మతపరమైన ఉద్యమాలు

1) శంకరాచార్య ఎక్కడ జన్మించాడు?
జ) కేరళలోని కాలడి
2) విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్య ఎక్కడ జన్మించారు?
జ) శ్రీపెరంబుదూర్.
3) రామ్ రహీం- ఒకే నాణెం యొక్క రెండు రూపాలని చెప్పిందెవరు ?
జ) కబీర్.
4) సిక్కుల పవిత్ర గ్రంథం ఏది?
జ) ఆది గ్రంధ్.
5) హరే రామ, హరే కృష్ణ నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
జ) చైతన్యుడు.
6) ఔరంగజేబు ఉరితీయించిన సిక్కుల గురువు ఎవరు ?
జ: గురు తేజ్ బహదూర్
7) ఖల్సాను ఏర్పాటు చేసి సిక్కులను సైనిక తెగగా వ్యవస్థీకరించింది ఎవరు ?
జ: పదో గురువు గురు గోవింద్ సింగ్
8) మోక్షమార్గానికి ఉత్త మార్గం ‘రాగ మార్గం’ అని సందేశాన్ని ప్రచారం చేసింది ఎవరు ?
జ: చైతన్యుడు
9) సూర సాగర్; సూర సారావళి గ్రంథాలను రాసినది ఎవరు ?
జ: సూరదాసు (వల్లభాచార్యుడి శిష్యుడు)
10) రాజస్థాన్ లో కృష్ణ ఉపాసనను ప్రచారం చేసిన భక్తురాలు ఎవరు ?
జ: మీరాబాయి
11) అసోంలో వైష్ణవ భక్తిని ప్రచారం చేసిందెవరు ?
జ: శంకరదాసు
12) హిందీలో సుప్రసిద్ధమైన రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరు ?
జ: తులసీదాసు
13) మహారాష్ట్ర ధర్మ అనే భక్తి ఉద్యమాన్ని స్థాపించింది ఎవరు ?
జ: జ్ఞాన దేవుడు
14) జ్ఞానదేవుడు భగవద్గీత మీద రాసిన వ్యాఖ్యానం పేరేంటి ?
జ: జ్ఞానేశ్వరి
15) విగ్రహారాధన, పురోహితుల ప్రాబల్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రేమ సందేశాన్ని బోధించినది ఎవరు ?
జ: నామదేవుడు
16) శివాజీ సమకాలికుడు, పండరీ పురం విఠలనాథుడికి గొప్ప భక్తులు ఎవరు ?
జ: తుకారాం
17) మరాఠా జాతీయవాదానికి ఆద్యుడు ఎవరు ?
జ) తుకారాం
18) మొగలుల పాలన అంతం చేయడానికి శివాజీని ప్రోత్సహించడంతో పాటు మహారాష్ట్రలో ఆశ్రమాలను నిర్మించినది ఎవరు ?
జ: రామదాసు
19) ద్వైత సంప్రాదాన్ని స్థాపించింది ఎవరు ?
జ: మధ్వాచార్యులు
20) ద్వైతాధైతం అనే మరో సంప్రదాయాన్ని నెలకొల్పింది ఎవరు ?
జ: నింబార్కుడు
21) శుద్ధాద్వైతం అనే సంప్రదాయాన్ని నెలకొల్పింది ఎవరు ?
జ: వల్లభాచార్యుడు
22) తమిళనాడులో వైష్ణవ సన్యాసులను ఆళ్వారులు అంటారు. వీరి సాహిత్యానికి ఉన్న పేరేంటి ?
జ: ప్రబంధాలు
23) కన్నడ సాహిత్యంలో రత్నత్రయం అని ఎవర్ని అంటారు ?
జ: పంప, పొన్న, రన్న కవులు
24) మలయాళంలో అతి ప్రాచీన గ్రంథం ఏది ?
జ: ఉన్ను నిలి సందేశం