మొఘల్ సామ్రాజ్యం

1) మొఘల్ సామ్రాజ్యాన్ని స్దాపించినది ఎవరు?
జ) బాబర్.
2) బాబర్ మొదటి సారిగా ఇండియాపై ఎప్పుడు దాడి చేశాడు?
జ) 1519
3) మొదటి పానిపట్టు యుద్దంలో బాబర్ ఎవరిని ఓడించాడు?
జ) ఇబ్రహీంలోడీ
4) హూమాయూన్ ఏ కాలంలో పరిపాలన చేశాడు?
జ) 1530.
5) మహ్మద్ లోడీని ఎవరు ఓడించారు?
జ) హుమాయున్.
6) సూర్ వంశంను స్దాపించినది ఎవరు?
జ) షేర్షా ( షేర్ ఖాన్ అంటారు )
7) షేర్షా కాలంలో రెవిన్యూ మంత్రి ఎవరు?
జ) తోడర్ మల్
8) అక్బర్ అసలు పేరేమిటి?
జ) జలాలుద్దీన్ అక్బర్.
9) అక్బర్ కి ఏ వయస్సులో పట్టాభిషేకం .జరిగింది?
జ.14 యేళ్ళప్పుడు
10) అక్బర్ రాజధానిని ఎక్కడనుండి ఎక్కడికి మార్చాడు?
జ) ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీకి.
11) బులంద్ దర్వాజాను ఎవరు నిర్మించారు?
జ) అక్బర్.
12) అక్బర్ కాలంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎవరు?
జ) తాన్ సేన్.
13) జహంగీర్ ఎవరిని హత్య చేశాడు?
జ) అబుల్ ఫజల్.
14) నూర్జహాన్ ఎవరి భార్య?
జ) జహంగీర్.
15) తాజ్ మహాల్ ణు ఎవరు నిర్మించారు?
జ) షాజహాన్.
16) తాజ్ మహల్ నిర్మించడానికి ఎంతకాలం పట్టింది?
జ) 22 యేళ్ళు (22వేల మంది కార్మికులు)
17) తాజ్ మహల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయినది?
జ) 3 కోట్లు.
18) ఎర్రకోటను ఎవరు నిర్మించారు?
జ) హమీద్
19) షాజహాన్ ఆస్థానంలో ఉన్న వ్రజం ఏది ?
జ) కోహినూర్ వజ్రం.
20) ప్రపంచంలోనే పెద్ద మసీదు ఏది?
జ) జామా మసీదు.
21) కోహినూర్ వజ్రం ఎవరు ఇచ్చారు?
జ) మీర్ జామ్లా
22) షాజహాన్ ను ఏమని పిలిచేవారు?
జ) ఢిల్లీ నగర స్థాపకుడు, ఇంజనీర్ కింగ్.
23) ఔరంగజేబు పూర్తి పేరు ఏమిటి?
జ) ముజఫర్ మెహిఉద్దీన్ మహ్మద్ ఔరంగజేబు.
24) ఔరంగ జేబు బిరుదులు ఏంటి?
జ) అలంగీర్, జిందా పీఠ్, దార్వేష్.
25) జిజియా పన్నును ఎవరు ప్రవేశపెట్టారు?
జ) ఔరంగజేబు.
26) నాణేలపై ఏ శ్లోకాలను ఔరంగజేబు తొలగించాడు?
జ) ఖురాన్
27) అక్బర్ పరిపాలనలో భూమిశిస్తు విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
జ.తోడర్ మల్
28) మొగలుల కాలంలో ఏ పరిశ్రమ అభివృద్ది చెందినది?
జ) నేత పరిశ్రమ.
29) మొగల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్దాపించారు?
జ) బాబర్.
30) హూమాయున్ ను షేర్షా ఏ యుద్దంలో ఓడించాడు?
జ) చౌసా యుద్దంలో
31) అక్బర్ సంరక్షకుడు ఎవరు?
జ) జైరాంఖాన్.
32) అక్బర్ ఆక్రమించిన చివరి కోట ఏది?
జ.ఆసిర్ఘడ్ కోట.
33) అక్బర్ ఆస్థానకవి ఎవరు?
జ) అబుల్ ఫజల్.
34) అక్బర్ ఆస్థాన విదూషకుడు ఎవరు?
జ) బీర్బల్.
35) ఆగ్రా కోటను ఎవరు నిర్మించారు?
జ) అక్బర్.
36) తన ఆస్దానంలో బంగారు గంటను ఏర్పాటు చేసినది ఎవరు?
జ) జహంగీర్.
37) షాజహాన్ అసలు పేరేమిటి?
జ) ఖుర్రం.
38) షాజహాన్ కాలంలో మొగలులు కోల్పోయిన ప్రాంతం ఏది?
జ) కాందహార్
39) ఎర్రకోటలోని ముఖ్యమైన కట్టడం ఏది?
జ) రంగ్ మహల్.
40) ఔరంగజేబు గోల్కొండ కోటను ఎప్పుడు ఆక్రమించాడు?
జ) క్రీ.శ.1687.
41) ఫిరంగి దళాన్ని మొదట ఏర్పాటు చేసింది ఎవరు?
జ) బాబర్.
42) గణిత, వైద్య శాస్త్ర్రాలను బాగా ప్రోత్సహించిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ) అక్బర్.
43) మొగలుల కాలంలో గొప్ప చిత్రకారుడు ఎవరు?
జ) జహంగీర్.
44) తాన్ సేన్ హిందూస్థానీ సంగీతంలో కనిపెట్టిన కొత్త రాగం ఏది?
జ) హుస్సేనీ
45) షాజహాన్ ఆస్థానంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎవరు?
జ) రామదాసు.
46) ట్రావెన్ కోర్ రాజ్యాన్ని ఎవరు స్దాపించారు?
జ) రాజా మార్తాండవర్మ
47) జాగీర్ లు ఇచ్చే పద్దతిని ప్రవేశపెట్టింది ఎవరి కాలంలో ?
జ: మొగలుల కాలంలో
48) మొగలుల కాలంలో సైనిక శాఖాధిపతిని ఏమని పిలిచేవారు ?
జ: మీర్ భక్షీ
49) అక్బర్ తన సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించాడు. వాటిని ఏమనేవారు ?
జ: సుబాలు ( జిల్లాలు - సర్కారులు)
50)మొగలుల కాలంలో ముహర్ అనే బంగారు నాణెం ఎన్ని రూపాయలకు సమానం ?
జ: తొమ్మిది రూపాయలు
51) మొగలుల కాలంలో గోడలకు అంటించే వృక్ష సంబంధిత డిజైన్లను ఏమని పిలిచేవారు ?
జ: పీత్రా - డ్యూరా
52) అయిన్ ఇ అక్బరీ, అక్బర్ నామా రాసినది ఎవరు ?
జ: అబుల్ ఫజల్
53) మహాభారతాన్ని పర్షియా భాషలోకి ఏ పేరుతో అనువదించారు ?
జ: రజ్మ్ నామా