వేదకాలం నాటి సంస్కృతి

1) విద్ అనే సంస్కృత ధాతువునుంచి ఏ పదం ఉద్భవించింది ?
జ: వేద
2) వేద సాహిత్యాన్ని, వేదాంగాలను ఏమని అంటారు ?
జ: వేద సాహిత్యాన్ని శృతి అనీ, వేదాంగాలను స్మృతి అంటారు
3) ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని ఎక్కువ మంది చరిత్రకారులు భావిస్తున్నారు ?
జ: మధ్య ఆసియా నుంచి
4) రుగ్వేద కాలంలో గ్రామానికి ఎవరు నాయకత్వం వహించేవారు?
జ: గ్రామణి
5) రాజుకు సహాయకారిగా, రాజును నియంత్రించేవిగా ఏవి ఉండేవి ?
జ: సభ, సమితి
6) స్త్రీలకు ఏ కాలంలో మంచి గౌరవం ఉండేది ?
జ: రుగ్వేద కాలంలో ( మలివేద కాలంలో స్త్రీలకు గౌరవం లేదు)
7) రుగ్వేద కాలంలో తెగల నాయకుడిని ఏమనేవారు ? అతని విధులు ఏమిటి ?
జ: రాజన్. పశువులను రక్షించడం, యుద్ధాలు చేయడం, తెగల తరపున దేవతలను ప్రార్థించడం
8) రాజుకు పాలనలో ఎవరెవరు సహకరించేవారు ?
జ: సేనాని, గ్రామణి, పురోహితుడు
9) రాజులు రాజసూయ యాగం, అశ్వమేధం, వాజ పేయం యాగాలు నిర్వహించేవాడని ఏ గ్రంథంలో ఉంది ?
జ: శతపథ బ్రాహ్మణంలో
10) రుగ్వేద కాలంలో ఉండే సభలో ఎవరు సభ్యులుగా ఉండేవారు ?
జ: వయో వృద్ధులు
11) వేద కాలంలో ఏ లోహంతో చేసిన నాణేలు ద్రవ్యంగా వాడేవారు ?
జ: నిష్క
12) తొలి వేదకాలంలో ఆర్యుల ప్రధాన ఆర్థిక వనరు ఏది ?
జ: పశుపోషణ ( ఇదే వీరి ప్రధాన వృత్తి)
13) మలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏది ?
జ: వ్యవసాయం
14) రుగ్వేద కాలంలో వస్తుమార్పిడి పద్దతి వ్యాపారంలో ప్రధానంగా ఉండేది. అయితే మలివేద కాలానికి వచ్చే సరికి బంగారు నాణేలను వినిమయ సాధనంగా ఉపయోగించేవారు. వాటిని ఏమంటారు ?
జ: నిష్కం, శతమాన, కృష్ణా
15) వేదకాలంలో అతిధులను ఏమని పిలిచేవారు ?
జ: గోఘనలు