1857 తిరుగుబాటు

1) 1857 తిరుగుబాటుకు ప్రధాన కారణం ఏమిటి?
జ) ఆవు, పంది కొవ్వుతో చేసిన తూటాలు వాడకం
2) ఈ తూటాలను ఉపయోగించడానికి నిరాకరించిన వ్యక్తి ఎవరు?
జ) మంగళ్ పాండే.
3) ఢిల్లీలో తిరుగుబాటును అణచివేసినది ఎవరు?
జ) జనరల్ నికోల్సన్.
4) గ్వాలియర్ ను ఎవరు ఆక్రమించారు?
జ) ఝాన్సీ లక్ష్మీభాయ్ (తాంతియాతోపే సాయంతో)
5) సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైనది?
జ) 1857 మే 10.
6) తాంతియాతోపేని మోసం చేసి అతనిని బ్రిటీష్ వారికి పట్టించిన అతని స్నేహితుడు ఎవరు?
జ) మాన్ సింగ్.
7) 1857 తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా అభివర్ణించినది ఎవరు ?
జ: వి.డి. సావర్కర్
8) ఇండియా మ్యూటినీ పుస్తకం రాసింది ఎవరు ?
జ: జి.బి. మల్లెసన్
9) 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు ?
జ: పామ్ హెర్ఫ్‌ట‌న్‌
10) తాంతియాతోపే అసలు పేరు ఏంటి ?
జ: రామచంద్ర పాండురంగ
11) 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు ?
జ: లార్డ్ కానింగ్
12) 1857 తిరుగుబాటు తర్వాత రాజ్యసంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు, ఎప్పుడు తొలగించారు ?
జ: 1 నవంబర్ 1858 లో బ్రిటన్ రాణి విక్టోరియా