భారతీయ సమాజ నిర్మితి – పరిచయం

1) భారతీయ సమాజం ఆదర్శాలు, విలువలతో కూడినది. అయితే హిందూ సమాజం పునాదులు వేటిపై నిర్మితమై ఉన్నాయి.
జ: (1)చతుర్విధ పురుషార్ధాలు (2) ఆశ్రమ ధర్నాలు (3)రుణాలు (4) కర్మ సిద్దాంతం (5)త్రిగుణాలు (6)శ్రుతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు
2) వేటిని సమాజంలో నివసిస్తున్న వ్యక్తి అంతర్గత, బాహ్య ప్రవర్తనను నియంత్రించడానికి నిర్దేశించారు ?
జ: చతుర్విధ పురుషార్థాలు
3) వ్యక్తులు వివిధ దశల్లో క్రమశిక్షణతో, ధర్మబద్ధంగా జీవించడానికి అవసరమైన చతుర్విధ పురుషార్థాలు ఏవి ?
జ: a) ధర్మం (b) అర్థం (c) కామం(కోరికలు) (d) మోక్షం
4) ‘ధృ’ అనే సంస్కృత ధాతువు నుంచి ‘ధర్మం’ అనే పదం వచ్చింది. దీనికి అర్థమేంటి ?
జ: కలిపి ఉంచు లేదా నిలబెట్టు
5) ధర్మం అనే పదం రుగ్వేదంలో ‘రుత’ అనే భావాన్ని తెలియజేస్తుంది. రుత అంటే ఏంటి ?
జ: ‘క్రమం’ అని అర్థం.
6) సమాజంలో సుఖమయ జీవనానికి గృహస్థ ధర్మానలను ఇతర బాధ్యతలను నిర్వర్తించడానికి వ్యక్తికి సంపద లేదా ఐశ్వర్యం చాలా అవసరం. దీన్ని ఏమంటారు ;
జ: ‘అర్థం’
7) సుఖానికి మూలం ధర్మం, ధర్మానికి మూలం అర్థం. అర్థానికి మూలం రాజ్యం. అర్థం అంటే భౌతిక లాభం పొందడం అని ఎవరు అన్నారు ?
జ: కౌటిల్యుడు
8) ప్రాథమిక సమూహం అయిన కుటుంబాన్ని ఏ విధంగా క్రమబద్దీకరించాలో... కుటుంబం, సమాజంలో వివిధ వ్యక్తుల నడవడి ఏ విధంగా ఉండాలో వివరించేది ఏది ?
జ: కామం
9) ధర్మాన్ని వివరించేది ధర్మశాస్త్రం, అర్థాన్ని వివరించేది అర్థశాస్త్రం, కామాన్ని వివరించేది కామశాస్త్రం. ఈ మూడింటిని కలిపి ఏమంటారు ?
జం ‘త్రివర్గాలు’
10) పురుషార్థాల్లో చివరిది, అత్యంత ప్రధానమైనది. వ్యక్తి జీవితంలో అంతిమ లక్ష్యం ఏది ?
జ: మోక్షం
11) అర్థాన్ని, కామాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించడం ద్వారా ఎక్కడికి చేరుకుంటారు ?
జ. మోక్షం
12) ఆశ్రమ ధర్మాలు లేదా వర్ణాశ్రమ ధర్మాలు అని వేటిని పిలుస్తారు ?
జ: 1)బ్రహ్మ చర్యాశ్రమం (2) గృహస్థాశ్రమం (3) వానప్రస్థాశ్రమం 4) సన్యాసాశ్రమం
13) వర్ణ ధర్మాన్ని బట్టి జ్నానాన్ని పొంది ఇతరులకు బోధించాల్సింది ఎవరు ?
జ: బ్రాహ్మణులు
14) రాజ్యాన్ని సంరక్షించి పాలన చేయాలని ఎవరికి సూచించారు ?
జ: క్షత్రియులు
15) వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం చేయాలని ఎవరికి సూచించారు ?
జ: వైశ్యులు
16) ఉపనయన సంస్కారం జరిగిన తర్వాతే మనుషులు ఎలా మారతారు ?
జ: ద్విజులుగా
17) పుట్టుకతో వచ్చే ఒక జన్మ, ఉపనయనం తర్వాత వచ్చే రెండో జన్మ. అందుకే వీరిని ఏమని పిలిచేవారు ?
జ: ద్విజులు
18) ఉపనయం సంస్కారంలో బ్రాహ్మణులు ఏ మంత్రం నేర్చుకుంటారు ?
జ: గాయత్రి మంత్రం
19) ఉపనయంలో క్షత్రియులు ఏ మంత్రం నేర్చుకుంటారు ?
జ: త్రిష్టుబ్ మంత్రం
20) ఉపనయంలో వైశ్యులు ఏ మంత్రం నేర్చుకుంటారు ?
జ: జగతీ మంత్రం
21) గురువు ఇంటి దగ్గరే ఉండి వేదాధ్యయనం చేయాలి అనేది ఏ ఆశ్రమంలో జరుగుతుంది ?
