ఎయిర్ బస్ నుంచి హైడ్రోజన్ ఇంజిన్: 2035 కల్లా పొల్యూషన్ లేని విమానం

 • ఫ్రాన్స్ కు చెందిన యూరప్ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ ‘హైడ్రోజన్ నడిచే ఫ్యూయల్ సెల్ ఇంజిన్ ను అభివృద్ధి చేస్తోంది.
 • ఉద్గారాలు వెదజల్లని విమానం (జీరో ఇ) కోసం దీనిని వాడతారు. 2035 కల్లా ఈ విమానాన్ని వినియోగంలోకి తెస్తామంటోంది
 • ఈ Zero Emission Aircraft నమూనా విమానంపై ఫ్యూయల్ సెల్ ఇంజిన్ కు సంబంధించిన గ్రౌండ్, ఫ్లయిట్ పరీక్షలను మొదలు పెట్టతామని తెలిపారు.
 • ద్రవీకృత హైడ్రోజన్ ట్యాంకులు, సంబంధిత సామగ్రిని మోసేలా ప్రస్తుత A980 MSN001 విమానానికి మార్పులు చేశారు.
 • ఫ్యూయల్ సెల్ ఇంజిన్ సక్సెస్ అయితే 1000 మంది ప్రయాణికులతో 1000 నాటికల్ మైళ్ల వరకు విమానాన్ని నడపవచ్చు.
 • ఈ విమానాలకు అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ ను భారత్, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా దేశాల నుంచి సేకరించే ఆలోచనలో ఉంది ఎయిర్ బస్.

 

బొమ్మల తయారీ రంగానికి రూ.3,500 కోట్ల ప్రోత్సాహకాలు!

 • ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) స్కీమ్ ను బొమ్మల తయారీ పరిశ్రమలకూ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 • భారతీయ ప్రమాణాల మండలి (BIS) నిబంధనల ప్రకారం బొమ్మలు తయారు చేసే సంస్థలకు రూ.3,500 కోట్ల ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
 • దీంతో దేశీయ సంస్థలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో బొమ్మలు తయారు చేసి, దిగ్గజ సంస్థలతో పోటీ పడతాయని భావిస్తున్నారు.
 • నాణ్యతా నిబంధనలు విధించడంతో పాటు… ఇంపోర్ట్ డ్యూటీని 20 నుంచి 60 శాతానికి పెంచితే నాసిరకం బొమ్మలు దిగుమతు కాకుండా అడ్డుకోవచ్చు.
 • PLI పథకం కింద ఇప్పటికే 14 రంగాలకు రూ.2 లక్షల కోట్ల దాకా ప్రోత్సాహకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.
 • ఇందులో వాహన, వాహన విడిభాగాలు, మెడిసన్స్, బట్టలు, ఫుడ్ ప్రొడక్ట్స్, సోలార్ మాడ్యూళ్లు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, స్పెషాల్టీ స్టీల్, ఎలక్ట్రానిక్ గూడ్స్ లాంటి రంగాలకు అందిస్తున్నారు.
 • బొమ్మలతో పాటు వివిధ రంగాలకు మొత్తం 35 వేల కోట్ల రూపాయల దాకా PLI పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

 

హుగ్లీ తీరంలో ఐదు ఫిరంగులు: మొదటి ప్రపంచయుద్ధ కాలం నాటివన్న నౌకాదళం

 • భారత నౌకాదళం మొదటి ప్రపంచ యుద్ధం కాలంనాటి ఐదు ఫిరంగులను గుర్తించింది. ఇవి పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నది ఎడమ గట్టుపై బయటపడ్డాయి.
 • రెండింటికి అధికారులు నలుపు రంగు వేశారు. ముందు భాగంలో ఎరుపు రంగు అంచుతోపాటు తెలుపు రంగు వేశారు. మోటిఫ్ ను ప్రింట్ చేశారు.
 • భారత నౌకాదళం పశ్చిమబెంగాల్ హెడ్డాఫీస్ INS నేతాజీ సుభాష్ దగ్గర ఈ ఫిరంగులను ఏర్పాటు చేశారు.
 • ఈ ఫిరంగులు మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటివి అయి ఉంటాయనీ… నౌకలపై ఏర్పాటు చేసేందుకు తయారు చేసి ఉండొచ్చని నౌకాదళ అధికారులు తెలిపారు.
 • అయిదు ఫిరంగుల్లో నాలుగింటిని గత ఏడాది గుర్తించి.. ఈ ఏడాది భూమి నుంచి బయటకు తీశామని చెప్పారు.
 • చివరి దానిని కూడా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి ఎక్కడ తయారయ్యాయన్నది తెలుసుకునేందుకు వాటిపై ఎలాంటి గుర్తులు లేవు.

Leave a Reply