Thursday, February 27

11 SEPT CURRENT AFFAIRS QUIZ

ఈ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు. ః

11 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 42వ సదస్సులో కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది.  ఈ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి

2. దేశంలో గవర్నర్లకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

ఎ) దేశంలో చిన్న వయస్సు గవర్నర్ తమిళసౌ సౌందర  రాజన్ (58)(తెలంగాణ), వయోధిక గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ (85) (ఏపీ గవర్నర్ )

బి) దేశంలోని 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలకు గవర్నర్లు ఉన్నారు. (అసోం, మిజోరాంలకు ఒక్కరే గవర్నర్)

సి) మొత్తం గవర్నర్లలో 19మంది తొలిసారి పదవి చేపట్టినవారు. 9 మంది గతంలో పనిచేసిన అనుభవం ఉంది

డి) ఆరు రాష్ట్రాలకు మహిళా గవర్నర్లు ఉన్నారు

3. శక్తివంతమైన రఫేల్ యుద్ధ విమానాలు భారత దళాలకు చేరనున్నాయి.  మొదటి విమానాన్ని వచ్చే నెల 8న ఫ్రాన్స్ లో అందుకోడానికి వెళ్తున్న కేంద్ర మంత్రి ఎవరు ?

4. ఆన్ లైన్ రిటైలింగ్ బూమ్ ను సృష్టించి ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీ అలీబాబాను సృష్టించిన జాక్ మా ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు.  అలీ బాబా ఏ దేశం నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టింది ?;

5. చరిత్రలో నిలిచిపోయే చంద్రయాన్ కు గుర్తుగా ఏయే మెట్రో మార్గాన్ని సైన్స్ కారిడార్ గా ఎంపిక చేశారు

6. సౌర విద్యుత్ ప్లేట్స్, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్, విద్యుత్ వాహనాల తయారీకి తెలంగాణలో ప్లాంటును ఏర్పాటు చేసేందుకు అమెరికాకి చెందిన ఇన్నోలియో ఎనర్జీ కంపెనీ సిద్ధమవుతోంది.  అందుకోసలం రూ.225 కోట్లు పెట్టుబడి పెడుతోంది.  ఈ ప్లాంటును రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

7. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏ టెన్నిస్ ప్లేయర్ పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య జీవిత కాలం నిషేధం విధించింది

8. జాతీయ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ కీలకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

1) పసుపు సాగులో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉంది

2) పండ్ల సాగులో మూడో స్థానం, ఉత్పత్తిలో 8వ స్థానంలో నిలిచింది

3) రాష్ట్రవ్యాప్తంగా 4,484 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యానవనాలు ఉన్నాయి

4) రాష్ట్రంలో మొత్తం 51.42 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లభించింది.

9. గ్రామీణ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు ఆరోగ్య ఉపకేంద్రాలను హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  అందులో భాగంగా పల్లెల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి ఆధునిక శిక్షణ ఇవ్వడానికి ఏ ట్రస్ట్ తో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ MOU కుదుర్చుకుంది

10. దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు 2019 అక్టోబర్ 2 నుంచి పోరాటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవీ సరైనవి

1)  దేశంలో 2016లో 1.20 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయితే ... 2019 నాటికి అది దాదాపు 2.50 లక్షల టన్నులకు పెరిగిందని అంచనా

2) తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు రోజుకి 685 టన్నులు ఉన్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 500 టన్నుల పైన వెలువడుతున్నాయి.

3) 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ మట్టిలో కలసిపోవడానికి వెయ్యేళ్ళ వరకూ పడుతుంది