Sunday, February 23

21 DEC CURRENT AFFAIRS ( TS & AP )

ఈ లింక్ ద్వారా కరెంట్ ఎఫైర్స్ ఓపెన్ చేసుకోగలరు

21 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఏపీ)

1. భారతీయ అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త కు అమెరికాలోని ప్రతిష్టాత్మక జాతీయ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ గా ఎంపిక చేస్తూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.  ఆ శాస్త్రవేత్త ఎవరు ?

2. మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన వి-హబ్, స్టార్టప్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంలో చేపడుతున్న ఏ కార్యక్రమాన్ని రాష్ట్రమంత్రి కేటీఆర్ ప్రారంభించారు ?

3. నాబార్డ్ ఛైర్మన్ ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారు ? ( ఆయన పదవీ కాలాన్ని తదుపరి ఉత్తర్వులు జీ చేసేంత వరకూ కొనసాగించాలని కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది )

4. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు ఎవరికి విముక్తి కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసినవి

5. ఈ కింది స్టేట్ మెంట్స్ పరిశీలించి ఏవి సరైనవో తెలపండి

ఎ) విజయ తెలంగాణ బ్రాండ్ కు కేంద్ర ప్రభుత్వ ట్రేడ్ మార్క్ అథారిటీ ఆమోదం లభించింది

బి) 1999 ట్రేడ్ మార్క్ యాక్ట్ ప్రకారం రిజిష్ట్రార్ ఆఫ్ ట్రేడ్ మార్క్... విజయ తెలంగాణ బ్రాండ్ ను రిజిష్టర్ చేసింది

సి) తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ అనుమతి పొందింది.

6. హైదరాబాద్ – న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ ప్రెస్ బోగీలకు ఏ సంస్థకు సంబంధించిన అడ్వర్టైజ్ మెంట్స్ కనిపిస్తాయి ?

7. ఆంధ్రప్రదేశ్ లో వికేంద్రీకరణకు 13 జిల్లాలను ఎన్ని ప్రాంతీయ మండళ్ళు ఏర్పాటు చేయాలని GN రావు కమిటీ సూచించింది ?

8. ఆన్ లైన్, వాణిజ్య ప్రకటనల మార్కెట్ లో గూగుల్ సంస్థ ప్రదర్శిస్తున్న ఆధిపత్య ధోరణిపై రూ.1,180 కోట్ల జరిమానా విధించిన దేశం ఏది

9. ఇటీవల ఒడిశాలోని చాందీపూర్ నుంచి ప్రయోగించిన పినాక అనేది దేనికి సంబంధించినది

10. యూనిసెఫ్ తో తమ భాగస్వామ్యాన్ని 2020 టీ 20 ప్రపంచ కప్ టోర్నీ వరకూ కొనసాగించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్ణయించింది... 2019 వన్డే ప్రపంచ కప్ సమయంలో సేకరించిన నిధులను ఎక్కడ ఖర్చుచేయాలని UNICEF నిర్ణయించింది ?