ప్రపంచ భూగోళశాస్త్రం – పరిచయం


1) జియోగ్రఫీ అనే పదం ఎలా పుట్టింది ?
జ: జియో (భూమి) + గ్రఫియా (వర్ణన) ( ఈ రెండూ గ్రీకు పదాలు)
2) జాగ్రఫీ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు ?
జ: ఎరటోస్థనీస్
3) ప్రపంచంలో మొదటి శాస్త్రీయ, భూగోళ శాస్త్రవేత్త ఎవరు ?
జ: ఎరటోస్థనీస్
4) భూమధ్య రేఖ పొడవు, భూమి నుంచి సూర్యుడు, చంద్రుడికి మధ్య దూరాన్ని లెక్కించిన శాస్త్రవేత్త ఎవరు ?
జ: ఎరటోస్థనీస్
5) భూగోళ శాస్త్ర పితామహుడిగా ఎవర్ని పిలుస్తారు ?
జ: హెకాటియస్
6) ఆధునిక భూగోళ శాస్త్ర పితామహుడు ఎవరు ?
జ: అలెగ్జాండర్ వాన్ హంబోల్డ్, కార్ల్ రిట్టర్
7) భూకేంద్ర సిద్ధాంతకర్తగా ఎవర్ని పిలుస్తారు ?
జ: క్లాడియస్ టాలమీ (అలెగ్జాండ్రియా)
8) సూర్య కేంద్ర సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు ? ఏ దేశస్థుడు ?


జ: నికోలస్ కోపర్నికస్ (క్రీ.శ.1543లో), పోలెండ్ దేశం
9) కోపర్నికస్ రాసిన గ్రంథం ఏది ? (ఇందులోనే సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు )
జ: On the Revolution of the Heavenly Bodies
10) భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పింది ఎవరు ?
జ: అరిస్టాటిల్
11) ప్రపంచ పటాన్ని శాస్త్రీయంగా ఎవరు తయారు చేశారు ?
జ: అనాగ్జీమిండర్
12) భారతదేశ మొదటి సర్వేయర్ జనరల్, భారత భూగోళ శాస్త్ర పితామహుడు ఎవరు ?
జ: జేమ్స్ రన్నెల్