భారత్ లో విపత్తులు – నివారణ చర్యలు

1) భారత్ లో విపత్తుల ప్రభావం ఎదుర్కోడానికి కేంద్రం ఎన్నిరాష్ట్రాలకు రూ.2892 కోట్ల విపత్తు ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది ?
జ: 8 రాష్ట్రాలకు
2) జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది ?
జ: 2009
3) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది ?
జ: న్యూఢిల్లీ
4) 1957లో నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ స్థాపించారు ?
జ: నాగపూర్
5) సునామీలపై పరిశోధన చేస్తున్న మహిళ ఎవరు ?
జ: సునంద
6) భారత్ లో ఎంత తీరప్రాంతం గాలి వానలు, తుఫాన్లు, సునామీలకు గురవుతోంది ?
జ: 5700కిమీ
7) ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ప్రకృతి విపత్తుల వల్ల నష్టం దేశ జాతీయ ఉత్పత్తిలో ఎంత శాతం ?
జ: 2 శాతం
8) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఉన్న ప్రదేశం ఏది ?
జ: డోనాపౌలా (గోవా)
9) జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ఏ కమీషన్ సిఫార్సులతో ఏర్పాటు చేశారు ?
జ: 11 వ ఆర్థిక సంఘం
10) కేంద్ర ప్రభుత్వంలో విపత్తు నిర్వహణకు నోడల్ ఏజెన్సీ ఏది ?
జ: హోంశాఖ