G-948507G64C

2025 కొత్త కొలువులకు జనరల్ స్టడీస్

2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ విజయం కలగాలని ఆశిస్తున్నాను.  ఎస్సీ వర్గీకరణ అయిపోయాక… జనవరి లేదా ఫిబ్రవరిలో తెలంగాణలో కొత్త జాబ్ కేలండర్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వెల్లడి అవుతాయి.  6 వేల దాకా మళ్ళీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.  SC వర్గీకరణ రిపోర్ట్ కూడా ఈ నెలాఖరులోగా వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

చాలామంది గ్రూప్ 1 వస్తుందా… 2 వస్తుందా అని అడుగుతున్నారు… కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ సాక్షిగా జాబ్ కేలండర్ విడుదల చేసింది… మీకు తెలుసు… అందువల్ల SC రిజర్వేషన్ సంగతి తేలగానే… తప్పనిసరిగా ఉద్యోగాల భర్తీ మళ్ళీ మొదలు పెట్టాల్సిందే… లేకపోతే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు.  కొత్త ఏడాదిలో మాత్రం మళ్ళీ నోటిఫికేషన్లకు ఛాన్స్ ఉంటుంది.

ఇక

2025 లో కొత్తగా భర్తీ చేయబోయే పోస్టులకు సంబంధించి అన్ని ఎగ్జామ్స్ లో కామన్ గా ఉండే జనరల్ స్టడీస్ కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి… ఏం పుస్తకాలు చదవాలి… ఎలాంటి ప్లానింగ్ ఉండాలి అన్నది నేను ఈ ఆర్టికల్ లో వివరిస్తాను.  ప్రతి ఒక్కరూ మొత్తం ఆర్టికల్ చదవండి.. లేకపోతే ప్రిపరేషన్ విధానం మీకు అర్థం కాదు.  చాలామంది కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి… అలాగే మొన్నటి దాకా సెంట్రల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయి…. సడన్ గా స్టేట్ ఎగ్జామ్స్ లో ఎంట్రీ ఇవ్వాలనుకునేవారికీ ఈ ఆర్టికల్ పనికొస్తుంది… పాత వాళ్ళకి ఈ టాపిక్స్ తెలిసివే ఉంటాయి.

తెలంగాణలో TGPSC ద్వారా భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకి కూడా జనరల్ స్టడీసీ దాదాపు కామన్ గా ఉంటుంది.  పోలీస్ ఉద్యోగాలకు కూడా ఇలాగే ఉంటుంది… ఒకట్రెండు అంశాలు అదనంగా ఉంటాయి.  డిగ్రీ పాసైన అందరికీ కూడా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 3 … ఒక వేళ పడితే VRO/ VLO దాని పేరు ఏదైనా కావొచ్చు… వీటన్నింటినీ రాసే ఛాన్స్ ఉంటుంది.  అలాగే ఈ ఉద్యోగాలు అన్నింటికీ కూడా ఇదే జనరల్ స్టడీస్ ఉంటుంది.  కాకపోతే… గ్రూప్స్ ని బట్టి  ప్రశ్నల స్థాయి అనేది ఉంటుంది.

గ్రూప్ 1, 2,3 వాళ్ళకి మోడరేట్ నుంచి హార్డ్ గా ప్రశ్నలు వస్తాయి… స్టేట్ మెట్ మెంట్ మోడల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే VRO లేదా మిగతా గ్రూపుల వారికి ఈజీ నుంచి మోడరేట్ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి.

మనం మొత్తం 3 వీడియోలో జనరల్ స్టడీస్ కి సంబంధించిన మొత్తం 13 అంశాల గురించి చెప్పుకుందాం…

అసలు జనరల్ స్టడీస్ లో ఉండే అంశాలేంటి ?

