Friday, September 20

స్టార్టప్ లకు కేంద్రం ప్రోత్సాహం

భారతదేశంలో స్టార్టప్ (అంకుర) పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ.10వేల కోట్ల మూలనిధిని ఏర్పాటు
చేసింది కేంద్ర ప్రభుత్వం. భారత జీవిత బీమా సంస్థ (LIC) దీనికి సహ పెట్టుబడి దారు. స్టార్టప్ పరిశ్రమలకు 3యేళ్ళ పాటు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వంతో సంప్రదింపులకు సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు చేస్తారు. మొదటి విడతగా రూ.2,500 కోట్ల మూలనిధిని ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలో స్టార్టప్ లకు మూడో కేంద్రంగా భారత్ నిలిచింది. అమెరికా, బ్రిటన్ తర్వాత ఇక్కడే స్టార్టప్ లు ఎక్కువగా
ఏర్పాటవుతున్నాయి.