సింధూ సంస్కృతి

1) సంస్కృతి అనే పదం మొదటిసారిగా ఎక్కడ కనిపించింది ?
జ: ఇంగ్లీషులో ( Culture) (16 వ శతాబ్దంలో)
2) భారతదేశంలో సంస్కృతిని ఎలా వర్ణిస్తారు ?
జ: భిన్నత్వంలో ఏకత్వం
3) భారతదేశాన్ని జాతుల ప్రదర్శనశాలగా వర్ణించిన వారెవరు ?
జ: స్మిత్
4) సింధు (హరప్పా) సంస్కృతి లక్షణం ఏంటి ?
జ: పట్టణ నిర్మాణ ప్రణాళిక
5) సింధూ సంస్కృతిలో చెప్పుకోదగిన ప్రణాళికాబద్జమైన వ్యవస్థ ఏది ?
జ: మురుగు కాల్వల వ్యవస్థ
6) సింధు నాగరికత కాలంలో ప్రధానమైన పురుష దేవత ఎవరు ?
జ: పశుపతి మహాదేవుడు ( శివుడు)
7) పశుపతి మహాదేవుడు చుట్టూ ఉండే నాలుగు జంతువులు ఏవి ?
జ: ఏనుగు, పులి, ఖడ్గ మృగం, దున్న
8) పశుపతి మహాదేవుడు పాదాల దగ్గర ఉండే జంతువులు ఏవి ?
జ: రెండు జింకలు
9) సింధు ప్రజల స్త్రీ దేవత ఎవరు ?
జ: ధరణీ మాత (అమ్మతల్లి)
10) సింధు ప్రజలు ఏ పంటలు పండించే వారు ?
జ: గోధుమలు, వరి, బార్లీ, పత్తి
11) సింధు ప్రజలు ఎక్కువగా ఏయే దేశాలతో వాణిజ్యం కొనసాగించేవారు ?
జ: ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ తో
12) సింధు ప్రజలు కొలతలకు ఉపయోగించిన పద్దతి ఏది ?
జ: దశాంశ పద్దతి
13) సింధు ప్రజల లిపిని ఏమని పిలుస్తారు ? ఇది ఎక్కడ కనిపించేది ?
జ: చిత్ర లిపి ( సర్పలేఖనం), ముద్రలు (సీళ్ళ) మీద కనిపించేది
14) సింధు ప్రజలు చేసే తాపీ పనికి ఏమని పేరు ?
జ: ఇంగ్లీష్ బాండ్
15) సింధూ ముద్రికల మీద ఏయే గుర్తుల ఆధారంగా వీరు సూర్యుడిని ఆరాధించేవారిని చెప్పవచ్చు ?
జ: స్వస్తిక్, చక్రాలు
16) హరప్పా ప్రజలు గృహ నిర్మాణంలో వేటిని వాడేవారు ?
జ: కాల్చిన ఇటుకలు
17) టెర్రాకోట బొమ్మలను పూజా వస్తువులుగా ఉపయోగించే వారు. అయితే వాటిల్లో ఏ చిత్తరువులు ఉండేవి ?
జ: స్త్రీ, పురుషులు, పక్షులు, జంతువుల బొమ్మలు
18) నగ్నంగా ఉన్న నాట్యగత్తె కాంస్య ప్రతిమ ఎక్కడి తవ్వకాల్లో బయటపడింది ?
జ: మొహెంజోదారోలో
19) కుమ్మరి చక్రం విస్తృతంగా వాడటం అనేది ఏ నాగరికతా కాలంలో మొదలైంది ?
జ: సింధూ నాగరికత
20) బరువులు తూచేందుకు ఏ గుణిజాలను ఉపయోగించేవారు?
జ: 16 అంకెను