1)జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

2)అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు

3) జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత సాధించిన విజయాలు:-

4) పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ-నివారణ, ఉపశమన వ్యూహాలు :-

5) ప్రపంచ, భారత, తెలంగాణ భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం

6) భారత రాజ్యాంగం

7) భారత దేశ రాజకీయాలు, ప్రభుత్వ పాలన

8) భారత దేశ ఆధునిక చరిత్ర – స్వాతంత్ర్య ఉద్యమంపై ఫోకస్

9) తెలంగాణ చరిత్ర,  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం

10) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం:-

11) తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథకాలు

ఇవి కాకుండా

గ్రూప్ 1,2,3 స్థాయిలో

12) సామాజిక వెలి, హక్కులు – అంశాలు, సమ్మిళిత విధానాలు:

13) బేసిక్ ఇంగ్లీష్ ( ssc స్టాండర్డ్) ఉంటాయి.

14) సెక్రటరియేట్ ఎబిలిటీస్…

సెక్రటేరియల్ ఎబిలిటీస్ కింద మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, న్యూమెరికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ…  ఇంగ్లీష్ లో కాంప్రహెన్షన్ లాంటివి ఉంటాయి.  మొత్తం 13 అంశాల గురించి చెప్పుకుందాం… ఈ వీడియోలో జనరల్ స్టడీస్ లో మొదటి నుంచి 5వ టాపిక్ దాకా చెబుతాను.  రెండో వీడియో లో … 6 నుంచి 12 టాపిక్స్ … ఇక మూడో వీడియోలో… ప్రత్యేకంగా మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ గురించి వివరిస్తాను. మొత్తం 3 వీడియోలు ఉంటాయి.

ప్రస్తుతం ఈ వీడియోలో తెలంగాణలో జరిగే అన్ని ఎగ్జామ్స్ కి కామన్ గా ఉండే జనరల్ స్టడీస్ లో 13 టాపిక్స్ లో first 5 topics గురించి చెప్పుకుందాం.

1. జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

అంటే కరెంట్ ఎఫైర్స్… ఇవి మీరు ఎగ్జామ్ రాయబోయే ఏడాది… ఏడాదిన్నర ముందు వరకూ చూసుకోవాలి.  అంటే one and half year or one year ముందు నుంచి… ఖచ్చితంగా మాత్రం 6 నెలల ముందువి అంటే గట్టిగా ప్రిపేర్ అవ్వాలి.  కరెంట్ ఎఫైర్స్ లో ప్రాంతీయ అంశాలు అంటే తెలంగాణకు సంబంధించినవి…. జాతీయ అంశాలు … అంటే దేశవ్యాప్తంగా… అటు కేంద్ర ప్రభుత్వం గానీ… ఇతర రాష్ట్రాల్లో జరిగే అంశాలను గానీ… ఇలా అన్నీ కవర్ చేయాలి. ప్రతి ఎగ్జామ్ లో కూడా Current Affairs బేస్డ్ గానే మిగతా సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. సో… మీరు కరెంట్ ఎఫైర్స్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి.

ఇతర సబ్జెక్టుల బేస్డ్ గా అంటే ఏంటి అంటే… One nation – One Election అంటే జమిలీ ఎన్నికలు… దేశంలో పార్లమెంట్ తో పాటే… అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా కలిపి ఎన్నికలు జరగాలి… దాని వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుంది అని బీజేపీ ఆధ్వర్యలోని nda ప్రభుత్వం భావిస్తోంది.  అందుకోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టింది. అది జేపీసికి పంపారు…   ఇది కరెంట్ ఎఫైర్ కింద రావొచ్చు.  అలాగే… గతంలో ఇలాంటి జమిలీ ఎన్నికలు ఎప్పుడైనా జరిగాయా… జరిగితే ఎప్పుడు అని తెలుసుకొని… దాన్ని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయాలి… అప్పుడు అది పాలిటీ కిందకు వస్తుంది… అలాగే… వార్తల్లో ప్రదేశాలు ఉంటే… దానికి సంబంధించి జాగ్రఫీ… బడ్జెట్ లు, కొత్త పథకాలు లాంటి అంశాలను ఎకానమీ కోణంలో… ఇలా ప్రస్తుతం జరుగుతున్న లేదా వర్తమాన అంశాలన్నీ కూడా కరెంట్ ఎఫైర్స్ కిందకు వస్తాయి. General Studies లో ఎక్కువ ప్రశ్నలు దీన్ని బేస్ చేసుకునే వస్తున్నాయి.

