పర్యావరణ అంశాలు- కాలుష్యాలు

1) పర్యావరణ క్షీణతకు ప్రధాన కారణం ఏమని చెప్పొచ్చు ?
జ: కాలుష్యం
2) కాలుష్యం అనేది నాలుగు రకాలు అవి ఏంటి ?
జ: వాయు, జలం, భూమి, ధ్వని కాలుష్యం
3) భూవాతావరణంలో అత్యధిక శాతం ఉన్న వాయువు అది. ప్రాణకోటికి ఆధారమే గానీ జంతు జీవితంలో దాని పాత్ర లేదు. ఆ వాయువు పేరేంటి ?
జ: నైట్రోజన్
4) భూమ్మీద కాలుష్య కారక వాయువుల్లో ఇదీ ఒకటి. దీనికి రంగు, రుచి,వాసన ఉండదు. వాహనా వదిలే పొగల్లో ఉంటుంది. ఆ వాయువు పేరేంటి ?
జ: కార్బన్ మోనాక్సైడ్
5) ఈ వాయువు ట్రోపోస్పియర్ లోనే ఉంటుంది. మానవులు, జంతువుల శ్వాసక్రియ తర్వాత విడుదలవుతుంది ?
జ: కార్భన్ డైయాక్సైడ్
6) భూమికి 20-25 కిమీల ఎత్తులో ఉన్న ఈ పొర.. సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలను (Ultraviolet rays) ను నిలిపివేస్తుంది. ఈ పొరను ఏమంటారు ?
జ: ఓజోన్ పొర
7) భూమ్మీద వాహనాలు, పారిశ్రామిక పొగ కారణంగా ఓజోన్ పొరకు అంటార్కిటా ప్రాంతంలో రంధ్రం పడింది. దీన్ని 1987లోనే గుర్తించారు. ఏటా ఏ రోజును ఐక్యరాజ్యసమితి ఓజోన్ పొర రక్షణ దినంగా పాటిస్తోంది ?
జ: సెప్టెంబర్ 16న (1995 నుంచి పాటిస్తున్నారు)
8) ఓజోన్ పొరకు రంధ్రం పడటానికి ప్రధాన కారణం ఏవాయువులని చెబుతున్నారు ?
జ: క్లోరో ఫ్లోరో కార్భన్లు
9) ముఖ్యంగా క్లోరో ఫ్లోరో కార్భన్లు ఏ వస్తువుల నుంచి వెల్లడవుతాయి ?
జ: ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫోమ్ లు
10) ఓజోన్ పొరను కాపాడే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం 1992లో 6 ప్రాజెక్టులను ప్రారంభించింది. ఇవి ఏ ఒప్పందం ప్రకారం ప్రారంభించారు ?
జ: మాంట్రియల్ ఒప్పందం
11) 1972 జూన్ 5న స్టాక్ హోంలో జరిగిన ప్రపంచ పర్యావరణ సదస్సుకు హాజరైన భారత ప్రధాని ఎవరు ?
జ: ఇందిరా గాంధీ
12) కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హిమోగ్లోబిన్ తో కలిస్తే ఏమవుతుంది ?
జ: శరీరారికి తగినంత రక్తం అందదు
13) ఊపిరి తిత్తులపై ప్రభావం చూపించే వాయువు ఏది ?
జ: సల్ఫర్ డై ఆక్సైడ్
14) బ్రాంకైటీస్, ఆస్తామా లాంటి వ్యాధులకు కారణమైన వాయువు ఏది ?
జ: నైట్రోజన్ డై ఆక్సైడ్
15) ఓజోన్ పొర ఏ ఆవరణలంలో ఉంటుంది ?
జ: వాతావరణంలోని రెండో పొర స్ట్రాటో ఆవరణంలో
16) అతినీలలోహిత కిరణాలు భూమిని తాకితే మనుషులపై ఏవిధమైన ప్రభావం కనపడుతుంది ?
జ: చర్మ కేన్సర్, కళ్ళ శుక్లాలు
17) ఆల్ట్రావాయిలెట్ కిరణాలతో సముద్ర ప్రాణులపై ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది ?
జ: పైటో ప్లాంక్టన్ అనే ఆహార పదార్థం నాశనం అవుతుంది
18) భూమిపై ఉష్ణోగ్రతలు నిరంతరం పెరగడాన్ని ఏమంటారు ?
జ: గ్లోబల్ వార్మింగ్
19) గ్లోబర్ వార్మింగ్ తో సముద్రపు మట్టాలు పెరిగిపోయి, సమస్త జాతులు మునిగిపోవడాన్ని ఏమంటారు ?
