19 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు... మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.

19 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ )

1. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పుర్ లో రానియా, రాఖీ మండీల దగ్గర విషపూరిత క్రోమియం ఉన్న కలుషిత జలాలను గంగానదిలో విడిచిపెడుతున్నందుకు 22 తోలు శుద్ధి పరిశ్రమలకు ఎంత జరిమానా విధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది ?

2. శ్రీలంక ఎన్నో అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్స ప్రమాణం చేశారు ?

3. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రాష్ట్రానికి ఎన్ని కిలోమీటర్ల నిడివిగల రహదారుల నిర్మాణానికి అనుమతులు లభించినట్టు రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు ?

4. డ్వాక్రా మహిళలు బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్ లైన్ లో వారంలోనే రుణం మంజూరు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ఫ్).  అయితే రాష్ట్రంలో 4.5 లక్షల డ్వాక్రా సంఘాల్లో ఎన్ని లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు ?

5. ఆగ్రా నగరం పేరును ఏవిధంగా మార్చాలని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ భావిస్తోంది ?

6. వాతావరణ మార్పులతో ఆర్కిటిక్ మహా సాగరంలో ఏటా కొంతకాలం పాటు మంచు జాడ కనిపించకుండా పోతుంది అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన సర్వేలో తేలింది.  ఏ ఏడు నుంచి 2067 మధ్య కాలంలో మంచు జాడ లేని పరిస్థితి ఏర్పడుతుందని పరిశోధకులు తెలిపారు

7. రాజ్యసభ 250వ సమావేశం ఎప్పుడు జరిగింది ?

8. జస్టిస్ బోబ్డే కొత్త భారత ప్రధాన న్యాయమూర్తిగా  2019 నవంబర్ 18నాడు బాధ్యతలు స్వీకరించారు.  బోబ్డేకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

1) ఆయన 17 నెలల పాటు చీఫ్ జస్టిస్ గా కొనసాగుతారు. 2021 ఏప్రిల్ 23న పదవీ విరమణ చేస్తారు

2) అయోధ్య కేసులో చరిత్రాత్మక తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో బోబ్డే కూడా ఉన్నారు

3) గోప్యత హక్కు భారత్ లో రాజ్యాంగపరమైన రక్షణ ఉన్న ప్రాథమిక హక్కు అంటూ 2017లో తీర్పు చెప్పిన 9 మంది సబ్యుల ధర్మాసనంలో సభ్యుడు

4) రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయిపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ క్లీన్ చిట్ ఇచ్చిన త్రిసభ్య అంతర్గత సంఘానికి జస్టిస్ బోడ్డే సారధ్యం వహించారు.

4) 2013 ఏప్రిల్ 12న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు

9. దేశంలో కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికుల కనీస పనిగంటలను మార్చనున్నారు. వేతన కోడ్ 2019 అమలులో భాగంగా ప్రస్తుతం ఉన్న 8 గంటలకు బదులు ఎన్ని గంటలు పనిచేసేలా నిబంధనలు మారనున్నాయి ?

10. ఏటీపీ పురుషుల ఫైనల్స్ లో నెగ్గి టోర్నీ టైటిల్ గెలుచుకున్న గ్రీస్ ఆటగాడు ఎవరు ?