భూమి చలనాలు

1) భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని ఏమంటారు?
జ: భూభ్రమణం
2) భూమి పడమర నుంచి తూర్పునకు గంటకు దాదాపు ఎన్ని కిమీ వేగంతో తిరుగుతుంది ?
జ: 1610 కి.మీ
3) భూమి ఒక భ్రమణం చేయుటకు పట్టు కాలం ఎంత ?
జ: 23 గంటల 56 నిమిషాల 4.092 సెకన్లు
4) భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి యొక్క కేంద్రం గుండా పోయే రేఖను ఏమంటారు?
జ: అక్షం
5) భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన కక్స్యా మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుటను ఏమంటారు ?
జ: భూ పరిభ్రమణం
6) భూమి ఒక పరిభ్రమణం చేయుటకు పట్టు కాలం ఎంత ?
జ: 365 రోజుల 6 గంటల 10 సెకన్లు (365 1/4రోజులు)
6) ఏడాదికి సాధరణంగా 365 రోజులుగా చెబుతారు. మరి మిగిలిన 6 గంటలను ఎలా లెక్కిస్తారు ?
జ: వాటిని 4 సంవత్సరాలకోసారి లెక్కించి.. లీపు సంవత్సరంగా 365లను పిలుస్తారు.
7) భూమ్మీద రాత్రి, పగలు సమయాల్లో తేడాలు, రుతువులు ఏర్పడటానికి కారణం ఏంటి ?
జ: భూ పరిభ్రమణం
8) భూమి సూర్యునికి అతి దగ్గరగా వచ్చే స్థితిని ఏమంటారు?
.జ: పరిహేళి లేదా రవినీచ (147 మిలియన్ కిమీ)
9) పరిహేళి ఎప్పుడు సంభవిస్తుంది?
జ: జనవరి 3


10) సూర్యుడు భూమికి దూరంగా వెళితే దాన్ని ఏమంటారు ?
జ: అపహేళి లేదా రవి ఉచ్ఛ (జులై 4) (152 మిలియన్ కిమీ)
11) ఏడాదిలో ఏ రెండు రోజులు పగలు, రాత్రిళ్ళు సమానంగా ఉంటాయి ?
జ: మార్చి 21, సెప్టెంబర్ 23
12) పగలు రాత్రులు సమానంగా ఉన్న రెండు రోజులను ఏమని పిలుస్తారు?
జ. విషువత్తులు
13) భారత దేశం ఉత్తరార్ధ గోళంలో ఉంది. మన దేశంలో ఏ రోజు పగలు సుదీర్థంగా ఉంటుంది ?
జ: జూన్ 21 ( తక్కువ పగలు : డిసెంబర్ 22)
14) ఆర్కిటిక్ వలయంలో పగలు 24 గంటలు, అంటార్కిటిక్ వలయంలో రాత్రి 24 గంటలు ఉండే రోజు ఏది ?
జ: జూన్ 21 (కర్కటక రేఖపై లంబంగా సూర్యకిరణాలు ప్రసరించే రోజు)
15) ఉత్తరాయణకాలం, దక్షిణాయన కాలం ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ?
జ: డిసెంబర్ 22 - జూన్ 21 మధ్య ఉత్తరాయణకాలం,
జూన్ 21- డిసెంబర్ 22 మధ్య దక్షిణాయన కాలం.
16) ఉత్తరార్థ గోళంలో వేసవి రుతువు ఎప్పుడు ఉంటుంది ?
జ: మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 మధ్య
17) ఉత్తర దృవంపై పగలు ఉండే కాలంఏది ?
జ: మార్చి 21 - సెప్టెంబర్ 23