Thursday, February 27

12 SEPT CURRENT AFFAIRS QUIZ

ఈ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు వెబ్ సైట్ లో ఈ కింది లింక్ ద్వారా రాసుకోగలరు.

13 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. డెడ్ లైన్ లోగా భారత్ స్టేట్ (BS 6) ఫ్యూయల్ ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని భారత పెట్రోలియం కార్పోరేషన్ (BPCL) ప్రకటించింది.  అయితే BS 6 ప్రమాణాలు దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నాయి ?

2. నకిలీ కార్డులను అరికట్టేందుకు పాన్ – ఆధార్ లింక్ ను ఎప్పటి లోగా పూర్తి చేయాల్సి ఉంది (చివరి తేదీ )

3. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, విద్యుత్, మౌలిక వసతులు, ఆర్థిక రంగాల్లో విశేష అనుభవం ఉన్న ఏ రిటైర్డ్ గుజరాత్ కేడర్ IAS అధికారిని...  ప్రధాని నరేంద్రమోడీ తన ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు ?

4. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సక్సెస్ స్టోరీలు, టీచర్ల సలహాలు, సూచనలకు చోటు కల్పించేందుకు విద్యాశాఖ కొత్తగా తీసుకొచ్చిన ఈ-మేగజైన్ పేరేంటి ?

5. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఆధ్వర్యంలో ఆర్మీ సహకారంతో తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ను ఏపీలోని ఎక్కడ విజయవంతంగా ప్రయోగించారు ?

6. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గా గుత్తా సుఖీందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఇంతకుముందు ఏ పదవిలో కొనసాగారు ?

7. కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఇటీవల కొత్తగా వచ్చిన సైబర్ క్రైమ్స్ చట్టాలు, Cr.PC ఛట్టాలు, అవినీతి నిరోధక చట్టాలతో క్రైమ్ మాన్యువల్ ను అప్ డేట్ చేస్తోంది.  అందుకోసం CBI అదనపు డైరక్టర్ ప్రవీణ్ సిన్హా ఆధ్వర్యంలోని బృందం 10 నెలలుగా పనిచేస్తోంది.  ఎన్నేళ్ళ తర్వాత CBI తన మాన్యువల్ ను అప్ డేట్ చేస్తోంది

8. దేశ, విదేశాల్లో ప్రధాని నరేంద్రమోడీకి లభించిన బహుమతులను వేలం వేయనున్నారు. దానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరికానిది ఏది

  1. ఈ బహుమతులను క్రిస్టీన్ అనే స్వచ్ఛంద సంస్థ వేలం వేస్తోంది
  2. మొత్తం 2700 బహుమతులను వేలం వేయనున్నారు
  3. మొత్తం 2772 బహుమతులు, జ్ఞాపికలు ప్రస్తుతం నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్ లో ప్రదర్శనకు పెట్టారు
  4. మోడీకి అందిన బహుమతుల్లో విలువైననది సీమతి టెక్స్ టైల్స్ యజమాని బీనా కణ్ణన్ పట్టు దారాలతో చేయించిన మోడీ చిత్తరువు ( రూ.2.5లక్షలు)
  5. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బేటీ బచావో కార్యక్రమానికి అందిస్తారు

9. దేశంలోని దాదాపు 3 కోట్ల మంది షాప్ కీపర్లు, రిటైలర్లు, స్వయం ఉపాధి గల వ్యక్తుల భవిష్యత్తుకు ఉద్దేశించిన జాతీయ ఫించన్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. LIC ద్వారా ఈ ఫించన్ పథకాన్ని నిర్వహిస్తున్నారు.  దీనికి సంబంధించి ఈ ప్రకటనల్లో సరైనవి తెలపండి

ఎ) ఈ స్కీమ్ లో చేరడానికి నెలవారీ కంట్రిబ్యూషన్ రూ.55 నుంచి రూ.200 వరకూ చెల్లించవచ్చు

బి) 60యేళ్ళ తర్వాత నెలకు రూ.3000 హామీ గల పెన్షన్ ను అందిస్తారు

సి) ఈ ఫించన్ స్కీమ్ లో చేరడానికి 18-40 సంవత్సరాల వయసు వారికి అర్హత

డి) బిజినెస్ వార్షిక టర్నోవర్ రూ.1.5కోట్ల కంటే తక్కువ గల వారికి వర్తిస్తుంది

10. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బండారు దత్తాత్రేయతో ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి ప్రమాణం చేయించారు. ఎన్నో గవర్నర్ గా దత్తన్న బాధ్యతలు స్వీకరించారు ?