షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి

1) షాదీ ముబారక్ పథకం మైనార్టీ యువతులు పెళ్ళి చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఆర్థిక సాయం. ఈ పథకం కింద ఎంత మొత్తం ఇస్తారు ?
జ: రూ.51 వేలు
2) షాదీ ముబారక్ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 2014 అక్టోబర్ 2 నుంచి
3) షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు మైనార్టీ యువతులకు ఎంత వయస్సు నిండిన వారు అర్హులు ?
జ: 18 యేళ్ళు
4) కళ్యాణ లక్ష్మి పథకంలో ఏయే వర్గాల పెళ్లిళ్ళకు ఆర్థిక సాయం చేస్తారు ?
జ: ఎస్సీ, ఎస్టీలు
5) కల్యాణ లక్ష్మి పథకం కింద ఎంత మొత్తాన్ని చెల్లిస్తారు ?
జ: రూ.51 వేలు
6) కల్యాణ లక్ష్మి పథకం కింద సాయం పొందాలంటే తల్లిదండ్రుల వార్షికాదాయం ఎంత ఉండాలి ?
జ: రూ.2 లక్షలు

7) కళ్యాణ లక్ష్మి పథకంలో బీసీ యువతులకు కూడా ఆర్థిక సాయం ఎప్పటి నుంచి ఇస్తున్నారు ?
జ: 2016 ఏప్రిల్ 1

8) కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో భాగంగా ఆడపిల్లల పెళ్ళికి ఇచ్చే మొత్తాన్ని 51 వేల నుంచి ఎంతకు పెంచారు ?

జ: రూ. 75,116