Wednesday, October 23

20 SEPT CURRENT AFFAIRS QUIZ

ఈ టెస్ట్ యాప్ లో ఓపెన్ అవదు.  అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు.

20 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని సెకన్లకో గర్భిణీ లేదా బిడ్డ చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఐరాస బాలల నిధి సంస్థ (UNICEF)  తదితర సంస్థల నివేదికలు వెల్లడించాయి ?

2. జల సంరక్షణ, నిర్వహణకు సంబంధించి ‘‘ఏ డిస్టింక్టివ్ వాటర్ మేనేజ్ మెంట్ స్టోరీ – ద రాజస్థాన్ వే’’ అనే పుస్తకాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, ప్రకాష్ జావ్ డేకర్, కిషన్ రెడ్డి, సంజయ్ ధోత్రేలు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.  ఈ పుస్తకాన్ని కేంద్ర జల్ మంత్రిత్వ శాఖ సలహాదారు రాశారు. ఆయన పేరేంటి ?

3. ఉగ్రవాద దాడులతో బీభత్సం సృష్టిస్తున్న పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేందుకు  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యుద్ధానికి దిగాలనుకున్నారని ‘ఫర్ ద రికార్డ్ ’ అనే పుస్తకంలో రాశారు.  ఇది రాసిన బ్రిటీష్ మాజీ ప్రధాని ఎవరు ?

4. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా మహిళలకు ఇచ్చే బతుకమ్మ చీరలను ఈసారి ఎన్ని డిజైన్లలో రూపొందించారు ?

5. జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) లో ఇక మహిళలను నియమించనున్నారు.  కొత్తగా ఎన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోయే బెటాలియన్లలో మహిళా సిబ్బందిని నియమిస్తామని NDRF డీజీ ఎస్.ఎన్ ప్రధాన్ తెలిపారు

6. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ శాఖ తొలి ఛైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు

7. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త కమిటీలను నియమించారు. దానికి సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి

1) పయ్యావుల కేశవ్

2) పీడిక రాజన్న దొర

3) చిర్ల జగ్గిరెడ్డి

 

ఎ) ప్రజాపద్దుల కమిటీ

బి) ప్రభుత్వ రంగ సంస్థల (పబ్లిక్ అండర్ టేకింగ్) కమిటీ

సి) అంచనాల కమిటీ

8. తెలంగాణలో బతుకమ్మ చీరలకు సంబంధించి ఈ కింది ప్రకటల్లో ఏవి సరైనవి కావు

1) మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.313 కోట్లు

2) ఒక్కో చీకు వ్యయం రూ.280

3) బతుకమ్మ చీరలను 26వేల మగ్గాలతో 16 వేల మంది చేనేత కార్మికులు 6 నెలల్లో తయారు చేశారు

4) కిందటేడాది 99 లక్షల మందికి చీరలు పంపిణీ చేశారు. ఈసారి 1.02కోటి చీరలు తయారు చేశారు.

9. కృత్రిమ మేథ (AI) పరిశోధనా ప్రయోగశాలను గూగుల్ రీసెర్చ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ గా ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది ?

10. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బ్రాండ్ విలువ ఎన్ని కోట్లకు చేరుకుందని డఫ్ అండ్ పెల్స్ఫ్ నివేదిక వెల్లడించింది

11. వైమానికి దళాధిపతిగా ప్రస్తుతం ఉన్న బి.ఎస్. ధనోవా స్థానంలో 2019 సెప్టెంబర్ 30న నియమితులు కానున్న  ఎయిర్ మార్షల్ ఎవరు ?

12. కాంతితో ప్రేరేపితమై పనిచేసే కండర కణజాలాన్ని ఉపయోగించి... స్వీయ నియంత్రణతో కూడిన రోబో (బయో రోబో)ల తయారు చేస్తున్న అమెరికాలోని యూనివర్సిటీ ఏది ?

13. స్కార్పీన్ శ్రేణి రెండో జలాంతర్గామిని మజ్ గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ని నౌకాదళానికి అప్పగించింది. దాని పేరేంటి ?

14. విద్యుత్ వాహనాల (EV) ను అందుబాటు ధరల్లో ఆవిష్కరించేందుకు భవిష్యత్తులో తయారు చేసే ఈవీల కోసం సరికొత్త పవర్ ట్రెయిన్ (మోటార్ ) ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది ?

15. 2017-18 నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి 125.90 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి జరగగా... అందులో 34.50 లక్షల టన్నులు (27.40శాతం) తో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?

16. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం రూ.1,00,899 ల బోనస్ ప్రకటించింది.  సంస్థ లాభాల్లో ఎంత శాతం వాటాను కార్మికులకు అందిస్తున్నారు ?

17. స్మార్ట్ ఫోన్లు, స్పీకర్లు, కంప్యూటర్లలోని అసిస్టెంట్స్ తో తెలుగు, హిందీ సహా మరో 7 భారతీయ భాషల్లోనూ మాట్లాడేలా అప్ డేట్ చేస్తున్నట్టు ప్రకటించిన సంస్థ ఏది ?