ప్రధానమంత్రి ముద్ర యోజన

చిన్న తరహా వ్యాపారుల కోసం ఉద్దేశించిందే మైక్రో యూనిట్స్ డెవలప్ మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ ( ముద్ర).  10 లక్షల రూపాయల లోపు రుణాలను అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.  ప్రధానమంత్రి ముద్ర యోజన కింద శిశు, కిషోర్, తరుణ్  అనే మూడు విభాగాల్లో రుణాలు ఇస్తారు.
1) శిశు : రూ.50 వేల లోపు రుణాలు
2) కిషోర్ : రూ.50 వేల నుంచి రూ.5.00 లక్షల వరకూ
3) తరుణ్: రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ

ప్రొప్రైటర్, పార్టనర్ షిప్ కింద నడిచే నాన్ కార్పొరేట్ చిన్నతరహా వ్యాపారులు, సర్వీస్ సెక్టార్, షాప్ కీపర్స్, పండ్లు, కూరగాయల అమ్మకందారులు, ట్రక్ ఆపరేటర్లు, ఫుడ్ సర్వీస్ యూనిట్లు, రిపేర్లు షాపులు, మెషీన్ ఆపరేటర్లు, చిన్న పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు లాంటి గ్రామీణ, పట్టణాల అవసరాలకు ఉపయోగ పడే వ్యాపారాలకు రుణాలు మంజూరు చేస్తారు.  లబ్దిదారులకు దగ్గర్లో ఉన్న బ్యాంకుల బ్రాంచీల నుంచి ఈ ముద్ర రుణాలు ఇస్తారు.  వీటికి ఎలాంటి ఆస్తి తనఖాలు పెట్టనవసరం లేదు.
ముద్ర రుణాల కింద కమర్షియల్ వెహికిల్ లోన్; కారు, టూ వీలర్ లోన్స్ కూడా ఇస్తారు. అలాగే వర్కింగ్ కేపిటల్ కింద, ఏదైనా ప్లాంట్ లేదా యంత్రాల కొనుగోలు, కార్యాలయాలకు మరమ్మత్తులు లాంటి బిజినెస్ ఇన్ స్టాల్ మెంట్ లోన్స్ (BIL) కూడా ఇస్తారు. వీటితో పాటు ICICI బ్యాంకు అయితే బిజినెస్ లోన్స్ గ్రూప్ లోన్స్, రూరల్ బిజినెస్ క్రెడిట్ లోన్ కింద ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తుంది.
ముద్ర లోన్స్ కింద కావాల్సిన డాక్యుమెంట్లు :

వెహికిల్ లోన్స్ :
1) ముద్ర లోన్ ధరఖాస్తు (2) వెహికిల్ లోన్ అప్లికేషన్ (3) రెండు పాస్ పోర్ట్ ఫోటోలు (4) ఫోటో ఐడీ కార్డ్ (5) చిరునామా ధృవీకరణ (6) ఆదాయ ధృవీకరణ (7) ఆరు నెలల కాలానికి బ్యాంక్ స్టేట్ మెంట్

బిజినెస్ ఇన్ స్టాల్ మెంట్ లోన్:

1) ముద్ర రుణ దరఖాస్తు (2) BIL అప్లికేషన్ ఫామ్ (3) ఫోటో ఐడీ ప్రూఫ్ (4) చిరునామా ఐడీ (5) ఎస్టాబ్లిష్ మెంట్ ప్రూఫ్ 6) బ్యాంక్ స్టేట్ మెంట్ ( 6 నెలలకు ) (7) కార్యాలయ లేదా నివాసానికి సంబంధించి ఓనర్ షిప్ ప్రూఫ్ (8) వ్యాపారం నడుస్తున్నట్టు ధృవీకరణ పత్రం (9) విద్యార్హతలు (10) ట్రేడ్ రిఫరెన్సులు

బిజినెన్ లోన్స్ గ్రూప్ అండ్ రూరల్ బిజినెస్ క్రెడిట్:
1) ముద్ర లోన్ ధరఖాస్తు 2) BIL/RBC అప్లికేషన్ ఫామ్ 3) ఫోటో ఐడీ (4) అడ్రస్ ప్రూఫ్ (5)  కార్యాలయ లేదా నివాసానికి సంబంధించి ఓనర్ షిప్ ప్రూఫ్ (6) వ్యాపారం నడుస్తున్నట్టు ధృవీకరణ పత్రం (7) 12 నెలల బ్యాంక్ స్టేట్ మెంట్స్ (8) IT రిటర్న్స్ ( గడచిన రెండేళ్ళకు )