
ఆసియా స్క్వాష్ విజేత భారత్
- దక్షిణ కొరియాలోని చెయోంగ్డులో జరిగిన ఆసియా స్క్వాష్ టీమ్ ఛాంపియన్షిప్ లో భారత పురుషుల జట్టు మొదటిసారిగా విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ 2-0తో కువైట్ ను ఓడించింది.
- గ్రూప్ దశలో ఖతార్, పాకిస్థాన్, కువైట్, దక్షిణ కొరియా, చైనీస్ తైపీతో ఆడిన ప్రతి మ్యాచ్లోనూ భారత్ నెగ్గింది.
- ఈ టోర్నీలో గత రెండు సార్లు భారత పురుషుల జట్టు రజత పతకాలు సాధించింది.
- ఈసారి మహిళల జట్టు కాంస్య పతకం సాధించింది
‘ఇన్నోవేషన్ ఫర్ యు’లో తెలంగాణ మహిళలకు చోటు
- తెలంగాణకు చెందిన ఐదుగురు స్టార్టప్స్ స్థాపక మహిళలకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.
- 75 మంది మహిళా వ్యవస్థాపకుల (అంకురాల) వివరాలతో ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇన్నోవేషన్ ఫర్ యు’ పేరుతో కాఫీ టేబుల్ బుక్ ను 2022 నవంబర్ 4 నాడు విడుదల చేసింది.
- ఇందులో తెలంగాణ నుంచి అంత్యేష్టి ఫ్యునరల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు శ్రుతిరెడ్డి రాపోలు, ఆటోక్రసీ మెషినరీ ప్రైవేటు లిమిటెడ్ వ్యవస్థాపకురాలు సంతోషి బుద్ధిరాజు, గరుడాస్త్ర ఏరో ఇన్వెంటివ్ సొల్యూ షన్స్ వ్యవస్థాపకురాలు CEO శ్వేతా గెల్లా, నేచుర్స్ బయో ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజర్ ప్రతిభా భారతి, నియో ఇన్వెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు, CEO శ్రీ వల్లి శిరీషకు ప్లేస్ దక్కింది.
రహదారి భద్రత కోసం తెలంగాణకు రూ.320 కోట్లతో ఏడీబీ చేయూత
- రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రాణనష్టం నివారణ.. తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ రహదారి భద్రతకు కేంద్రప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
- ప్రపంచ బ్యాంకుతో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఒప్పందం చేసుకుంది.
- తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ దేశంలో 14 రాష్ట్రాలకు కలిపి రూ.7200 కోట్లు ఖర్చు చేయనుంది.
- ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సహకారంతో ఈ ప్రణాళిక అమలు చేస్తారు. తెలంగాణలో రూ.320 కోట్లతో ఆరేళ్లలో ఈ పథకాన్ని అమలు చేస్తారు.
స్టార్టప్స్ అభివృద్ధికి ప్రోత్సాహం నార్మ్ ఎ-ఐడియాతో 3 సంస్థల ఒప్పందం
- అంకుర సంస్థ(స్టార్టప్) లకు గైడెన్స్ ఇచ్చి అభివృద్ధికి ప్రోత్సహించేందుకు 3 సంస్థలతో ఒకేసారి ఒప్పందం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ లోని ‘జాతీయ వ్యవసాయ పరిశోధనా, నిర్వహణ సంస్థ'(నార్మ్) తెలిపింది.
- కొత్త ఆలోచనలతో వచ్చేవారిని ప్రోత్సహించి స్టార్టప్ లు ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థలో Association for Innovation Development of Entrepreneurship in Agriculture (A-IDEA) పేరుతో ప్రత్యేక విభాగం ఉంది. ఇందులో Technology Business Incubator (TBI)ని కూడా నార్మ్ ఏర్పాటు చేసింది.
- కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, కోయంబత్తూర్ కు చెందిన చెరకు పెంపకం సంస్థ, పుణెలోని జాతీయ ద్రాక్ష పంటల కేంద్రంతో విడి విడిగా ఒప్పందాలపై ఆయా సంస్థల అధికారులు సంతకాలు చేశారు.
- స్టార్టప్స్ తో కో-ఇంక్యుబేషన్, టెక్నాలజీ, సహకారం, శిక్షణ, ల్యాబ్, నెట్ వర్కింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల సేవలు, కో-నెట్వర్కింగ్ అవకాశాలు లాంటి సౌకర్యాలను అందించడం ఈ ఒప్పందాల లక్ష్యమన్నారు నార్మ్ AIDU CEO డాక్టర్ సెంథిల్ వినాయగం వివరించారు.
2024 మార్చి నుంచి బయో ఫోర్టిఫైడ్ బియ్యం పేదలకు పంపిణీ
- కొత్త వరి వంగడాల్లో జింకు, ప్రోటీన్లు, ఇనుము, మాంగనీస్ తదితర పోషకాలను పెంచడంపై దృష్టిపెట్టాలని దేశంలోని అన్ని వ్యవసాయ పరిశోధనా సంస్థలు, అగ్రి యూనివర్సిటీలకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) సూచించింది.
- ఇలా పోషకాలుండే బియ్యం (బయోఫోర్టిఫైడ్ రైస్) కు దేశంలో ప్రస్తుతం కొరత తీవ్రంగా ఉంది. సాధారణ బియ్యం తినే ప్రజలకు పోషకాలు సరిగా అందట్లేదని పరిశోధనల్లో గుర్తించారు.
- రేషన్ కార్డుల ద్వారా ఏటా కోట్ల మందికి దాదవాపు 3 కోట్ల టన్నుల బియ్యాన్ని అమ్ముతున్నారు.
- జాతీయ ఆహార భద్రతా పథకం కింద పోషకాలున్న బియ్యాన్నే రేషన్ కార్డుదారులకు అమ్మాలని కేంద్రం నిర్ణయించింది.
- 2022 నుంచి 2024 మార్చి కల్లా దశల వారీగా దేశమంతటా దీన్ని విస్తరించాలని నిశ్చయించింది. ప్రస్తుతం తెలంగాణలోని 8 జిల్లాల్లో ఈ బియ్యం అందజేస్తున్నారు.
- ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ ( PM-POSHAN) పథకం ఈ బయో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అమ్ముతారు