బౌద్ధ సంస్కృతి

1) దు:ఖానికి హేతువు కోరికలు. వాటని జయించినట్లయితే సర్వ దు:ఖాలు దూరమవుతాయని నమ్మినది ఎవరు?
జ: బౌద్ధ మతం
2) దు:ఖ సాగరాన్ని జయించడానికి ఏకైక మార్గం ఏమి అనుసరించాలని బౌద్ధమతం చెబుతుంది ?
జ: అష్టాంగ మార్గం
3) భగవంతుడు, ఆత్మ, వేదాలు, వర్ణవ్యవస్థను ఎవరు తిరస్కరించారు ?
జ: గౌతమ బుద్ధుడు
4) బౌద్ధమతంలో మహాయానం, వజ్రయానం తర్వాత వచ్చిన శాఖ ఏది ?
జ: తాంత్రిక యానం (మంత్రాలు వల్లెవేయడం)
5) దు:ఖం, దు:ఖకారణం, దు:ఖ నివారణ, దు:ఖ నివారణ మార్గం అనే వాటిని ఏమంటారు ?
జ: ఆర్య సత్యాలు