కరెంట్ ఎఫైర్స్ ప్రిపరేషన్ అనేది… డే 1 నుంచి ఉండాలి.  చాలామందికి ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది… అదేంటి అంటే… ఎగ్జామ్ ముందు 6నెలల కరెంట్ ఎఫైర్స్, ఏడాది కరెంట్ ఎఫైర్స్ అని వివిధ మేగజైన్స్ వాళ్ళు ప్రింట్ చేసే బుక్స్ తెచ్చుకొని చదువుతుంటారు.  అలా చేయొద్దు.  దాని వల్ల ఒక్క మార్కు ప్రయోజనం కూడా ఉండదు. మరి కరెంట్ ఎఫైర్స్ ఎలా చదవాలి అంటే….

డే 1 నుంచి అంటే ఇవాళ్టి నుంచి మీరు… డైలీ న్యూస్ పేపర్లు స్టడీ చేయాలి… అందులో ముఖ్యంగా ఇంగ్లీషులో అయితే ది హిందూ… తెలుగులో అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్ లాంటివి చూడాలి.  వీటిల్లో అంతర్జాతీయ అంశాల దగ్గర నుంచి ప్రాంతీయ అంశాల దాకా అన్నీ కవర్ అవుతాయి.  వాటిని నోట్ చేసుకోవాలి.  లేదంటే… మీకు కంప్యూటర్ ఉంటే… ఈ పేపర్ల నుంచి వాటిని కట్ చేసి ఫోల్డర్లలో పెట్టుకుంటే బెటర్. అలాగే నోట్స్ కూడా రాసుకోవాలి… ప్రతి రోజూ … నోట్స్ లో ఆ కరెంట్ ఎఫైర్ టాపిక్ ని పాయింట్స్ వైజ్ గా రాసుకోవాలి.  చివర్లో కరెంట్ ఎఫైర్స్ మేగజైన్స్ చదివితే మార్కులు వస్తాయి అనుకోవద్దు. ఇప్పుడు ప్రతి రోజూ చదువుకుంటూ… నోట్స్ రాసుకుంటూ… రిలేటెడ్ సబ్జెక్టులకు సంబంధించి టాపిక్స్ చదువుకుంటూ పోతే… మీరు ఫుల్లీ అప్ డేటెట్ గా తయారవుతారు.

రిఫరెన్స్ బుక్స్ :

మంత్లీ మేగజైన్స్ : వివేక్, షైన్ ఇండియా, యోజన మంత్లీ మేగజైన్ బుక్స్ తో పాటు… ప్రతి రోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్ చూడండి. పాయింట్స్ నోట్ చేసుకోండి.

2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు

అంటే International Relations, Events… ఈ టాపిక్ కింద భారత్ తో ఇతర దేశాలకు ఉన్న సంబంధాల మీద ఫోకస్ చేయాలి.  ముఖ్యంగా మన పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక లాంటి దేశాలతో పాటు … మనం ఫ్రెండ్షిప్ చేస్తున్న దేశాలు అంటే… అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, UAE, సింగపూర్ లాంటి దేశాలతో సంబంధాలు… రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి, విదేశాంగమంత్రి పర్యటనలో… ఆయా దేశాలతో రిలేషన్ షిప్స్, సమావేశాలు, భాగస్వామ్య ఒప్పందాలు… Free Trade agreements లాంటివి చూడాలి.  ప్రతి రోజూ పేపర్లలో వస్తుంటాయి. వాటిని నోట్ చేసుకోవాలి. పాయింట్స్ వైజ్ గా మాత్రమే.  … ఇటీవల వచ్చిన ఎగ్జామ్స్ లో… అంతర్జాతీయంగా జరిగిన సమావేశాలు, సదస్సులకు సంబంధించి… గతంలో ఎక్కడెక్కడ జరిగాయన్న ప్రశ్నలు అడిగారు… వాటి సంవత్సరాలు కూడా అడిగారు…ఉదాహరణకి… మీరు ఇవాళ సార్క్ సమావేశం గురించి ప్రశ్న చదివారనుకోండి… సార్క్ సమావేశాలు ఎప్పుడు మొదలయ్యాయి…. మన దేశంలో ఎన్నిసార్లు జరిగాయి… ఎక్కడ జరిగాయి… ఇలా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చదవాలి…

