భూమి కొనుగోలు పథకం

1) భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధార కుటుంబాల్లోని మహిళలకు ఎంత భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: మూడు ఎకరాలు
2) దళితులకు 3 ఎకరాల భూమి కొనుగోలుకు ఎంత శాతం సబ్సిడీ అమలవుతుంది ?
జ: 100 శాతం
3) దళితులకు మూడెకరాల భూమికి ఎన్ని జిల్లాలను ఎంపిక చేశారు ?
జ: హైదరాబాద్ మినహా 9 జిల్లాలు ( ఇప్పుడు 30 జిల్లాలు)
4) భూమిని కొనుగోలు చేసే అధికారం ఎవరికి ఇచ్చారు ?
జ: జిల్లా కలెక్టర్లకు

5) తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూమి కొనుగోలు పథకానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ?
జ: రూ.406 కోట్లు
6) భూమి కొనుగోలు పథకం కింద దళిత కుటుంబాలకు ఎన్ని ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది ?
జ: 9,664 ఎకరాలు
7) ఈ పథకం కింద ఎంతమంది లబ్దిదారులను ఇప్పటి వరకూ గుర్తించారు ?
జ: 3,671 కుటుంబాలు