17 NOV CURRENT AFFAIRS QUIZ (TS & AP)

ఈ క్విజ్  యాప్ లో ఓపెన్ అవదు.  ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

17 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంద్రప్రదేశ్)

1. 2019 ఆసియాన్ ఫిల్మ్ ఫెస్టివల్ బార్సిలోనాలో బెస్ట్ డైరెక్టర్ గా ఏ భారతీయ మూవీకి దక్కింది ?

2. భూమి మీద నుంచి భూమి మీదకి ప్రయోగించే ఏ మధ్యశ్రేణి క్షిపణిని రాత్రిపూట కూడా విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది.  ( ఒడిశాలోని సమీకృత పరీక్షా వేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. 2 వేల కిమీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఉంది)

3. భారతీయ పోషన్ క్రిషి కోష్ ( BPKK) పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది

4. 25వ కోల్ కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (KIFF) లో గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డ్ గెలుచుకున్న ఉత్తమ చలనచిత్రం ఏది

5. 6వ ఏసియాన్ రక్షణ శాఖామంత్రుల సమావేశం ( ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ – ADMM-PLUS) ఏ నగరంలో జరిగింది

6. ఒడిశాకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కు ప్రఖ్యాత ఇటాలియన్ గోల్డెన్ శాండ్ అవార్డ్ 2019 లభించింది.  ఇటలీలోని లీసీలో జరిగిన పోటీల్లో పట్నాయక్ రష్యాకు చెందిన పావెల్ మినికోవ్ తో కలసి ఇసుకతో ఎనిమిది అడుగుల పొడవున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని రూపొందించాడు. ఎక్కడ జరిగిన కార్యక్రమంలో సుదర్శన్ పట్నాయక్ ఈ అవార్డు అందుకున్నారు ?

7. తెలంగాణలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?

8. సెనగకు సంబంధించిన కొత్త వంగడాన్ని అందుబాటులోకి తేవాలంటే పదకొండేళ్ళు సమయం పడుతుంది.  అయితే ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్ విధానం ద్వారా ఇక్రిశాట్ లోని గ్రీన్ హౌస్ లో చేపట్టి ఎన్నేళ్ళల్లో కొత్త వంగడాన్ని సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసన్ సామినేని ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం కనుగొన్నది ?

9. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.  గుజరాత్ లో జరిగిన 6 వ జాతీయ ఆదర్శ, వినూత్న ఆరోగ్య పథకాల సదస్సులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ అవార్డు అందజేశారు

10. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల జాబితాకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి?

1) ఈ జాబితాలో రెండేళ్ళ తర్వాత మరోసారి బిల్ గేట్స్ మొదటి స్థానం దక్కించుకున్నారు

2) 10 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 70వేల కోట్ల క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ను అమెరికా రక్షణ శాఖ మైక్రోసాఫ్ట్ కి అప్పగించడంతో ఆ సంస్థ షేర్లు 4శాతం పెరిగాయి

3) గేట్స్ సంపద 110 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.7 లక్షల కోట్లు ) కి చేరుకున్నట్టు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది

4) రెండో స్థానంలో అమెజాన్ అధినేత బెజోస్ నిలిచారు ( నికర సంపద 108.7 బిలియన్ డాలర్లు )

5) ఐరోపాలోనే అత్యంత సంపన్నుడైన బెర్నార్డ్ ఆర్నాల్డ్ మూడో స్థానంలో నిలిచాడు ( 102.7 బిలియన్ డాలర్లు )