1919 భారత ప్రభుత్వ చట్టం, సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ మీట్స్

01) 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఏమని పిలుస్తారు ?
జ: మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం
(నోట్: భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, గవర్నర్ జనరల్ ఛేమ్స్ ఫర్డ్ ఈ చట్టాన్నిరూపొందించారు )
02) ఎవరి సిఫార్సులతో భారత్ లోని కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయికి అప్పగించారు ?
జ: మాంటేగ్ ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలతో
03) ద్విసభ విధానం, దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ (3యేళ్ళ పదవీ కాలం-143 మంది)కి ఏ చట్టం ప్రకారం ఏర్పాటయ్యాయి ?
జ: 1919 భారత ప్రభుత్వ చట్టం
04) 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏర్పాటు చేశారు. దీని పదవీ కాలం ఎంత ?
జ: 5 యేళ్ళ పదవీ కాలం (60మంది).
05) ఏ చట్టం ప్రకారం ఓ పబ్లిక్ సర్వీస్ కమీషన్, ఓ ఆడిటర్ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు ?
జ: 1919 భారత ప్రభుత్వ చట్టం
06) లెజిస్లేటివ్ కౌన్సిల్ కు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: విఠల్ భాయ్ పటేల్ (అధ్యక్షుడు), సచ్ఛిదానంద సిన్హా (ఉపాధ్యక్షుడు)
07) 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం బడ్జెట్స్ ఏ మార్పు జరిగింది ?
జ: కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ వేరుచేయడం
08) ఆంగ్లో ఇండియన్స్, క్రైస్తవులు, సిక్కులు, ముస్లిమ్ లకు ప్రత్యేక నియోజకవర్గాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
జ: 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం
09) భారత హై కమిషనర్ అనే పదవిని ఏ చట్టం ప్రకారం సృష్టించారు ?
జ: 1919 భారత ప్రభుత్వ చట్టం
10) 1927లో ఏర్పాటైన సర్ జాన్ సైమన్ ఆధ్వర్యంలోని కమిషన్ ఎప్పుడు భారత్ ను సందర్శించింది ?
జ: 1928లో
11) 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ ఏది ?
జ: సైమన్ కమిషన్
12) సైమన్ కమిషన్ సిఫార్సులను చర్చించేందుకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి ?
జ: లండన్ లో
13) సైమన్ కమిషన్ లో భారతీయులకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ భారత ప్రజలు ఏ ఉద్యమాన్ని నిర్వహించారు ?
జ: సైమన్ గో బ్యాక్

14) సైమన్ కమిషన్ నివేదికలో అంశాలు చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు ఎప్పుడెప్పుడు జరిగాయి ?
జ: మొదటి 1930, రెండోది 1931, మూడోది 1932లో
15) ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి మహాత్మా గాంధీ హాజరయ్యారు ?
జ: రెండో రౌండ్ టేబుల్ సమావేశం
16) రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ, లార్డ్ ఎర్విన్ మధ్య ఓ అగ్రిమెంట్ కుదిరింది. దాన్ని ఏమని అంటారు ?
జ: ఎర్విన్ ఒప్పందం
17) లండన్ లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా హాజరైనది ఎవరు ?
జ: డాక్టర్ బిఆర్ అంబేద్కర్.