Wednesday, October 23

18 SEPT 2019 CURRENT AFFAIRS QUIZ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

18 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. కౌన్ బనేగా కరోడ్ పతి 11వ సీజన్ లో కోటి రూపాయలు గెలుచుకున్న వంట మనిషి పేరేంటి ?

(నోట్: మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఆమె ఓ సర్కార్ బడిలో మధ్యాహ్నం భోజనం వంట మనిషిగా పనిచేస్తోంది)

2. వాహన కాలుష్యం తగ్గించడమే లక్ష్యంగా  ఏ IIT కి చెందిన విద్యార్థి బృందం దెశలా అనే కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేసింది ?

3. 2017లో ఉత్తమ ప్రదర్శనకు గాను తెలుగు రాష్ట్రాలకు విశ్వకర్మ పురస్కారాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ న్యూఢిల్లీలో అందించారు. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

1) సమస్యలతో పోరాటం, సూచనలు, సలహాలు ఆర్థికంగా ఆదా చేయడంలో రెండు పురస్కారాలను ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు లభించాయి

2) జాతీయ స్థాయి విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కారం రూ.50వేల నగదును ఎస్.ఈశ్వర్ రవు, టి.త్రినాథ రావు, బి.ధర్మారావు, ఎ.సత్తిబాబు, బి.అప్పలరాజు అందుకున్నారు

4. భవిష్యనిధి (ప్రావిడెంట్ ఫండ్ ) ఖాతాదారులకు 2018-19 సంవత్సరానికి వడ్డీ రేటును ఎంత శాతానికి పెరంచు నిర్ణయించినట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు ?

5. గగనతలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యమున్న క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది.  దానికి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవ సరైనవో తెలపండి

1) అస్త్ర క్షిపణిని ఒడిశాలోని బాలేశ్వర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు

2) భారత వైమానిక దలం వినియోగ పరీక్షల్లో భాగంగా ఒడిశా తీరంలో సుఖోయ్ 30 MKI నుంచి దీన్ని ప్రయోగించారు

3) క్షిపణి గమనాన్ని వివిధ రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థ (EOTS), సెన్సర్లు పర్యవేక్షించాయని, లక్ష్యాన్ని ఛేదించినట్టు గుర్తించారు

4) 70 కిమీ కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అస్త్ర క్షిపణి గంటకు 5,555 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది

5) అత్యధిక పలేడు స్వభావం గల 15 కిలోల వార్ హెడ్  ఉంటుంది

6. ప్రపంచంలోని అత్యంత విలువైన 100 అగ్రగామి బ్రాండ్ల జాబితాలో వచ్చే మూడేళ్ళల్లో భారత్ కు చెందిన ఏ కంపెనీ చేరుతుందని సమాచార సేవల సంస్థ WPP, మార్కెట్ పరిశోధనా సంస్థ కాంటార్ మిల్ వార్డ్ బ్రౌన్ సంయుక్త నివేదిక ప్రకటించింది ?

7. డెంగీని వ్యాప్తి చేసే దోమల్లోకి వోల్బాకియా అనే బ్యాక్టీరియాను పంపితే డెంగీ కేసులను తగ్గించవ్చని ప్రయోగాలతో నిరూపించిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందిన వారు?

8. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి వచ్చిన బహుమతులను వేలం వేస్తున్నారు. ఇందులో వెండి కలశం, మోడీ చిత్రంతో కూడిన ఫోటో స్టాండ్ లు ఎంత ధర పలికాయి

9. అమెరికాలోని కాటలినా ఛానల్ ను ఈదిన తెలుగు రాష్ట్రాల తొలి సిమ్మర్ (విజయవాడకు చెందిన ) హెడ్ కానిస్టేబుల్ ఎవరు ( 35 కిమీల పైగా ఉన్న దూరాన్ని 12 గంటల 40 నిమిషాల్లో ఈదాడు)

10. బ్యాంకింగ్ ఆర్థిక సేవలు, బీమా రంగాల స్టార్టప్ సంస్థలన్నింటినీ ఒక చోటుకి తెచ్చే లక్ష్యంతో హైదరాబాద్  ఫిన్ టెక్ ఫోరం ప్రారంభమైంది.  ఎంతమంది సభ్యులతో ఈ సంస్థ ప్రారంభమైంది.

11. విశాఖ కేంద్రంగా ఏర్పడనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఎన్ని కిలోమీటర్లతో DPR ప్రతిపాదనలో చేర్చారు.

12. భారత్ తొలిసారిగా చేపట్టే తొలి మానవసహిత యాత్ర అంతరిక్ష యాత్ర గగన్ యాన్ పై ఏ సంస్థతో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది

13. కేంద్ర సమాచార శాఖ తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ (రీజియన్) గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?