ఆర్మీ యూనిఫామ్ కి మేథో హక్కులు

  • భారత సైన్యం కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త యూనిఫాం త్వరలో అందుబాటు లోకి రానుంది. ఈ ఏడాది జనవరి 15న ‘ఆర్మీ డే’ సందర్భంగా దుస్తుల డిజైన్ ఆవిష్కరించారు.
  • ప్రకృతితో కలసిపోయి శత్రువులను మభ్యపెట్టేలా రూపొందించిన ఈ యూనిఫామ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్/IPR రిజిస్టరు చేయించానన్నారు అధికారులు.
  • 2022 అక్టోబర్ 21 నాటి పేటెంట్ ఆఫీస్ అధికారిక జర్నల్ లో దీన్ని ప్రచురించారు. ఈ బట్ట నమూనా పూర్తిగా భారత సైన్యానికి ప్రత్యేకం. వీటిని వేరెవరైనా అనధికారికంగా రూపొందిస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
  • కొత్త యూనిఫాం బరువు తక్కువగా, త్వరగా ఆరేలా.. దృఢంగా ఉంటుంది.

కెనడాలో హిందూ వారసత్వ నెలగా నవంబర్

  • నవంబరు నెలను హిందూ వారసత్వమాసంగా కెనడా అధికారికంగా గుర్తించింది.
  • కెనడాలో హిందువులు 8,30,000 మంది ఉన్నారు.
  • నవంబరును హిందూ వారసత్వ మాసంగా ప్రకటించాలంటూ అధికార లిబరల్ పార్టీకి చెందిన చంద్ర ఆర్య ప్రైవేట్ మెంబరు మోషన్ ను మే నెలలో హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశపెట్టారు.
  • అది సెప్టెంబరు 29న ఏకగ్రీవ ఆమోదం పొందింది.

 

డ్రాపౌట్లలో 11వ స్థానంలో తెలంగాణ : 2021-22 యూడైస్ను విడుదల చేసిన కేంద్రం

  • స్కూల్లో ప్రవేశం పొందుతున్న విద్యార్థులు 9,10 క్లాసులు దాటకుండానే బడి మానేస్తున్నారు. రాష్ట్రంలో 13.70 శాతం మంది అర్ధాంతరంగా చదువులు ఆపేస్తున్నారు.
  • 2021-22 విద్యా సంవత్సరం ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడైస్)ను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది.
  • రాష్ట్రాల్లోని స్కూళ్ళ సౌకర్యాలు, ఉపాధ్యాయులు, డ్రాపౌట్ శాతం లాంటి అంశాలను ఇందులో పొందుపరిచారు.
  • తెలంగాణ కంటే ఒడిశా ( 27.3). మేఘాలయ (21.7). బిహార్ (20.5), అస్సాం (20.3), పశ్చిమబెంగాల్ (18), గుజరాత్ (17.9), నాగా లాండ్( 17.5), పంజాబ్ (17.2), ఏపీ(16, 3), కర్ణాటక(14.70)లలో డ్రాపౌట్ శాతం ఎక్కువ ఉన్నాయి.
  • రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళు 30,023 ఉండగా… వాటిల్లో కంప్యూటర్ సౌకర్యం ఉన్నవి 8,296 మాత్రమే (27.63 శాతం).
  • అంతకంటే తక్కువ శాతం కంప్యూటర్ సౌకర్యం ఉన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 11 ఉన్నాయి.
  • తెలంగాణలో 2,772 ప్రభుత్వ బడుల్లోనే ఇంటర్నెట్ సౌకర్యం (9.2 శాతం) ఉంది.
  • ఈ విషయంలో మన కంటే వెనుకబడిన రాష్ట్రాలు యూపీ (8.8), ఒడిశా(8,1), మిజోరం(6), బిహార్ (5, 9)
  • 4 శాతం ఉన్నత పాఠశాలల్లోనే సైన్స్ ల్యాబులు ఉన్నాయి.

 

భూ వాతావరణంలోకి రీశాట్

  • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2009లో ప్రయోగించిన రీశాట్ ఉపగ్రహం 2022 సెప్టెంబర్ 30న భూవాతావరణంలోకి ప్రవేశించింది.
  • జకార్తా దగ్గర్లోని హిందూ మహా సముద్రం ఎగువ భాగంలో ఆ ప్రక్రియ జరిగిందని ఇస్రో తెలిపింది.
  • దాని శకలాలు మహా సముద్రంలో పడిపోవడానికి ముందే భస్మం అయి ఉండొచ్చని తెలిపింది.
  • రీశాట్ బరువు దాదాపు 300 కిలోలు.

Leave a Reply