Sunday, February 23

10 OCT CURRENT AFFAIRS ( TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు.

10 అక్టోబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. ఫిజిక్స్ నోబెల్ బహుమతులు అందుకున్న వారు – వారి రంగాలకు సంబంధించి జతపరచని ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

1) జేమ్స్ పీబుల్స్ - బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం ఎలా రూపుదిద్దుకుందో పరిశోధన

2) డిడియర్ క్యులోజ్ & మైఖేల్ మేయర్  – 1995లో ఫ్రాన్స్ లోని తమ అబ్జర్వేటరీ నుంచి సూర్యుడి నుంచి 50కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూర్యుడి తరహా నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని కనుగొన్నారు

2. అంతర్జాతీ క్రికెట్ లో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ 20యేళ్ళు పూర్తి చేసుకుంది.  మిథాలీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

1) మిథాలీ 26 జూన్ 1999 నాడు అంతర్జాతీయ క్రికెట్ లో తొలి మ్యాచ్ ఆడింది

2) మిథాలీ ఇప్పటిదాకా 303 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి 9,758 పరుగులు చేసింది

3) 1997 ప్రపంచ కప్ కి 15యేళ్ళకే మిథాలీ రాజ్ ఎంపికైంది.  మరీ చిన్నదిగా భావించి టీమ్ మేనేజ్ మెంట్ ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఆడించింది

4) ఆరు ప్రపంచ కప్ లో పాల్గొన్న మిథాలీ, రెండు సార్లు ఆమె కెప్టెన్ గా వ్యవహరించారు

3. రఫెల్ యుద్ద విమానాల స్వీకరణ కోసం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్యారిస్ వెళ్ళారు. భారత్ మొత్తం ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనుంది ?

4. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

1) అమెరికాకు చెందిన జాన్ గుడినఫ్, బ్రిటన్ శాస్త్రవేత్త స్టాన్లీ విటింగ్ హాం, జపాన్ కు చెందిన అకిరా యోషినో ముగ్గురికి కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి దక్కింది

2) ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు లిథియం – అయాన్ బ్యాటరీ రూపకర్తలు. తక్కువ బరువు ఉండేవి రూపొందించారు.

3) మొబైల్స్, ల్యాప్ టాప్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే ఈ బ్యాటరీలు సౌర, పవన శక్తిని కూడా ప్రిజర్వ్ చేసుకుంటాయి.

5. ఫిజిక్స్ లో నోబుల్ బహుమతులు అందుకున్న వారిలో  ఈ కింది వారిలో ఎవరు ఉన్నారు

1) జేమ్స్ పీబుల్స్

2) డిడియర్ క్యులోజ్

3) జాన్ గుడినఫ్

4) అకిరా యోషినో

5) మైఖేల్ మేయర్

6. ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం వేతనాలు కూడా ఇవ్వలేకపోతున్నట్టు సెక్రటరీ జనరల్ గ్యుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.  దేశాలు తాము ప్రకటించిన నిధులను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.  ప్రస్తుతం ఐరాసలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి ?

7. భారత్ లో కూడా ఆఫ్రికాలో నిర్మిస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ తరహాలో హరిత కుడ్యం నిర్మించాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి ?

ఎ) యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజెర్టిఫికేషన్ ఆధ్వర్యాన ఢిల్లీ జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ (COP-14) సదస్సులో ప్రాజెక్టు మీద చర్చ జరిగింది

బి) ఆరావళి పర్వత శ్రేణిలో అటవీ ప్రాంతాలను రక్షించడంతో పాకిస్థాన్ లోని ఎడారి ప్రాంతాల నుంచి వచ్చే ధూళిని అడ్డుకునేందుకు ఈ చెట్లను పెంచుతారు

సి) ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్న గుజరాత్, రాజస్థాన్, హరియాణా, ఢిల్లీని కలుపుతూ నిర్మిస్తారు

డి) దీని పొడవు 14 వందల కిలోమీటర్లు, 5 కిలో మీటర్లు

8. దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లం సాధించేందుకు ఇండియన్ రైల్వే, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఐఐటీ కాన్పూర్ ల భాగస్వామ్యంతో చేపట్టే పైలెట్ ప్రాజెక్ట్ పేరేంటి ?

9. గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ లో భారత్ ర్యాంక్ పడిపోయింది.  ఇండియా 10 స్థానాలకు కిందకు జారింది.  వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ( WEF) ఈ గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ రిపోర్ట్ 2019 రిపోర్టులో భారత్ ర్యాంక్ ఎంత ?

10. అండర్ 18 విభాగంలో జరిగిన సౌత్ ఏషియన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (శాఫ్) ఫుట్ బాల్ టోర్నీని గెలుచుకున్న జట్టు ఏది ?