Monday, September 23

మన విశ్వం

1) విశ్వం గురించి అద్యయనం చేసే శాస్త్రం ఏది?
జ: కాస్మోలజీ (రష్యన్లు పిలుస్తారు), ఆస్ట్రానమీ (అమెరికన్ల భావన)
2) ఖగోళ అధ్యయన శాస్త్రం ఏది?
జ: ఆస్ట్రానమీ
3) అంతరిక్ష నావికులను అమెరికా, రష్యా, చైనాల్లో ఏమని పిలుస్తారు ?
జ: ఆస్ట్రోనాట్స్ ( అమెరికా), కాస్మోనాట్స్ ( రష్యా), టైకోనాట్స్ ( చైనా)
4) రోదసీ యాత్రికులకు బయట ఉన్న ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది?
జ: నలుపు
5) బిగ్ బ్యాంగ్ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు
జ: అబ్బే జార్జిస్ లిమేటర్
6) గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి?
జ:.1 నుండి 10 బిలియన్ల


7) విశ్వంలో అతి పెద్ద గెలాక్సీ ఏది?
జ: హైడ్రా
8) పాలపుంతకు గల ఇతర పేర్లేమిటి?
జ : ఆకాశగంగ (భారత్) ,ఖగోళ నది( చైనా), ,స్వర్గానికి దారులు ( గ్రీకులు), ,తెల్లని భస్మ రహదారి (ఎస్కిమోలు)
9) గెలాక్సీల సముదాయాన్ని ఏమంటారు?
జ: క్లస్టర్
10) దక్షిణ ధృవం నుంచి ఆకాశంలో కనిపించే నక్షత్ర సమూహాన్ని ఏమంటారు?
జ: ఉర్సు మైనర్
11) నక్షత్రాల జన్మస్దానాలు ఏవి?
జ: నీహారికలు ( నెబ్యూలా)
12) భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?
జ: సూర్యుడు ( తర్వాత ప్రాక్సిమా సెంటారీ)
13) విశ్వంలో అతిపెద్ద నక్షత్రం ఏది?
జ: బెటిల్ గ్లక్స్
14) విశ్వంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం ఏది?
జ: డాగ్ స్టార్(సిరియస్)
15) నక్షత్రాల వయస్సును కొలిచే పరికరం ఏది?
జ: కాస్మోక్రోనో మీటర్
16) నక్షత్రాల్లో అధిక శాతం గల వాయువులు ఏవి ?
జ: హైడ్రోజన్ (71శాతం), హీలియం (26.5శాతం)
17) గెలాక్సీల్లో దుమ్ము, ధూళి వాయువుల సమూహాన్ని ఏమంటారు?
జ: నీహారికా (నెబ్యూలా)
18) నీహారికలను కనుగొన్నది ఎవరు?
జ: హేజెన్స్
19) అంతర్గతంగా తాత్కాలిక విస్పోటనాలు సంభవించే నక్షత్రాలను ఏమంటారు?
జ: తాత్కాలిక నక్షత్రాలు


20) కృష్ణ బిలాలపై (బ్లాక్ హోల్స్) పరిశోధన చేసి చంద్రశేఖరన్ లిమిట్ అనే సిద్దాంతంను ప్రతిపాదించినది ఎవరు?
జ: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
21) సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కు నోబుల్ బహుమతి ఎప్పుడు వచ్చింది ?
జ: 1983లో భౌతికశాస్త్రం
22) సూర్యుడు పాలపుంత చుట్టూ ఒక పరిభ్రమణం చేయుటకు ఎన్నేళ్ళు పడుతుంది?
జ: 250 మిలియన్ సంవత్సరాలు
23) సూర్యునిలో శక్తి మూలాధారం ఏది?
జ: న్యూక్లియర్ సంలీనం
24) సూర్యుని యొక్క వ్యాసం ఎంత?
జ: 13,91,980 కి.మీ.
25) ఆకాశంలోని నీలిరంగుకి కారణమేంటి?
జ: కాంతి పరిక్షేపణం
26) ఆకాశంలో ఇంధ్రధనస్సు ఏర్పడడానికి కారణం ఏమిటి?
జ: కాంతివిక్షేపణం
27) సూర్యుడు అస్తమించే, ఉదయించే సమయాల్లో ఎర్రగా కనపడుటకు కారణం ఏంటి?
జ: కాంతి వివర్తనం
28) సూర్యునికి, భూమికి మధ్య గల డూరాన్ని ఏమంటారు?
జ: ఆస్ట్రనామికల్ యూనిట్
29) ఆస్టరాయిడ్ ను ఎవరు కనుగొన్నారు? అతిపెద్ద, అతిచిన్న ఆస్టరాయిడ్ ఏది?
జ: సియాజే అనే శాస్త్రవేత్త, పెద్దది: సెరిస్, చిన్నది: హెర్మస్
30) భూమిని తాకిన ఉల్కలను ఏమంటారు?
జ: ఉల్కా శిలలు లేదా ఉల్కాపాతం


31) సూర్యుని చుట్టూ వృత్తాకార మార్గంలో పరిభ్రమించే దుమ్ము ధూళి కణాలు లేదా వాయువులచే ఏర్పడిన ఖగోళ వస్తువులనేమంటారు?
జ: తోకచుక్కలు
32) తోకచుక్కలోని ప్రకాశవంతమైన భాగం ఏది?
జ: కామా
33) హేలీ తోకచుక్కను ఎవరు గుర్తించారు?
జ: ఎడ్మండ్ హేలీ
34) సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం, అతి చిన్న గ్రహం ఏది?
జ: బుధుడు
35) యూరప్ లో బుధుడిని ఏమని పిలుస్తారు?
జ: అపోలో
36) అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన గ్రహం ఏది?
జ: శుక్రుడు
37) భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది?
జ: శుక్రుడు
38) శుక్ర గ్రహానికి ఉన్న పేర్లేంటి ?
జ: మార్నింగ్ స్టార్, ఈవెనింగ్ స్టార్, దాచబడ్డ గ్రహం
39) శుక్రగ్రహాన్ని పరిశోధన చేసిన అంతరిక్ష నౌక ఏది?
జ: వెనేరస్


40) భూమికి గల ఏకైక ఉపగ్రహం ఏది?
జ: చంద్రుడు
41) చంద్రుని వ్యాసం ఎంత?
జ: 3,475 కి.మీ.
42) చంద్రనిపై మొదటిసారి మానవుడు కాలు మోపిన ప్రాంతం ఏది?
జ: సీ ఆఫ్ లాంక్విలిటీ (శాంత సముద్రం)
43) బ్లూ మూన్ అనగా ఏమిటి?
జ:ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమి నాటి చంద్రుడు
44) చంద్రునిపై దిగిన మొదటి వ్యక్తులు ఎవరు ?
జ: నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విని ఆల్ట్రిన్
45) పెరోజీ సమయంలో భూమికి దగ్గరగా వచ్చిన చంద్రుడిని ఏమంటారు?
జ: సూపర్ మూన్
46) సూపర్ మూన్ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు?
జ: రిచర్డ్ నోలె
47) చంద్రునిపై మొదటి నౌక అపోలో ఎక్కడ దిగింది?
జ: మారియస్
48) శని గ్రహాన్ని ఎవరు కనుగొన్నారు?
జ: గెలీలియో
49) సూర్యుని నుంచి భూమికి గల సగటు దూరం ఎంత?
జ: 149,470,000 కి.మీ.