భారత్ అణు శక్తి రంగం

1) అణుబాంబులో సరిగే చర్యలు ఏమిటి?
జ: కేంద్రక విచ్చిత్తి చర్యలు
2) న్యూక్లియర్ రియాక్టర్ లో జరిగే చర్యలు ఏమిటి?
జ: కేంద్రక విచ్చిత్తి చర్యలు
3) సహజ రేడియో ధార్మికతను కనుగొన్నది ఎవరు?
జ: హెన్రీ బెకర్ల్
4) కృత్రిమ రేడియో ధార్మికతను కనుగొన్నది ఎవరు?
జ: మేడం క్యూరీ
5) సూర్యునిలో జరిగే చర్యలు ఏమిటి?
జ: కేంద్రక సంలీన చర్యలు.
6) మనదేశంలో మొదటి అణుశక్తి కమీషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1948లో హెచ్.జె.బాబా అద్యక్షతన
7) మన దేశపు అణుపితామహుడు ఎవరు?
జ: హెచ్.జె.బాబా.
8) TIFR (Tata Institute of Fundamental Research) ను ఎక్కడ స్దాపించారు?
జ: ముంబైలో
9) మనదేశంలోని అణుపరిశోధనా కేంద్రాలు ఎన్ని? అవి ఏంటి ?
జ: 1) BARC - Baba Atomic Research Centre (ట్రాంబే - మహారాష్ట్ర )
2) IGARC - Indira Gandhi Atomic Research Centre ( కల్పక్కం- తమిళనాడు)
10) CAT ( Centre for Advanced Technology ) ఎక్కడ ఉంది?
జ: మధ్యప్రదేశ్ లోని ఇండోర్
11) ప్రధాన అణు ఇంధన ఖనిజాలు ఏంటి?
జ: యురేనియం, ధోరియం
12) మనదేశంలో అణు ఖనిజాలను వెలికితీసే సంస్ద ఏది?
జ: UCIL ( యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్). జార్ఖండ్ లోని జాదు గూడ.
13) ప్రపంచంలో యురేనియంను ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశం ఏది?
జ: ఆస్ట్రేలియా
14) మనదేశంలో యురేనియం నిక్షేపాలకు ప్రసిద్ది చెందిన రాష్ట్రాలు ఏవి?
జ: జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్
15) ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో యురేనియం ఎక్కడ లభిస్తాయి?
జ: కడప జిల్లాలోని తుమ్మలపల్లి. నల్గొండలోని దేవరకొండ
16) శుద్ది చేయబడిన యురేనియంను ఏమంటారు?
జ: Enriched యురేనియం
17) ప్రపంచపు ధోరియం నిక్షేపాలకు ప్రసిద్ది చెందిన దేశం ఏది?
జ: భారత్
18) మనదేశంలో అణువిద్యుచ్చక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నయి?
జ: మహారాష్ట్రలోని తారాపూర్, గుజరాత్ లోని కాక్రాపర, కర్నాటకలోని కైగ, ఉత్తరప్రదేశ్ లోని నోన. తమిళనాడులోని కల్పకం.
19) మనదేశంలోని అణు రియాక్టర్ల సంఖ్య ఎంత?
జ: 20
20) మనదేశపు తొలి అణురియాక్టర్ ఏది?
జ: అప్సర
21) మనదేశపు అతిపెద్ద అణు రియాక్టర్ ఏది?
జ: ధృవ
22) దేశంలో తొలి భారజల కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: పంజాబ్ లోని నంగళ్ దగ్గర
23) మనదేశంలో మొదటిసారిగా అణుపరీక్షలు ఎప్పుడు ఎక్కడ జరిగాయి?
జ: మే 18, 1974 రాజస్దాన్ లోని పోఖ్రాన్ లో ప్రధాని ఇంధిరాగాంధీ ఆధ్వర్యంలో ప్రొ.రాజారామన్న నేతృత్వంలో జరిగాయి.
24) ఫోఖ్రాన్ అణు పరీక్షలకు పెట్టిన కోడ్ ఏంటి ?
జ : బుద్దుడు నవ్వాడు ( Budha Laughing )
25) అణు పరీక్షలు రెండోసారి ఎప్పుడు, ఎక్కడ జరిగాయి?
జ: ప్రధాని వాజ్ పేయి ఆధ్వర్యంలో శాస్త్రవేత్త ప్రొ.అబ్దుల్ కలాం అద్యక్షతన
1998 మే11న మూడు సార్లు
మే 13న రెండుసార్లు రాజస్దాన్ లోని థార్ ఎడారిలో గల పోఖ్రాన్ లో జరిగాయి.
26) వాజ్ పేయి హయాంలో పోఖ్రాన్ లో ఈ పరీక్షలకు పెట్టిన పేరేంటి?
జఫ బుద్దుడు మళ్ళీ నవ్వాడు
27) వాజ్ పేయి జై జవాన్ జై కిసాన్ పదాలకు తోడుగా ఏమని నినాదాన్ని ఇచ్చారు?
జ: జై విజ్నాన్
28) అంతర్జాతీయ అణుశక్తి సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?
జ: 1950 ఆస్ట్రియాలోని వియన్నాలో.
29) కెనడాలోని న్యూక్లియర్ రియాక్టర్ నిరంతరాయంగా ఎంత విద్యుదుత్పత్తి చేసింది?
జ: 894 రోజుల పాటు, 1994లో కెనడాలో
30) రాజస్దాన్ లోని రావట్ట్ భట్ లో నిరంతరాయంగా ఎంత విద్యుత్ ను ఉత్పత్తి చేశారు?
జ: 739 రోజులపాటు
31) ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న అణురియాక్టర్లు ఏవి?
జ: పీడన రహిత భారజల రియాక్టర్లు
32) ఒకే పరమాణు పంఖ్యలు కలిగి వేర్వేరు పరమాణు భారాలు గల పరమాణువులను ఏమంటారు?
జ: ఐసోటో ప్ లు
33) వేటికి రేడియోధార్మిక శక్తి అపరిమితంగా ఉంటుంది?
జ: యురేనియం, ధోరియం, ప్లూటోనియం.
34) శుద్ది చేసిన యురేనియం ఇవ్వడానికి భారత్-అమెరికా మద్య ఒప్పందం ఎప్పుడు కుదిరింది?
జ: 1963 మహారాష్ట్రలోని తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం
35) అమెరికా యురేనియం సరఫరాను ఎప్పుడు నిలిపివేసింది?
జ: 1974 పోఖ్రాన్ లో అణుపరీక్షల తర్వాత
36) అణుశక్తిని దేని కోసం ఉపయోగిస్తున్నాం?
జ: రేడియేషన్ నుంచి కాపాడడానికి, క్యాన్సర్ వ్యాధుల చికిత్సకు అవసరమైన రేడియో ఐసోటేపులు తయారీకి ఆహారపదార్దాలు నిల్వ చేసుకోడానికి.
37) భారత్ అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందం పేరేమిటి?
జ: 123 ఒప్పందం లేదా హైడ్ చట్టం.