తెలంగాణ ఉద్యమ ఆవిర్బావం (1969)

1) ఏ ఆర్డర్ ప్రకారం తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు ?
జ: 1958 లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం
2) తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేవారు ?
జ: 1958 ఫిబ్రివరి 20
3) తెలంగాణ ప్రాంతీయ కమిటీలో ఎంతమంది సభ్యులు ?
జ: 9 మంది
4) తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు ?
జ: కె.అచ్చుత రెడ్డి ( 1958-1962)
5) తెలంగాణ కమిటీ అధ్యక్షులు - ఉపాధ్యక్షులు
మొదటిది(1958-62) : కె.అచ్చుత రెడ్డి , మాసూమా బేగం (ఉపా)
రెండోది (1962-1967) : టి.హయగ్రీవాచారి, టి.రంగారెడ్డి
మూడోది(1967-1972) : జె.చొక్కారావు, కోదాటి రాజమల్లు
నాలుగోది(1972) : కోదాడి రాజమల్లు, సయ్యద్ రహమత్ అలీ
6) తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఎప్పుడు రద్దయింది ? ఎందుకు ?
జ: 1972-73 కాలంలో... జై ఆంధ్ర ఉద్యమం జరిగిన తర్వాత ఆరు సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది. దాంతో ప్రాతీయ కమిటీని రద్దు చేశారు.
7) పి.వి. నర్సింహారావు ముఖ్యమంత్రిగా ఎంతకాలం పదవిలో కొనసాగారు ?
జ: ఒక సంవత్సరం 3 నెలల 23 రోజులు
9) తెలంగాణ రక్షణల దినంను ఎప్పుడు పాటించారు ?
జ: 10 జులై 1968
10) తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ ను ఎప్పుడు తీసుకొచ్చారు?
జ) 1957.
11) తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలను హెచ్చరించిన వారెవరు?
జ) గులాం పంజతన్
12) తెలంగాణ ప్రజల కోరికను మన్నించనట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోవాల్సి వస్తుందని హెచ్చరించిన కార్మిక సంఘాల నాయకుడెవరు ?
జ: మహదేవ్ సింగ్
13) ఉర్దూ స్దానంలో తెలుగును అధికార భాషగా ప్రకటించిన సంవత్సరం?
జ) 1966
14) తెలంగాణ తొలి ఉద్యమానికి వేదికైన ప్రాంతం ఏది?
జ) ఖమ్మం జిల్లాలోని పాల్వంచ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ )
15) కొత్త గూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో ఎక్కువగా ఆంధ్రులే పనిచేస్తున్నారని మొదట వెలుగులోకి తెచ్చింది ఎవరు ?
జ: ఇల్లెందుకు చెందిన రామదాసు
15) 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణ కలిగించిన సంఘటన ఏది ?
జ: తెలంగాణ పరిరక్షణలను అమలు చేయాలంటూ పాల్వంచలో రవీంద్రనాథ్ నిరాహార దీక్ష చేపట్టడం (1969 జనవరి 5)
17) రవీంద్రనాథ్ దీక్షకు మద్దతు తెలిపిన ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు, కవి ఎవరు ?
జ: కవిరాజమూర్తి
18) కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లోని నాన్ ముల్కీలను తొలగించాలన్న డిమాండ్ తో పాల్వంచో ఆమరణ నిరాహార దీక్ష చేసింది ఎవరు ?
జ: పోట్రు కృష్ణ మూర్తి
19) తెలంగాణలో రక్షణల అమలును చర్చించేందుకు 1969 జనవరి 19న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ?
జ: కాసు బ్రహ్మానంద రెడ్డి
20) రవీంద్రనాథ్ దీక్షను విరమింప చేసినది ఎవరు ?
జ: జలగం వెంగళరావు
21) ముల్కీల పరిరక్షణ కోసం కాసు బ్రహ్మానంద రెడ్డి తీసుకొచ్చిన జీవో ఏది ?
జ: జీవో నెం. 36
22) 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరులు ఎవరు? కాల్పులు ఎక్కడ జరిగాయి ?
జ: 1969 జనవరి 24న సదాశివపేటలో పోలీస్ కాల్పుల్లో శంకర్, కృష్ణ అనే విద్యార్థులు చనిపోయారు
23) తెలంగాణలో మిగులు నిధులను అంచనా వేసేందుకు నియమించిన కమిటీ ఏది ?
జ: కుమార్ లలిత్ కమిటీ (23 జనవర 1969)
24) తెలంగాణలో నికర మిగులు నిధులు ఎంత ఉన్నట్టు కుమార్ లలిత్ కమిటీ తేల్చింది ?
