ప్రపంచీకరణ రాజ్యాంగ సవాళ్ళు

1) ఏయే పారిశ్రామిక విధానాలు భారత దేశాన్ని సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పరిచాయి ?
జ: 1948,1956
2) సాంఘిక, ఆర్దిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలన్నది ఆదేశిక సూత్రాల్లో ఏ నిబంధన ?
జ: 38వ నిబంధన
3) ఆదేశిక సూత్రాల్లో 39వ నిబంధనలో ఆరు నియమాలు ఉన్నాయి. అవి దేనికి సంబధించినవి ?
జ: స్త్రీ, పురుషులకు సమాన వేతనం, ఉపాధి అవకాశాలు, సంపద కేంద్రీకృతం కాకుండా చేసే చర్యలు, కార్మిక సంక్షేమం
4) నిరుద్యోగ భృతి చెల్లించాలనే నియమం ఎన్నోవది ?
జ: 41వ నిబంధన
5) కార్మికులకు సౌకర్యాల కల్పన, ఏర్పాట్లు ఏ నిబంధనలో ఉన్నాయి ?
జ: 42వ నిబంధన
6) కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశిక సూత్రాల్లో ఏ నిబంధన చెబుతుంది ?
జ: 43వ నిబంధన