Wednesday, February 26

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్

గ్రామీణ, పట్టణ ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ‘శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్’ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. పల్లెలల నుంచి పట్టణాలు, నగరాలకు వలసలను నిరోధించేందుకు ఉద్దేశించిందే ఈ పథకం. ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లా కురుభత్ గ్రామంలో ప్రధాని ఈ పథకం ప్రారంభించారు. మూడేళ్ళలో 300 గ్రామాలను ఈ రూర్భన్ మిషన్ కింద అభివృద్ధి చేయాలన్నది కేంద్రం లక్ష్యం. పథకంలో భాగంగా గ్రామాల్లోని ప్రజలకు ఎలక్ట్రానిక్ సేవలు అందించడం, డిజిటల్ అక్షరాస్యత, మొబైల్ హెల్త్ యూనిట్లు, విద్య, పారిశుధ్యం, తాగు నీటి సరఫరా, పట్టణాలతో గ్రామాల రహదారులను అనుసంధానం చేయడం, యువతలో నైపుణ్యాలపై శిక్షణ లాంటి అంశాలు ఉన్నాయి.