Wednesday, October 23

16 SEPT CURRENT AFFAIRS QUIZ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు.

16 సెప్టెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. జమ్ము కశ్మీర్ భారత్ దేననీ, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పాక్ వైదొలగాలని బ్రిటన్ పార్లమెంటులో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ డిమాండ్ చేశారు. ఆయన పేరేంటి ?

2. స్పైస్ – 2000 బాంబులకు సంబంధించి ఈ కింది ప్రకటనలు చదివి సరైనవి గుర్తించండి

1) అధునాతన స్పైస్ 2000 బాంబులను భారత్ మరిన్ని సమకూర్చుకుంది. వీటిని ఇజ్రాయెల్ నుంచి తెప్పించింది

2) ఇటీవల పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయడానికి వీటిని ఉపయోగించారు

3) స్పైస్ 2000 బాంబులను గ్వాలియర్ వైమానిక స్థావరానికి తరలిస్తున్నారు. వీటిని ప్రయోగించే సామర్థ్యం ఉన్న మిరాజ్ 2000 విమానాలు అక్కడే ఉన్నాయి

4) ఈ బాంబులను సరఫరా చేసేందుకు ఇజ్రాయెల్ కు చెందిన కంపెనీతో రూ.250కోట్లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది

3. కేంద్ర ప్రభుత్వ పథకం బేటీ బచావో, బేటీ పడావోని ప్రోత్సహించడమే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ (మోడీ జన్మదినోత్సవం సందర్బంగా) చేపట్టిన కొత్త నినాదం ఏది

4. మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణ కోసం దేశవ్యాప్తంగా ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?

5. దేశంలో పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వాటిపై విధించే వస్తు సేవల పన్ను (GST) కి ఎంతకు తగ్గిస్తూ GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది

6. భారత దిగ్గజ క్యూ ఆటగాడు పంకజ్ అద్వానీ (బిలియర్డ్స్, స్నూకర్) మరోసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. మయన్మార్ లోని మాన్ డలె లో జరుగుతున్న IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లో ప్రపంచ టైటిల్ గెలుచుకున్నాడు. అయితే ఇప్పటి వరకూ అద్వానీ ఎన్ని ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలిచాడు

7. దేశంలోనే మొదటి సంగీ ప్రయోగాలయం, మ్యూజియం – ఇండియన్ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ ను ఈమధ్య ఏ నగరంలో ప్రారంభించారు

8. ఇంజనీర్స్ డే సందర్భంగా మేషన్ మేస్త్రీలు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇతర నిర్మాణ సంబంధ సేవలు అందుబాటులో ఉండేలా రూపొందించిన యాప్ ను సీఎస్  ఎస్ కే జోషీ విడుదల చేశారు. దాని పేరేంటి ?

9. అసోంలో లాగే తమ రాష్ట్రంలోనూ జాతీయ పౌర రిజిష్ట్రర్ (NRC) అమలు చేస్తామని ప్రకటించిన రాష్ట్రం ఏది ?

10. ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలసి 2019 సెప్టెంబర్ 22నాడు హ్యూస్టన్ లో జరిగే ఒకే వేదికపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం పేరేంటి ?