Monday, November 18

13 SEPT CURRENT AFFAIRS QUIZ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల మీరు ఈ క్విజ్ ను ఈకింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరని మనవి

13 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. సౌర విద్యుత్ కు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

ఎ) ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ గా కర్ణాటకలోని తుమకూరు జిల్లా నిలవనుంది (ప్రస్తుతం చైనాలో ఉంది)

బి) 2 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పావగడ తాలూకాలో సౌర ప్లాంట్స్ ఏర్పాట్లో చేస్తోంది కర్ణాటక రాష్ట్ర విద్యుత్ సంస్థ KSPDL

సి) రైతుల నుంచి 13 వేల ఎకరాలను 25యేళ్ళ పాటు లీజుకు తీసుకొని ఫలకాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 11 వేల ఎకరాల్లో ఏర్పాట్లు జరిగాయి

డి) జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సౌర పథకం ప్రకారం 2022 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

2. జీవ వైవిధ్యం కాపాడటానికి, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టకొని ఏ దేశంలోని నాలుగు నగరాల్లో పురుగు మందుల వాడకాన్ని నిషేధించారు ?

3. అసోంలో తొలిసారిగా అక్రమ వలసదారులను నిర్భందించేందుకు 7 ఫుట్ బాల్ మైదానాలంత కేంద్రాలను  ఎక్కడ నిర్మిస్తున్నారు ?

4. ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఏడాది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులను ప్రభుత్వం నిలిపివేసింది.  అయితే ఏడాదికి ఒక్కో MLA/MLCకి ఎంత మొత్తాన్ని ప్రభుత్వం కేటాయిస్తూ వస్తోంది ?

5. ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసును దర్యాప్తు చేసిన మహిళా అధికారికి ఆసియా సొసైటీ గేమ్ ఛేంజర్ అవార్డు ప్రకటించింది. ఆమె ఎవరు ?

6. కన్జూమర్ ధరల ఇండెక్స్ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్భణం 10 నెలల్లో గరిష్టానికి చేరుకుంది.  ఆగస్టు నెలోని రిటైల్ ద్రవ్యోల్భణం ఎంతశాతానికి చేరుకుంది

7. ఐటీ సీజార్ ప్రాజెక్టులో భాగంగా త్వరలో స్వదేశీ డ్రైవర్ రహిత కార్లను భారతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సంస్థతో కలసి తయారు చేస్తున్నట్టు ప్రకటించిన సంస్థ ఏది ?

8. ఈ సీజన్ లో ప్రపంచంలోనే అత్యధికంగా వానలు పడిన ప్రదేశంగా ఏది నిలిచింది ?

9. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లిస్ట్ లో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ జాబితాల్లో చోటు దక్కించుకున్న యూనివర్సిటీలో ఈ కిందివాటిల్లో లేనిది ఏది

1) ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ

2) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు

3) కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

4) కేంబ్రిడ్స్ యూనివర్సిటీ

5) స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ

10. 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ రాంచీలో కొత్తగా 3 ఫించన్ పథకాలను ప్రారంభించారు. వాటి గురించి ఇచ్చిన ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

ఎ) కిసాన్ మాన్ ధన్ యోజన: సన్న, చిన్నకారు రైతులకు ఉద్దేశించినది

బి) లఘు వ్యారి మాన్ ధన్ : చిన్న వ్యాపారులకు ఉద్దేశించినది

సి) స్వరోజ్ గార్ యోజన: వ్యవసాయ కూలీలకు సంబంధించినది