Sunday, February 23

13 JAN 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ కింది లింక్ ద్వారా క్విజ్ ను వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

13 జనవరి 2020 కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( NRCB) రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?

2. 2020 జనవరి 12  స్వామి వివేకానంద జయంతి సందర్భంగా  రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం బేలూరు మఠంలో  నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు గడిపారు. ఈ మఠం ఏ రాష్ట్రంలో ఉంది ?

3. ఆంధ్రప్రదేశ్ లో పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

1) మొత్తం పట్టణ స్థానిక సంస్థలు – 110

2) మున్సిపల్ కార్పోరేషన్లు – 14, సెలెక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు – 5

3) స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు – 7, మొదటి గ్రేడ్ మున్సిపాలిటీలు 12

4) మూడో గ్రేడ్ మున్సిపాలిటీలు 22, నగర పంచాయతీలు – 24

4. కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల కర్మయోధ గ్రంథ్ పేరుతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.  అది ఏ రాజకీయ నేత జీవితానికి సంబంధించినది ?

5. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 23వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇవి ఉత్తరప్రదేశ్ లోని ఏ నగరంలో ప్రారంభమయ్యాయి ?

6. గ్రామాల్లో మెరుగైన పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత సాధించడంలో తెలంగాణలోని  ఏ జిల్లాకి జాతీయ స్థాయిలో స్వచ్ఛత దర్పణ్ అవార్డు దక్కింది ?

7. దేశంలోని తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కోసం పూర్వోదయ ప్రోగ్రామ్ ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

8. డ్రీమ్స్ ఆఫ్ బిలియన్: ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్ – పేరుతో పుస్తకాన్ని రాస్తున్న ప్రముఖ కోచ్ ఎవరు ?

9. 2018-19 సీజన్ కి BCCI వార్షిక అవార్డులకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి?

ఎ) అంతర్జాతీయ క్రికెట్ లో విశేషంగా రాణించిన జస్ ప్రీత్ బుమ్రాకి పాలీ ఉమ్రిగర్ , దిలీప్ సర్దేశాయ్ అవార్డులు దక్కాయి

బి) ఈ సీజన్ లో అత్యధిక పరుగులు ( 8 మ్యాచుల్లో 677) చేసేన బ్యాట్స్ మన్ గా పూజారా సర్దేశాయ్ అవార్డు అందుకున్నాడు

సి) ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ ను లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అందుకుంది

డి) కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డుకు కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంపికయ్యారు

ఇ)  BCCI మహిళల జీవితకాల సాఫల్య పురస్కారం అంజుమ్ చోప్రాకి దక్కింది

10. 2018-19 BCCI అవార్డుల విజేతలకు సంబంధించి తప్పుగా చెప్పిన స్టేట్ మెంట్ ను గుర్తించండి

ఎ) మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు స్మృతి మంధాన అవార్డు అందుకున్నది

బి) మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసినందుకు జులన్ గోస్వామికి అవార్డు దక్కింది

సి) ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం – మయాంక్ అగర్వాల్

డి) ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు) షెఫాలీ వర్మ

ఇ) రంజీ ట్రోఫీ ఉత్తమ ఆల్ రౌండర్ అయిన శాంసన్ కి  లాలా అమర్ నాథ్ అవార్డు దక్కింది