ఒక్కటి గుర్తుపెట్టుకోండి… బిట్టుని బిట్టుగానే చదివితే ఉపయోగం లేదు… దాని అనలైజ్ చేస్తేనే… మీకు ఉపయోగం… పైగా ఆ బిట్ ఎప్పటికీ మీకు గుర్తుండి పోతుంది.

రిఫరెన్స్ బుక్స్ :

మంత్లీ మేగజైన్స్ : వివేక్, షైన్ ఇండియా, యోజన మంత్లీ మేగజైన్ బుక్స్ తో పాటు… ప్రతి రోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్ చూడండి. పాయింట్స్ నోట్ చేసుకోండి

3) జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించిన విజయాలు:-

గ్రూప్స్ లో అన్ని పరీక్షలకు జనరల్ స్టడీస్ పేపర్ కు సంబంధించిన జనరల్ సైన్స్, టెక్నాలజీ అంశాలపై ప్రిపరేషన్ కొనసాగించాలి. జనరల్ సైన్స్ లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం లాంటి విభాగాలు ఉంటాయి. వీటితో పాటు  సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్షం, పర్యావరణ కాలుష్యం, జీవ వైవిధ్యం లాంటి అంశాలు ఉంటాయి.

జనరల్ సైన్స్ లో ఇచ్చే ప్రశ్నలు ఏవైనా నిత్య జీవితంలో ఎదుర్కునే అంశాలపైనే ఉంటాయి. కానీ సబ్జెక్ట్ లోతుగా చదవాల్సిన పనిలేదు. 6-10 టెక్ట్స్ బుక్స్ లో మనకు కావాల్సినంత సమాచారం ఉంటుంది. ఇవి మొదట చదవడం వల్ల సైన్స్ పదాలపై అవగాహన ఏర్పడుతుంది. దాంతో సమకాలీన అంశాలు తేలిగ్గా అర్థం చేసుకొని చదవడం వీలవుతుంది. జనరల్ సైన్స్ కింద బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.  వీటన్నింటిలో కూడా బేసిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.  ఫిజిక్స్, కెమిస్ట్రీలో నిత్య జీవితంలో పనికొచ్చే అనువర్తిత అంశాలు, జీవశాస్త్రంలో మానవ శరీర ధర్మ శాస్త్రం, వ్యాధులు, పోషణ, విటమన్లు, ముఖ్యమైన జంతువుల, మొక్కల శాస్త్రీయ నామాలు, వ్యాధి శాస్త్రం… రీసెంట్ గా వచ్చిన డీసీజెస్.. అవి ప్రభావితం చూపించిన దేశాలు లేదా ప్రాంతాలు లాంటి వాటిపై ఫోకస్ చేయాలి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష ప్రయోగాలు, క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, జెట్ ఫైటర్లు… ఇస్రో విజయాలు… ఇలా ఫాస్ట్ నుంచి  ప్రజెంట్ దాకా వస్తాయి.  భారత దేశం ప్రస్తుతం అంతరిక్ష రంగంలో దూసుకుపోతోంది. శాటిలైట్స్ ప్రయోగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. ప్రతి యేటా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపుతోంది. మన అంతరిక్ష రంగం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ సాధించిన విజయాలపై దృష్టి పెట్టాలి. మెయిన్ గా ఈ శాటిలైట్స్ కు ఉపయోగించిన ఇంజన్లు, ద్రవ ఇంధనం, రిమోట్ సెన్సింగ్, ఇన్సాట్ లాంటి అంశాలపై అవగాహన ఉండాలి. ఇవి కాకుండా… బయో టెక్నాలజీ, మూలకణాలు, జన్యుమార్పిడి, టీకాలు, మొక్కలు, ఐటీ-సోషల్ నెట్ వర్కింగ్, బ్లాక్ టెక్నాలజీ, AI లాంటి లేటెస్ట్ టెక్నాలజీ దాకా అన్నీ కవర్ చేస్తారు.  అన్నీ ప్రిపేర్ అవ్వాలి.

