విపత్తుల నివారణ చర్యలు

1) విపత్తులపై ప్రపంచదేశాలకు అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది ?
జ: 1990-2000 దశాబ్దాన్ని
2) 1994లో ఎక్కడ నిర్వహించిన UNO సదస్సులో విపత్తులపై ఓ కార్యచరణ ప్రకటించారు ?
జం జపాన్ లోని యొకహోవాలో
3) అంతర్జాతీయ జల చైతన్య దశాబ్దంగా ఎప్పుడు ప్రకటించారు ?
జ: 2005-2015
4) జాతీయ విపత్తుల నిర్వహణ దినోత్సవం ఏది ?
జ: అక్టోబర్ 29
5) అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నారు ?
జ: అక్టోబర్ 13
6) మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తులకు లోనవుతున్నవి ?
జ: 26 ప్రాంతాలు ( తెలంగాణతో కలిపి)
7) మన దేశంలో మొత్తం తీర రేఖ పొడవు (7516 కిమీ) విపత్తులకు లోనవుతున్న ప్రాంతం ఎంత?
జం 5,700 కిమీ
8) విపత్తుల నిర్వహణ కోసం దేశంలో పనిచేస్తున్న అత్యున్నత అథారిటీ ఏది ?
జ: నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ
9) NDMA (నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ)కి ఛైర్మన్ ఎవరు ?
జ) ప్రధాని
10) NDMAలో ఎంతమంది సభ్యులు ఉంటారు ?
జ: ప్రధానితో పాటు 9 మంది సభ్యులు ( వీరందరికీ వైస్ ఛైర్మన్ హోదా ఉంటుంది)
11) ఏ కమిటీ సిఫార్సులతో విపత్తు నిర్వహణను వ్యవసాయ శాఖ నుంచి కేంద్ర హోంశాఖకు మార్చారు ?
జ) 1999లో వేసిన జేడీ పంత్ కమిటీ నివేదికతో
12) విపత్తు నిర్వహణ ఏ జాబితాలో ఉంటుంది ?
జ: ఉమ్మడి జాబితాలో
13) 27 సెప్టెంబర్, 2006న ప్రధాని అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఏ సంస్థ అమల్లోకి వచ్చింది ?
జ: విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ( National Disaster Management Authority)
14) NDMA నిర్మాణం మూడు స్థాయిల్లో ఉంటుంది. అవి ఏంటి ?
జ: NDMA - కేంద్ర స్థాయిలో - ప్రధాని అధ్యక్షతన
SDMA - రాష్ట్ర స్థాయిలో - ముఖ్యమంత్రి అధ్యక్షతన
DDMA - జిల్లా స్థాయిలో - జిల్లా కలెక్టర్/జిల్లా జడ్జి లేదా నగర డిప్యూటీ కమిసనర్
15) విపత్తుల కోసం ఏ పంచవర్ష ప్రణాళికలో ఓ ప్రత్యేకమైన చాప్టర్ ను రూపొందించారు ?
జ: 10 వ పంచవర్ష ప్రణాళిక
16) విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్రాలకు ఇచ్చే నిధులు 75:25 నిష్పత్తిలో ఉండాలని ఎవరు సూచించారు ?
జ: 11వ ఆర్థిక సంఘం


17) విపత్తు నిర్వహణలో ఆరు దశలు ఉన్నాయి. అవి ఏంటి ?
జ: నివారణ, సంసిద్ధత, ఉపశయనం, ప్రతిస్పందన, పునరావాసం, పునర్నిర్మాణం
18) జాతీయ విపత్తుకు ప్రతిస్పందన బలగాలుగా వేటిని పిలుస్తారు ?
జ: NDRF ( National Disaster Response Force) ప్రభుత్వం CISF, CRBF, BSF, ITBP ల నుంచి ఈ బలగాలను ఎంపిక చేస్తుంది.
19) NDRF బలగాలు దేశంలో ఎన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు ?
జ: 10 ప్రాంతాల్లో. (ఉమ్మడి ఏపీలో మంగళగిరి- గుంటూరు జిల్లాలో)
20) జాతీయ అగ్నిమాపక శిక్షణా కళాశాల ఎక్కడ ఉంది ?
జ: 1956లో నాగపూర్ ( మహారాష్ట్రలో)
(నోట్: జాతీయ అత్యవసర పనరావాస శిక్షణా కేంద్రం కూడా ఇక్కడే ఉంది)
21) మన దేశంలో జరిగే విపత్తులన్నింటికీ బాధ్యత వహించే కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది ?
జ: కేంద్ర హోంశాఖ
22) కరువులు, హిమపాతం, చీడపీడల దాడులకు బాధ్యత వహించే శాఖ ఏది ?
జ: వ్యవసాయ సహకార మంత్రిత్వ శాఖ
23) అడవుల దహనం (కార్చిచ్చు), పారిశ్రామిక రసాయన విపత్తులకు బాధ్యత వహించే శాఖ ఏది ?
జ: పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ
24) దేశంలో బయోలాజికల్ డిజాస్టర్ కు బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ ఏది ?
జ: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ
25) తుఫాన్లు, హరికేన్లకు నోడల్ మంత్రిత్వ శాఖ ఏది ?
జ: మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లోని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్
26) దేశంలో తరచుగా విపత్తులు సంభవిస్తున్న 15 రాష్ట్రాల్లో UNDP సహకారంతో ఏ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది ?
జ: Disaster Risk Management Programme
27) Distaster Risk Management program లో భాగంగా గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణలో ఎవరికి బాధ్యత కలదు ?
జ: స్థానిక సంస్థలు లేదా పంచాయతీ రాజ్
28) తెలంగాణకి కేంద్రం మంజూరు చేసిన మూడు విపత్తు నిర్వహణ కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ?
జ: హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్
29) సాధారణ టెలిఫోన్, మొబైల్ ఫోన్ నెట్ వర్క్ కు అంతరాయం కలిగితే అత్యవసర సమయాల్లో ఏ కమ్యూనికేషన్ ను ఉపయోగించుకుంటారు ?
జ: హామ్ రేడియో (అమెచ్యూర్ రేడియో)


30) టెలికమ్యూనికేషన్స్, టెలివిజన్ ప్రసారాలు, వాతావరణం, విపత్తు హెచ్చరికల కోసం ఏ శాటిలైట్ ఉపయోగపడుతోంది ?
జ: ఇన్ శాట్ ( ఇండియన్ నేషనల్ శాటిలైట్)
31) విపత్తులు, ప్రమాదాల సమయంలో సమాచార వ్యవస్థ పనిచేయకపోతే అలాంటి చోట అండగా నిలిచేందుకు అత్యాధునిక సమాచార వ్యవస్థను భారత్ - జపాన్ సంయుక్తగా రూపొందించాయి. దాని పేరేంటి ?
జ: దిశా నెట్
(Information Network for Natural Disaster Mitigation and Recovery)