జ: 34.10 కోట్ల రూపాయలు
25) తెలంగాణ సిద్దాంతకర్తగా ఎవరిని పేర్కొంటారు?
జ) ప్రొఫెసర్ జయశంకర్.
26) 1967 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి చెన్నారెడ్డి ఎవరిపై గెలుపొందారు ?
జ: వందేమాతరం రామచంద్రరావు
27) మర్రి చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ఎప్పుడు తీర్పు చెప్పింది ?
జ: 1968 ఏప్రిల్ 20న
28) మర్రి చెన్నారెడ్డి ఎన్నేళ్ళు పోటీచేయడంపై అనర్హత వేటు పడింది ?
జ: ఆరేళ్ళు
29) 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు ?
జ: కాసు బ్రహ్మానందరెడ్డి
30) హైదరాబాద్ రాష్ట్రంలో భూసంస్కరణలకు పునాది వేసింది ఎవరు ?
జ: బూర్గుల రామకృష్ణారావు
31) తెలంగాణ ప్రాంత ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని, దాన్ని చక్కదిద్దాలని రాజ్యసభలో విజ్ఞప్తి చేసింది ఎవరు ?
జ: హరిశ్చంద్ర మోడీ
32) 1967లో ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎవరు కొనసాగుతున్నారు ?
జ: డి.ఎస్.రెడ్డి
33) డీఎస్ రెడ్డిని తప్పించేందుకు వైస్ ఛాన్సలర్ పదవిని 5యేళ్ళ నుంచి 3 యేళ్ళకు తగ్గించిన ముఖ్యమంత్రి ఎవరు ?
జ: కాసు బ్రహ్మానంద రెడ్డి
34) జి.ఓ.36ను ప్రభుత్వం ఎప్పుడు జారీచేసింది?
జ) 1969 జనవరి 21.
35) తెలంగాణ విమోచనోద్యమ సమితి సదస్సు ఎప్పుడు జరిగింది?
జ) 1969 జనవరి 28న
36) గజ్వేలులో కాల్పులు ఎప్పుడు జరిగాయి?
జ) 1969 జనవరి 30.
37) తెలంగాణ ప్రజా సమితి ఎవరి నాయకత్వంలో ఏర్పడింది?
జ) మదన్ మోహన్.
38) ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు ఏర్పాటు చేశారు?
జ) కొండా లక్ష్మణ్ బాపూజీ.
39) తెలంగాణ మృతవీరుల దినంగా ఏ రోజున ప్రకటించారు.
జ) మే17
40) తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ప్రచురించిన తొలి పుస్తకం ఏది?
జ) తెలంగాణ మూవ్ మెంట్ అండ్ ఇన్ వెస్టిగేటివ్ ఫోకస్.
41)తెలంగాణ ఎన్.జి.ఓ.ల నాయకుడు ఎవరు?
జ) కె.ఆర్.ఆమోస్.
42) టిపిఎస్ కాంగ్రెస్ లో ఎప్పుడు విలీనమైంది ?
జ)1971 సెప్టెంబర్ 24.
43) అమరవీరుల స్మారక స్థాపానికి శంకుస్థాపపన చేసింది ఎప్పుడు?
జ) ఫిబ్రవరి 23,1970.
44) అమరవీరుల స్మారకస్దూపాన్ని రూపొందించినవారెవరు?
జ) ఎక్కా యాదగిరిరావు.
45) తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఇందిరాగాంధి ప్రవేశపెట్టిన పధకం ఏమిటి?
జ) అష్టసూత్ర పధకం.
46) జి.ఓ.36ను రాఫ్ట్ర్రప్రభుత్వం ఏరోజు విడుదల చేసింది?
జ) 1969 జనవరి 21.
47) జి.ఓ.36ని వ్యతరేకించిన ఆంద్రనాయకులు ఎవరు?
జ) దామోదరం సంజీవయ్య.
48) పెద్దమనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది?
జ) 14.
49) తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షురాలుగా ఎన్నికైన తొలి మహిళ ఎవరు?
జ) శ్రీమతి సదాలక్ష్మి.
50) ఉపముఖ్యమంత్ర్రి పదవి ఆరో వేలు వంటిదని అన్నది ఎవరు?
జ) నీలం సంజీవరెడ్డి.
51) జంటనగరాలలో 14 సార్లు కాల్పులు ఎప్పుడు జరిగాయి?
జ) 1969 జూన్ 4.