Reference Books:

రోజువారిగా పేపర్లలో వచ్చిన అప్ డేట్స్, మంత్లీ మేగజైన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇది కాకుండా… విన్నర్ పబ్లికేషన్స్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ based on NCERT బుక్స్ ఉంది.  LINK  ఇంకో బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకాలజీ, ఎన్విరాన్ మెంట్ & హెల్త్ పేరుతో Purvi పబ్లికేషన్స్ బుక్ ఉంది.  అమెజాన్ లింక్స్ వెబ్ సైట్ లో ఇస్తాను. కొనుక్కోండి. LINK

4. పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ-నివారణ, ఉపశమన వ్యూహాలు :-

ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి. సివిల్ సర్వీసెస్ లో ఈ సబ్జెక్ట్ కి చాలా ప్రాధాన్యత ఉంది.  అందువల్ల 10 ప్రశ్నలదాకా పర్యావరణం చాప్టర్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.  వాయు, జల కాలుష్యాలు, భూతాపం పెరగడానికి కారణాలు, గ్రీన్ హౌస్ వాయువులపై స్టడీ చేయాలి. అలాగే లేటెస్ట్ గా జరిగిన పర్యావరణ సదస్సులు, దేశంలోని విపత్తుల నిర్వహణ కార్యాలయాలు, ఇవి ఏ కేంద్ర ప్రభుత్వ శాఖల కిందకు వస్తాయి. రాష్ట్రంలో విపత్తుల నిర్వహణను ఏ శాఖలు చూస్తాయి. విపత్తుల విభాగంలో భూకంపాలు, వరదలు, కరువు కాటకాలు, తుఫాన్లు లాంటి వాటితో పాటు వీటి నిర్వహణ, ఉపశమన వ్యూహాలు లాంటి అంశాలు స్టడీ చేయాలి.

Reference Books:

రోజువారిగా పేపర్లలో వచ్చిన అప్ డేట్స్, మంత్లీ మేగజైన్స్ లో  విపత్తు నిర్వహణకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అంటే కాప్ సమావేశాలు, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాలు లాంటివి ఫాలో అవ్వాలి. ఇవి కాకుండా… విపత్తు నిర్వహణ అని అకాడమీ LINK బుక్ ఉంది… వివన పబ్లికేషన్స్ ది లేటెస్ట్ బుక్ కూడా ఉంది… LINK

5.ప్రపంచ, భారత, తెలంగాణ భూగోళ శాస్త్రం:-

జాగ్రఫీకి సంబంధించి సమకాలీన అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అలాగే సబ్జెక్టులోని అంశాలు, సమకాలీన అంశాలను కూడా స్టడీ చేయాలి. గత ప్రశ్నల ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయన్నదానిపై అవగాహన ఏర్పరచుకోవాలి. అందుకోసం ప్రీవియస్ ఇయర్ ప్రశ్నల బుక్స్ తెచ్చుకోండి.

ఎ.వరల్డ్ జాగ్రఫీ:-

విశ్వం, సౌర కుటుంబం, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆకాశంలో ఉన్న ఆవరణాల గురించి తెలుసుకోవాలి. భూభ్రమణం, భూపరిభ్రమణం, అంక్షాలు, రేఖాంశాలు, భూమి అంతర్నిర్మాణం, భూమి పొరలు, భూచలన సిద్దాంతాలు, శిలలు, మృత్తికలు, క్రమ క్షయం లాంటివి చదవాలి. పీఠభూములు, మైదానాలు, భూస్వరూపాలు, అంతర్జాతీయ దిన రేఖ, స్థానిక కాలం లాంటివి చూడాలి. ప్రధాన పంటలు అవి పండించే దేశాలు, వ్యవసాయ రీతులు, ఉత్పత్తులు, అటవీ విస్తరణ, సమస్యలు, అంతరిస్తున్న జీవజాతులు, రెడ్ డేటా బుక్ గురించి తెలుసుకోవాలి.

