మోహినీ అట్టం

1) మోహినీ అట్టం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి ?
జ: కేరళ
2) మోహిని అట్టం ఏ రాజు కాలంలో ఆవిర్భించింది ?
జ: ట్రావెన్ కూర్ రాజైన మహారాజా స్వాతి తిరునాళ్ కాలంలో
3) మోహిని అట్టంలో గీతాల్లో చాలా వరకూ ఎవరు రచించారు ?
జ: మహారాజా స్వాతి తిరునాళ్
4) మోహినీ అట్టంను ఎంతమంది ప్రదర్శిస్తారు ?
జ: ఒక్కరు మాత్రమే
5) కేరళలో దేవదాసీ సాంప్రదాయం ద్వారా వెలుగులోకి వచ్చిన నృత్యం ఏది ?
జ: మోహిని అట్టం
6) మోహినీ అట్టం నాట్య ప్రస్తావన మొదట ఎవరి రచనల్లో కనిపిస్తుంది ?
జ: నారాయణ నంబూద్రి
7) మోహినీ అట్టాన్ని పునరుద్ధరించినది ఎవరు ?
జ: వళ్లత్తోల్ కవి
8) మోహినీ అట్టంలో ఏ నృత్యరీతులు ఉంటాయి ?
జ: తాండవ, లాస్యం
9) ఈ నాట్యంలో నాట్యకత్తెలు ఏ దుస్తులను ధరిస్తారు ?
జ: తెల్లటివి
10) మోహిని అట్టంలో ప్రసిద్ధులైన కళాకారిణి ఎవరు ?
జ: కళ్యాణియమ్మ