Friday, September 20

1952 గైర్ ముల్కీ ఉద్యమం

1) గైర్ ముల్కీ ఉద్యమానికి నాంది పలికిన ప్రాంతం ఏది?
జ) వరంగల్.
2) 1952 జులైలో వరంగల్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల యాక్షన్ కమిటీకి కన్వీనర్ ఎవరు ?
జ) బుచ్చయ్య
3) వరంగల్ లో ముల్కీ ఉద్యమం మొదలయ్యే టైమ్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నది ఎవరు ?
జ: గోవిందరావు దేశ్ పాండే
4) 1952 ఆగస్టు 24న గైర్ ముల్కీలకు వ్యతిరేకంగా విద్యార్దులు ఎక్కడ బహిరంగ సభ నిర్వహించారు ?
జ) బొల్లారం.
5) సిటీ కాలేజ్ దగ్గర జరిగిన ఊరేగింపులో విద్యార్దులు ఏమని నినాదాలు చేశారు?
జ) ఇడ్లీ సాంబార్ గో బ్యాక్.... గైర్ ముల్కీ గో బ్యాక్.
6) సిటీ కాలేజ్ దగ్గర కాల్పులు ఎప్పుడు జరిగాయి ?
జ: 1952 సెప్టెంబర్ 3న
7) కాల్పులకు అనుమతి ఇచ్చిన నగర మేజిస్ట్ర్రేట్ ఎవరు?
జ) అబ్దుల్ బషీర్.
8) సిటీ కాలేజ్ దగ్గర పోలీసులు ఎన్ని రౌండ్స్ కాల్పులు జరిపారు ?
జ: 12 రౌండ్స్
9) సిటీ కాలేజ్ తర్వాత మరోచోట ఎక్కడ కాల్పులు జరిగాయి ?
జ: మదీనా హోటల్ దగ్గర
10) హైదరాబాద్ లో కర్ఫ్యూ ఎప్పుడు విధించారు?
జ) 1952 సెప్టెంబర్ 4 (జిల్లా మెజిస్ట్రేట్ దిగంబర పెర్షాద్ )
11) ముల్కీ నిబంధనల పరిశీలన కోసం బూర్గుల ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘంనకు ఎవరు అధ్యక్షత వహించారు?
జ: కొండా వెంకట రంగారెడ్డి ( మొత్తం నలుగురు మంత్రులు సభ్యులు)
12) 1952 సెప్టెంబర్ 3,4 తేదీల్లో జరిగిన కాల్పులపై విచారణ జరపడానికి నియమితులైన కమిటీ ఏది ?
జ: జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ
13) జగన్మోహన్ రెడ్డికి సహకరించిన అడ్వకేట్ జనరల్ ఎవరు?
జ) రాజారాం అయ్యర్.
14) మొదటిసారిగా కాల్పులు ఎక్కడ జరిగాయి?
జ) అఫ్జల్ గంజ్.
15) స్థానికులనే ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని ఎవరు డిమాండ్ చేశారు ?
జ)జి.రామాచారి.
16) హైదరాబాద్ కాల్పులపై జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది ?
జ: 1952 డిసెంబర్ 28న