బి. ఇండియన్ జాగ్రఫీ:-

దేశానికి సంబంధించిన భౌగోళిక ప్రాంతాల ఉనికి, సహజ వనరులపై అవగాహన ఉండాలి. మనదేశంతో ఇతర దేశాలకు ఉన్న సరిహద్దులు, వాటి పేర్లు, బోర్డర్ లో ఉన్న రాష్ట్రాల వివరాలపై ప్రశ్నలు వస్తున్నాయి. నీటిపారుదల, పంటల విస్తరణ, వార్తల్లో ఉన్న నదులు, ఉపనదులు, వాటిపై ఆనకట్టలు తెలుసుకోవాలి. రుతుపవనాలు, వర్షపాతం విస్తరణ, ఖనిజ వనరులు, పరిశ్రమలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, రోడ్డు, రైల్వే… జలమార్గాలు, పోర్టులు… ఎయిర్ పోర్టులు… రైల్వే స్టేషన్లు… పర్యావరణ హితంగా నిర్మిస్తున్న ఎయిర్ పోర్టులు… లాంటి  ప్రశ్నలు వస్తున్నాయి. దేశంలోని ఆదిమ తెగలు, వారి సంస్కృతులను భౌగోళిక ప్రాంతాల వారీగా చదవాలి. మన దేశంతో చైనా, పాకిస్తాన్ ఇతర దేశాలతో ఉన్న నదీ జలాల గొడవలు స్టడీ చేయాలి. పాకిస్తాన్ –ఇండియా, భారత్ – చైనా మధ్య నదీ జలాల వివాదాలు స్టడీ చేయాలి.  ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ తో ఉన్న ప్రాబ్లెమ్స్ కూడా చదవాలి.

సి. తెలంగాణ జాగ్రఫీ:-

ఇండియన్ జాగ్రఫీలో అంశాలను ప్రత్యేకంగా తెలంగాణ దృష్టితో కూడా చదవాలి. తెలంగాణ భూస్వరూపం, నేలలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టుల వివరాలు, పండే పంటలు, పరిశ్రమలు, వర్షపాతం వివరాలు, కరువు మండలాలు గురించి చదవాలి. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నదీ ప్రాజెక్టులు, ముఖ్యంగా భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ కాళేశ్వరం, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి అంశాలపై దృష్టిపెట్టాలి.  అలాగే కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.

Reference Books:

జాగ్రఫీ : ప్రపంచం – భారత దేశం – తెలంగాణ ADV రమణ రాజు : బుక్ LINK

తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని తెలుగు అకాడమీ బుక్ ఉంది. LINK

ఇది కాకుండా… తెలంగాణ జాగ్రఫీ 33 జిల్లాల సమగ్ర స్వరూపం పేరుతో విన్నర్స్ వాళ్ళది కూడా బుక్ ఉంది. LINK

ఆర్థిక శాస్త్రం

గ్రూప్ 2,3 లెవల్లో ఆర్థిక శాస్త్రానికి ప్రత్యేకంగా పేపర్ ఉంది కాబట్టి… జనరల్ స్టడీస్ లో ఎకానమీ ఉండదు. కానీ గ్రూప్ 4 లేదంటే VRO/JRO ఇంకా టెక్నికల్, అగ్రికల్చరల్ పోస్టులకు… పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళకి…. జనరల్ స్టడీస్ లో 5th Topic లోనే జాగ్రఫీతో పాటు ఎకానమీ కూడా ఉంది.  ఈ వీడియోలో ఈ టాపిక్  వరకూ చెప్పుకుందాం… మిగిలిన టాపిక్స్ మరో రెండు ఆర్టికల్స్ లో ఇస్తాను.

ఆర్థిక శాస్త్రం…అంటే ఎకానమీ గురించి చెప్పుకుందాం….

