భారతీయ చిత్రకళ

1) భారత దేశంలో మొదటిసారిగా గోడల మీద చిత్రాలు ఎక్కడ బయటపడ్డాయి ?
జ: అజంతా గుహల్లో
2) చిత్రలేఖనంలోని నమూనా, రూపబేధ, భవయోజన, ప్రమాణ, వర్ణకాభంగ, సదృశ్య, లావణ్య యోజన అనే ఆరు రూపాలు ఉంటాయి. వీటిని ఏమంటారు ?
జ: షడంగ
3) ఏ రాజుల కాలంలో చిత్ర కళకు మంచి ఆదరణ లభించింది ?
జ: గుప్తుల కాలంలో
4) భోది సత్వుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా జీవిత విశేషాలను ఏ గుహల్లో చిత్రీకరించారు ?
జ: అజంతా గుహల్లో
5) గుప్తుల చిత్రలేఖనానికి ఏయే గుహలు ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు ?
జ: అజంతా, బాగ్ ( స్త్రీ, పురుషుల బొమ్మలు అందంగా చిత్రీకరణ)
6) చిత్ర లేఖకులకు 10 గ్రామాలు దర్శనం ఇచ్చినట్టు ఏ గ్రంథం చెబుతోంది ?
జ: సోమదేవుని కథాపరిత్సాగం
7) ఏ గుహల్లో శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు ఉన్నాయి ?
జ: అజంతాలోని 2,10 గుహల్లో
8) జంతువులు, పువ్వులు, చెట్లు లాంటి ప్రకృతి సంబధమైనవి, గరుడ, యక్ష, గంధర్వుల చిత్రాలు మనకు ఏ గుహల్లో కనిపిస్తాయి ?
జ: అజంతా గుహల్లో
9) రామాయణానికి సంబంధించిన చిత్రాలు ఎక్కడ కనిపిస్తాయి ?
జ: ఎల్లోరాలోని కైలాసనాధ ఆలయంలో
10) హిందువులకు చెందిన నటరాజు, పార్వతి, నందీశ్వరుడు లాంటి చిత్రాలు ఏ గుహల్లో కనిపిస్తాయి ?
జ: ఎల్లోరా గుహల్లో
11) తంజావూరులోని బృహదీశ్వరాలయంలో ఏ రాజుల కాలం నాటి చిత్రకళలు కనిపిస్తాయి ?
జ: చోళుల కాలం నాటి
12) మామండూర్ గుహాలయాల్లో మహేంద్రవర్మకు చెందిన చిత్రలేఖనాలు కనిపిస్తాయి. ఈయన స్వతహాగా వాస్తు శిల్పి, చిత్రకారుడు కూడా. మహేంద్ర వర్మ ఏ వంశానికి చెందిన రాజు ?
జ: పల్లవులు
13) పల్లవుల్లో చిత్రలేఖనానికి చాలా ప్రాధాన్యత ఇచ్చిన రాజు ఎవరు ?
జ: రెండో నరసింహ వర్మ
14) పానమాలై, కాంచీపురంతో పాటు మండగట్టు, పణమలై, కాంచీపురంల్లో ఏ రాజుల కాలం నాటి చిత్రలేఖనాలు ఉన్నాయి ?
జ: పల్లవులు
15) కాకతీయుల కాలంలో కొన్ని దేవాలయాల గోడలపై చిత్రలేఖనాలు కనిపించాయి ? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ?
జ: పిల్లల మర్రి, రాచకొండ, త్రిపురాంతకం, మాచర్ల
16) పిల్లలమర్రిలో ప్రసిద్ధి పొందిన కాకతీయుల కాలంనాటి చిత్రకళ ఏది ?
జ: అమృత మధనం
17) పాండ్యులకు ఏ ఇతర దేశాలతో సంబంధం వల్ల వారి చిత్రలేఖనం అలావాటు అయింది ?
జ: రోమ్ నగరంతో
18) ఎల్లోరా లభించే చిత్రలేఖనాలు ఏ రాజులకు చెందినవి ?
జ: రాష్ట్ర కూటులు
19) కాకతీయుల నాటి ఆలయాల్లోని చిత్రాలు ఏ రాజుల చిత్రాలతో పోల్చవచ్చు ?
జ: బాదామీ గుహల్లోని చాళుక్యుల చిత్రాలతో
20) పద్మబంధంలో ఉన్న ఏనుగు ఏ గుహల్లో కనిపిస్తుంది ?
జ: ఎల్లోరాలో