భరత నాట్యం

1) భరత నాట్యం ఏ రాష్ట్రానికి చెందినది ? ఎవరి నాట్యశాస్త్ర సూత్రాల ఆధారంగా దీన్ని రూపొందించారు ?
జ: తమిళనాడు, భరత మహర్షి
2) 19వ శతాబ్దంలో తంజావూరు నాట్యాచార్యులు చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం తదితరులు ప్రాచుర్యంలోకి తెచ్చిన నాట్యం ఏది ?
జ: భరత నాట్యం
3) భరత నాట్యం ఏ సంగీత సంప్రదాయం ఆధారంగా ప్రదర్శించేవారు ?
జ: కర్ణాటక సంగీత సంప్రదాయం
4) భరత నాట్యాన్ని మొదట ఎక్కడ ప్రదర్శించేవారు ?
జ: దేవదాసీలు ఆలయాలు, గొప్పవారి ఇండ్లల్లో ప్రదర్శించేవారు
5) భరత నాట్యానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన కళాకారిణి ఎవరు ?
జ: శ్రీమతి రుక్మిణీదేవి అరండీల్
6) భరత నాట్యంలో ప్రసిద్ది పొందిన కళాకారిణి ఎవరు ?
జ: టి.బాల సరస్వతి