జనరల్ స్టడీస్ లో ఎకానమీ 10 నుంచి 15 ప్రశ్నలు దాకా వస్తాయి.  గ్రూప్ 2, 3 లో ఎకానమీ పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది… టాపిక్స్ కఠినంగా ఉంటాయి…  ప్రశ్నలు కూడా హార్డ్ గానే వస్తాయి.  మిగతా పరీక్షల్లో మాత్రం… ఎకానమీలో ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లేటెస్ట్ బడ్జెట్లు లు… అలాగే బడ్జెట్ కు సంబంధించి ప్రాథమిక అంశాలు, ఏ శాఖలకు ఎంత కేటాయింపులు… కొత్తగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు… బ్యాంకులు, జనాభా అంశాలు… లాంటివి చదివితే సరిపోతోంది.  జనరల్ స్టడీస్ లో ఎకానమీకి కూడా ఖచ్చితంగా … డైలీ పేపర్లు చూడాలి… నోట్సు రాసుకోవాలి… కరెంట్ ఎఫైర్స్ తో ముడిపడిన అంశాలనే ఇక్కడ కూడా ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఇది కాకుండా… 8,9,టెన్త్… ఇంటర్ లెవల్లో ఎకానమీ మీద బేసిక్ అంశాలు కూడా ప్రిపేర్ అవ్వాలి. జాతీయాదాయం, తలసరి ఆదాయం లెక్కింపు పద్దతులు… వివిధ ఆర్థిక వేత్తల నిర్వచనాలు, ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి…. పేదరికం, నిరుద్యోగం… లాంటి అంశాలను చదవాలి.

Reference Books:

ఎకానమీ లేటెస్ట్ అంశాల కోసం తప్పకుండా డైలీ పేపర్లు తిరగేయాలి… వాటిల్లో లేటెస్ట్ అంశాలను రాసుకోవాలి. ఉదా: బడ్జెట్ అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొత్త పథకాలు, ప్రభుత్వాల విధానాలు… జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం లేటెస్ట్ ఫిగర్స్…. మన దేశానికి సంబంధించి రిలీజ్ అయ్యే అంతర్జాతీయ సూచీలు, నివేదికలు… RBI విధానాలు… డిజిటల్, UPI లావాదేవీలు లాంటివి అన్నీ కూడా లేటెస్ట్ సమాచారం… డైలీ పేపర్లు, మంత్లీ మేగజైన్స్ నుంచి సేకరించాలి. ఇవి కాకుండా రిఫరెన్స్ బుక్స్ కావాలి అంటే….

ఇండియన్ ఎకానమీ పేరుతో MCREDDY పబ్లిషర్స్ బుక్ లేటెస్ట్ బుక్ మార్కెట్లో ఉంది. LINK

జీనియస్ పబ్లషర్స్ బుక్ కూడా మార్కెట్లో లేటెస్ట్ ది ఉంది. LINK

జనరల్ స్టడీస్ లో 13 అంశాలపై మరో రెండు వీడియోల్లో ఇస్తాను. వాటిని కూడా చూడండి.

తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ subscribe చేసుకోండి… వీడియో లైక్ చేయండి.

https://www.youtube.com/@TelanganaExams

Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO లాంటి Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

 

Hot this week

BEL లో 83 అప్రెంటీస్ లు

Bharath Electronics Limited (BEL), Chennai లో Graduate, Diploma, B.Com.,...

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల...

విశాఖ స్టీల్స్ లో 250 అప్రెంటీస్ లు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్...

VROల నియామకంపై మంత్రి క్లారిటీ 

గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియను...

Test 2

https://telanganaexams.com/web-stories/test-2/

Topics

BEL లో 83 అప్రెంటీస్ లు

Bharath Electronics Limited (BEL), Chennai లో Graduate, Diploma, B.Com.,...

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల...

విశాఖ స్టీల్స్ లో 250 అప్రెంటీస్ లు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్...

VROల నియామకంపై మంత్రి క్లారిటీ 

గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియను...

Test 2

https://telanganaexams.com/web-stories/test-2/

Test 1

https://telanganaexams.com/web-stories/test-model/
spot_img

Related Articles

Popular Categories