన శిలాజ ఇంధనాల విషయంలో కాప్ సదస్సులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
  • ఇతర దేశాలు చేసిన పర్యావరణ హానికి తాము శిక్ష అనుభవించాల్సి వస్తోందని వివిధ దేశాలు వాదిస్తున్నాయి. దాంతో డబ్బు జమ అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
  • వివిధ సంస్థలు, ఇతరత్రా ప్రభుత్వ, ప్రైవేటు వనరుల ద్వారా డబ్బు సమీకరించి ఈ నిధిలో జమ చేస్తారు..
  • దేశాలు వాతావరణ నిధి కోసం ఏటా 10,000 కోట్ల డాలర్లు సమకూరుస్తామన్న వాగ్దానాన్నే అభివృద్ధి చెందిన దేశాలు ఇంకా నెరవేర్చలేదు.

 

2020లో దేశంలో అత్యధిక మరణాలు: జనగణన శాఖ నివేదిక

  • దేశ చరిత్రలోనే అత్యధికంగా 2020లో 81.15 లక్షల మరణాలు నమోదయ్యాయి. 2019తో పోలిస్తే 4.74 లక్షల మరణాలు అధికంగా జరిగినట్టు కేంద్ర జన గణన శాఖ లేటెస్ట్ రిపోర్టులో తెలిపింది.
  • కోవిడ్ వల్లే ఎక్కువ మరణాలు సంభవించాయని అంచనా.
  • తెలుగు రాష్ట్రాల్లో 2020లో 45 ఏళ్లు పైబడిన వారు చాలామంది చనిపోయారు.
  • వయసుల వారీగా విశ్లేషిస్తే తెలంగాణలో మొత్తం 2,03,127 మంది మృతుల్లో ఎక్కువ మంది 65-69 ఏళ్ల మధ్య వయసున్న వారు 39 శాతం మంది. 70 ఏళ్లు పైబడిన వారు 21 శాతం మంది ఉన్నారు.
  • తెలంగాణలోని పట్టణాల్లో పురుషులు 54,503 మంది, మహిళలు 42,050 మంది చనిపోయారు.
  • గ్రామాల్లో 61,001 మంది పురుషులు, 45,573 మంది మహిళలు మృతి చెందారు. మృతుల్లో మహిళల కంటే పురుషులే అధికంగా ఉన్నారు

NGRI డైరెక్టర్ గా డాక్టర్ ప్రకాశ్ కుమార్

  • జాతీయ భూ భౌతిక పరిశో ధన సంస్థ (NGRI) డైరెక్టర్ గా డాక్టర్ ప్రకాశ్ కుమార్ నియమితులయ్యారు.
  • ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న వి.ఎం. తివారీ పదవీ కాలం ఆరేళ్లతో పాటు 3 నెలల అదనపు గడువు కూడా ముగిసింది.
  • చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ప్రకాశ్ కుమార్ భూకంపాలపై కీలక పరిశోధనలు చేశారు. ధన్ భాద్ లోని IIT-ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ లో అప్లయిడ్ జియోఫిజిక్స్ చదివారు.
  • ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియో ఫిజిక్స్ లో PHD చేశారు.
  • పరిశోధనలకు యువ శాస్త్రవేత్త, జాతీయ జియో సైన్స్ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నారు.
  • NGRIలో అతి పెద్ద పరిశోధనా బృందాల్లో ఒకటైన ‘భూకంపాలు, గ్యాస్ హైడ్రేట్ డివిజన్ కు బాధ్యత వహించారు.

 

ఏడాది పాటు కరెంట్ ఎఫైర్స్ తో పాటు ప్రతి రోజూ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఈ కింది లింక్ ద్వారా కేవలం రూ.100తో కోర్సును ఈ కింది లింక్ ద్వారా purchase చేయండి.

https://atvqp.courses.store/114635?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

Leave a Reply