జ: బ్రహ్మచర్య ఆశ్రమంలో
22) బ్రహ్మచారిగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి జ్నాన యజ్నం చేసిది ఏ ఆశ్రమంలో జరుగుతుంది
జ: బ్రహ్మ చర్య ఆశ్రమంలో
23) ఓ వ్యక్తి పెళ్ళి చేసుకోవడం ద్వారా బ్రహ్మచర్యం నుంచి ఏ ఆశ్రమంలోకి వస్తాడు ?
జ: గృహస్థాశ్రమంలోకి
24) గృహస్థాశ్రమంలో పంచ మహాయజ్నాలు చేయాలి. అవి ఏంటి ?
జ: (1)బ్రహ్మ యజ్నం : వేధాధ్యయనం
(2)పితృ యజ్నం : తర్పణం, శ్రాద్ధ క్రియలు
(3)దైవ యజ్నం : కర్మకాండలు, హోమాలు
(4)భూత యజ్నం : బలి, అర్పణలు
(5)స్వయజ్నం : అతిథులకు,పేదవారికి సేవ చేయడం
25) పిల్లలకు పెళ్ళిళ్ళు జరిపించి, వారి సంతానంతో గడిపిన తర్వాత వ్యక్తి ఏ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు ?
జ: వానప్రస్థంలోకి
26) భార్యతో సహా అడవులకు వెళ్ళి నివాసం ఏర్పరచుకునే సందర్భం ఎప్పుడు వస్తుంది ?
జ: వానప్రస్థంలో
27) పూర్వపు జీవితంతో పూర్తిగా అనుబంధాన్ని తెంచుకోవడం, భార్యను కూడా విడిచి ఒంటరిగా ప్రవేశించేది ఏ ఆశ్రమం ?
జ: సన్యాశ్రమం
28) భిక్షాటన చేయాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని సన్యాసిలా జీవించాలి. పూర్తిగా దైవ చింతనలో గడపాలి. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు ?
జ: సన్యాశ్రామం
29) పుట్టిన ప్రతి వ్యక్తికి తీర్చకోవాల్సిన రుణాలు మూడు ఉన్నాయి. అవి ఏంటి ?
జ: 1.పితృ రుణం (2) గురు రుణం (3. దైవ రుణం
30) కర్మ సిద్ధాంతం గురించి ఏయే వేదాల్లో కనిపిస్తుంది ?
జ: మొదట రుగ్వేదంలో, తర్వాత అధర్వణ వేదంలో
31) సమాజంలో ఒక వ్యక్తి చేసే మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయని ఏ సిద్ధాంతం చెబుతుంది ?
జ: కర్మ సిద్ధాంతం 32) కర్మ అనేది నాలుగు చర్యల ద్వారా వ్యక్తమవుతుంది. అవి ఏంటి ?
జ: 1) ఆలోచనలు 2) సద్భావన కలిగిన మాట 3) మనం చేసే పనులు 4) మనం ఇతరులతో చేయించే పనులు
33) వ్యక్తి ప్రవర్తనా రీతుల ఆధారంగా త్రిగుణాలను వివరించారు. అవి ఏంటి ?
జ: సత్వ, రజో, తమో గుణం
34) వినికిడి ద్వారా నేర్చుకునేవి. గురుముఖంగా ఆయన నోటి నుంచి వినడం, మననం చేసుకోవడం ద్వారా విషయాన్ని నేర్చుకుంటారు. వాటిని ఏమంటారు ?
జ: శ్రుతులు
35) వేటిని శ్రుతులు అని పిలవవచ్చు ?
జ: వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు
36) స్మరణ చేసుకోవడం ద్వారా నేర్చుకునేవి. గ్రంథ రూపంలో అధ్యయనం చేసేవి. విశ్లేషణ, చర్చల ద్వారా నేర్చుకుంటారు. వీటిని ఏమంటారు ?
జ: స్మృతులు
37) స్మృతులు అని వేటిని అంటారు ?
జ: మనుస్మృతి, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, రుషులు రాసిన సూత్ర గ్రంథాలు
38) పురాతనమైనా నిత్య నూతనంగా ఉండే వాటిని ఏమంటారు ?
జ: పురాణాలు 39) శ్రుతులు, స్మృతుల్లోని విషయాలను కథల రూపంలో ఉపదేశం చేసే వాటిని ఏమంటారు ?
జ: పురాణాలు
40) పురణాలకు ఉదాహరణలు ఏవి ?
జ: అష్టాదశ పురాణాలు, భాగవతం
41) చరిత్ర కల్పనలను జోడించి కథల రూపంలో రాసే వాటిని ఏమంటారు ?
జ: ఇతిహాసాలు42) ఇతి హాసాలకు ఉదాహరణలు ఏవి ?
జ: రామాయణం, మహాభారతాలు
43) మానవ జీవనాన్ని, జీవన విధానాన్ని నిర్దేశించేవి, మార్గదర్శకం చేసేవి ఏవి ?
జ: ఇతిహాసాలు
44) రుషులు దర్శించి వారు జ్నాన బోధ చేసిన వాటిని ఏమంటారు ?
జ: దర్శనాలు
45) దర్శనాలు ఎన్ని ? అవి ఏవి ?
జ: షడ్దర్శనాలు అంటే ఆరు. సాంఖ్య, న్యాయ, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, వైశేషికం