20 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.

20 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంద్రప్రదేశ్ )

1. దేశంలోని అందరికీ ఆరోగ్య బీమా ఉండేందుకు ఇప్పుడున్న వైద్య సంరక్షణ పథకాలను కలిపి హెల్త్ కేర్ సిస్టమ్ ను తయారు చేయాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది.  అయితే GDP లో ఎంత శాతాన్ని ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఖర్చు చేస్తోంది ?

2. తెలంగాణలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది.  స్వైన్ ఫ్లూ కారణమైన వైరస్ పేరేంటి ?

3. ప్రకృతికి సంబంధించి ‘‘అవని" పుస్తకాన్ని రాసింది ఎవరు ?

4. ఇందిరాగాంధీ శాంతి బహుమతికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

ఎ) 2018 సంవత్సరానికి ఈ అవార్డును సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (CSE) అధినేత సునీతా నారాయణ్ కు ప్రదానం చేశారు

బి) 2019 సంవత్సరానికి బ్రిటన్ కు చెందిన పర్యావరణ వేత్త డేవిడ్ అటెన్ బరోను ఎంపిక చేశారు

సి) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలోని న్యాయనిర్ణేతల బృందం అటెన్ బరో పేరును ప్రకటించింది

5. 2021 జనాభా లెక్కల కోసం రూ.8,754.22 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖ సిఫార్సు చేసింది.  అందుకోసం డిజిటల్, పేపర్ రెండూ వినియోగించాలని నిర్ణయించారు. అయితే దేశంలోని ఎన్ని భాషల్లో 2021 జనాభా లెక్కలను సేకరించనున్నారు ?

6. పట్టు పరిశ్రమలో పరిశోధనలతో విశేష కృషి చేసిన తెలంగాణ శాస్త్రవేత్త కి జపాన్ లోని అంతర్జాతీయ పట్టు కమిషన్ నుంచి ప్రతిష్టాత్మక లూయీస్ పాశ్చర్ పురస్కారం దక్కింది.  ఆయన పేరేంటి ?

7. 2019కి జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పురస్కారం ఏ రాష్ట్రానికి దక్కింది ?

8. భారత్ తో  మూడు నెలలుగా నిలిచిపోయిన పోస్టల్ మెయిల్ సర్వీసులను పునరుద్దరించిన పొరుగు దేశం ఏది ?

9. తెలంగాణలో ఎన్ని సర్కార్ దవాఖానాల్లో కేంద్ర ప్రభుత్వ అమృత్ మెడికల్ షాపులు ప్రారంభించనున్నారు ?

10. ప్రపంచంలో మొదటగా  WHO ఆమోదించిన టైఫాయిడ్ వ్యాక్సిన్ ను అనుమతించిన దేశం ఏది