మిషన్ కాకతీయ పథకం

1) మిషన్ కాకతీయ పథకం టాగ్ లైన్ ఏది ?
జ: మన ఊరు - మన చెరువు
2) మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలో దాదాపు ఎన్ని చెరువులను పునరుద్ధరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం ?
జ: 46,531 వేలకు పైగా చెరువులు (2లక్షల కోట్లు )
3) మిషన్ కాకతీయ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2015 మార్చి 12న
4) ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: నిజామాబాద్ జిల్లా సదాశివ నగర్ లోని పాత చెరువులో
5) ప్రతి ఏడాది ఎన్ని చెరువులు బాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
జ: 9,306 చెరువులు
6) ఒక్కో చెరువు కనీసం ఎంత నీటి సామర్థ్యం కలిగి ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది ?
జ: 250 - 270 టీఎంసీలు
7) మిషన్ కాకతీయ పథకానికి ఏయే సంస్థలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి ?
జ: నాబార్డ్, ప్రపంచ బ్యాంక్