Friday, December 6

16 NOV CURRENT AFFAIRS QUIZ (TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

16 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. విధుల్లో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన వారికి గరిష్టంగా ఎన్నేళ్ళ వరకూ జైలుశిక్ష విధించేలా చట్టాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ తీసుకొస్తోంది ?

2. 2018లో ప్రపంచం మొత్తం మీద న్యుమోనియాతో మరణించిన ఐదేళ్ళ లోపు చిన్నారుల సంఖ్య విషయంలో భారత్ ఎన్నో స్థానంలో ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది ?

3. దేశంలో 2024 నాటికల్లా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీటి సౌకర్యం కల్పించేందుకు ఏ దేశం సహకారం తీసుకోవాలని భారత్ నిర్ణయించింది ?

4. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ( NSO) రూపొందించిన కీ ఇండికేటర్స్ హౌస్ హోల్డ్ కన్జూమర్ ఎక్స్ పెండించర్ ఇన్ ఇండియా సర్వేలో 2017-18 లో భారతీయుడి సగటు నెలవారీ వ్యయం ఎంతగా ఉంది ?

5. ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కి గౌరవ ట్రస్టీగా ఎవరు నియమితులయ్యారు ?

6. 2019 ప్రపంచ కబడ్డీ కప్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది ?

7. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయి 2019 నవంబర్ 16 నాడు పదవీ విరమణ చేశారు.  ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వారు.

8. చేనేత కార్మికులు ఉపయోగపడే ఆసుయంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశంకి ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ?

9. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయడానికి వార్షిక ఆదాయ పరిమితి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకూ పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది ?

10. జాతీయ స్థాయిలో పులుల గణన ప్రతి నాలుగేళ్ళకోసారి జరుగుతోంది. అయితే ఇకపై ఏడాదికోసారి లెక్కిస్తారు. అందులో భాగంగా ఏ రాష్ట్రంలో మొదటిసారిగా పులుల గణన ప్రారంభిస్తున్నారు ?

11. 2020  జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ఏ దేశానికి చెందిన అధ్యక్షుడిని భారత్ ఆహ్వానించింది ?