1953 తెలంగాణ రాష్ట్రం – ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు

1) కమ్యూనిస్టులు ఏ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు?
జ) విశాలాంద్ర.
2) ఆంధ్రులు కంటే గొప్ప కవులు తెలంగాణలో ఉన్నారని అన్నవారు ఎవరు?
జ) సురవరం ప్రతాపరెడ్డి
3) 350 మంది తెలంగాణ కవుల వివరాలతో ‘గోల్కొండ కవుల సంచిక‘ ను ప్రచురించనది ఎవరు ?
జ: సురవరం ప్రతాపరెడ్డి
4) ఆంధ్ర రాష్ట్ర్రం ఎప్పుడు ఏర్పడింది?
జ) 1953 అక్టోబర్ 1
5) విశాలాంధ్రను తిరస్కరిస్తూ, తెలంగాణ రాష్ట్ర్ర ఏర్పాటు భావనను మొదటగా తీసుకొచ్చింది ఎవరు?
జ) కె.వి.రంగారెడ్డి ( తెలంగాణ పితామహుడు అంటారు)
6) 1938లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఏ ఉద్యమం జరిగింది?
జ) వందేమాతర ఉద్యమం.
7) వందే మాతరం ఉద్యమంలో పాల్గొని డిబార్ అయిన ఓయూ విద్యార్థులు మొదట ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించారు ?
జ: ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖ పట్నం)
8) అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు?
జ) కట్టమంచి రామలింగారెడ్డి.
9) ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో విద్యార్థులు ఏ కాలేజీల్లో చేరారు ?
జ: నాగపూర్, జబల్ పూర్
10) OU నుంచి డిబార్ అయిన విద్యార్థుల్లో ప్రముఖులు ఎవరు ?
జ: పి.వి.నర్సింహారావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సర్వదేవభట్ల రామనాధం
9) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్రం ఉండాలని తీర్మానాన్ని ఏకగ్రీవంగా చేసినది ఎప్పుడు?
జ) 1954 జూన్ 7,8.
10) బూర్గుల రామకృష్ణారావు ఏ వాదానికి మద్దతు పలికారు?
జ) విశాలాంధ్ర
11) ఆంధ్ర రాష్ట్ర్రం ఎప్పుడు ఏర్పడింది?
జ) 1953 అక్టోబర్ 1, కర్నూల్ రాజధానిగా
12) ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు గవర్నర్ ఎవరు?
జ) చందూలాల్ త్రివేది
13) ప్రత్యేక తెలంగాణ కోసం డిమాండు చేసిన నాయకులు ఎవరు?
జ) సురవరం ప్రతాపరెడ్డి, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి.
14) ఆంధ్ర రాష్ట్ర్ర డిమాండును తిరస్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర్ర డిమాండును చేసిన వారెవరు?
జ) కె.వి రంగారెడ్డి.
15) తెలంగాణ రాష్ట్ర్రం ఉండాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన కమిటీ ఏది?
జ) హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
16) బూర్గుల రామకృష్ణారావు మొదట్లో తెలంగాణవాదిగా ఉండి తర్వాత విశాలాంద్ర వాదిగా మారడానికి గల కారణం ఏంటి?
జ) పదవి, సామాజిక వర్గాల పోరు.
17) భాషా సంయుక్త రాష్ట్ర్రాల ఏర్పాటు పరిశీలనకై ఏ కమీషన్ ఏర్పాటు చేయబడింది?
జ) ఎస్.కె.థార్ కమీషన్
18) సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్ర్ర పునర్విభజన కమీషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?
జ) 1955 సెప్టెంబర్ 30
19) చిన్న రాష్ట్ర్రాల ఏర్పాటుకు మొగ్గుచూపిన వ్యక్తి ఎవరు?
జ) బి.ఆర్.అంబేద్కర్.
20) అంబేద్కర్ చిన్న రాష్ట్ర్రాల ఏర్పాటుపై రచించిన పుస్తకం ఏది?
జ) థాట్స్ ఆన్ లింగ్వెస్టిక్ స్టేట్స్
21) భారతదేశం రెండో రాజధానిని హైదరాబాద్ చేయాలని చెప్పింది ఎవరు?
జ) బిఆర్ అంబేద్కర్.
22) 1936లో దత్త మండలాలకు రాయలసీమగా నామకరణం చేసినది ఎవరు ?
జ: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
23) ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య మదరాసులో శ్రీభాగ్ ఒప్పందం జరిగింది. శ్రీభాగ్ అంటే ఏంటి ?
జ: కాశీనాధుని నాగేశ్వరరావు గారి నివాసం పేరు
( 1937 నవంబర్ 16న ఈ ఒప్పందం జరిగింది)
24) స్వాతంత్ర్యం వచ్చాక భాషా ప్రాతిపదిక రాష్ట్రాల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ నియమించిన కమిషన్ ఏది ?
జ: థార్ కమిషన్
25) థార్ కమిషన్ లో సభ్యులు ఎందరు ? ఎవరు ?
జ: మొత్తం ముగ్గురు. అలహాబాద్ రిటైర్డ్ న్యాయమూర్తి ఎస్.కె.థార్ తో పాటు డా.పన్నాలాల్, జగత్ నారాయణ లాల్
26) ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును పరిశీలించేందుకు ఏర్పాటైన JVP కమిటీలో సభ్యులు ఎవరు ?
జ: జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య