జ: గ్రీన్ హౌస్ ఎఫెక్ట్
20) IPCC గుర్తించిన గ్రీన్ హౌస్ వాయువులు ఎన్ని ?
జ: 6
21) గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు ప్రధాన కారణమైన వాయువు ఏది ?
జ: కార్భన్ డై ఆక్సైడ్
22) స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఎంత మేరకు విస్తరించింది ఉంది ?
జ: 25-40 కిమీ
23) శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజెల్ లాంటి అసంపూర్తిగా మండుట వల్ల ఏర్పడే వాయువు ?
జ: మార్బన్ మోనాక్సైడ్
24) ఆమ్ల వర్షాలకు కారణమవుతున్న వాయువు ఏది ?
జ: సల్ఫర్ డై ఆక్సైడ్
25) లైబ్రరీల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పుస్తకాలు పసుపు రంగులోకి మారడానికి కారణమైన వాయువు ఏది ?
జ: సల్ఫర్ డై ఆక్సైడ్
26) మధురలోని చమురు శుద్ధి కర్మాగాల నుంచి ఏ వాయువు వెలువడటం వల్ల తాజ్ మహల్, భరత్ పూర్ పక్షుల కేంద్రానికి ముప్పు వాటిల్లుతోంది ?
జ: సల్ఫర్ డై ఆక్పైడ్
27) ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు 2012 ప్రకారం గాలి కాలుష్యం వల్ల ఏటా ఎంతమంది చనిపోతున్నారు.?
జ: 3.7 మిలియన్ల మంది ( 37 లక్షల మంది )
28) అంటార్కిటికా ఖండంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగితే మొదటగా మునిగిపోయే దేశం ఏది ?
జ: మాల్దీవులు
29) పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్న వాయువులను ఏ కార్ల కంపెనీ ఉత్పత్తి చేస్తోందని ఇటీవల తేలింది ?
జ: వోక్స్ వ్యాగన్
30) దేశంలో అత్యధిక వాహనాల కారణంగా వాయు కాలుష్యంలో మొదటి, రెండు స్థానాల్లో ఉన్న నగరాలు ఏవి ?
జ: మొదటిది: ఢిల్లీ, రెండోది: పాట్నా
31) యూరో 3 ప్రమాణాల ప్రకారం డీజిల్, పెట్రోల్ లో సల్ఫర్ శాతం ఎంత వరకూ ఉండొచ్చు ?
జ: పెట్రోల్ లో : 150PPM, డీజెల్ - 350 PPM
32) భారత్ కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 1981లో. 1987లో దీన్ని సవరించి Noise ని కూడా వాయు కాలుష్యం కింద చేర్చారు.
33) నీటిలో పాదరసం, సిల్వర్, ఆర్సినిక్ కరిగితే వచ్చే వ్యాధులు ఏవి ?
జ: పాదరసం - పక్ష వాతం
సిల్వర్ - కాలేయ, ఊపిరి తిత్తుల వ్యాధులు
ఆర్సినిక్ - క్యాన్సర్
34) నీటిలో ఏ ఖనిజం కరిగితే పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది ?
జ: మాంగనీస్
35) సాధరణంగా మానవుడి వినగలిగే ధ్వని తీవ్రత ఎంత ?
జ: 60 డిసిబుల్స్ వరకూ
36) పిచ్చి పట్టడానికి కారణమయ్యే ధ్వని తీవ్రత ఎంత ?
జ: 140 డిసిబుల్స్
37) సినిమా హాల్స్ లో ధ్వని తీవ్రత ఎంత వరకూ ఉండొచ్చు ?
జ: 85 డిసెబుల్స్
38) 1984 డిసెంబర్ 2నాడు భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన గ్యాస్ ఏది ?
జ: మిథైల్ ఐసో సైనైడ్
39) భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన ఫ్యాక్టరీ ఏది ?
జ: యూనియన్ కార్బైడ్
40) రష్యాలో చెర్నోబిల్ దుర్ఘటనతో తీవ్ర పర్యావరణ సమస్యలు తలెత్తాయి. అక్కడ ఏం జరిగింది ?
జం అణువిద్యుత్ ప్లాంట్ పేలింది
41) 2011 మార్చి 11న జపాన్ లో వచ్చిన సునామీ కారణంగా ఏ అణువిద్యుత్ కేంద్రాల నుంచి రేడియేషన్ బయటకు వచ్చింది ?
జ: దైచీ, పుకుషిమా
42) కర్ణాటకలో పర్యావరణం దెబ్బతినడానికి కారణమైన ఇనుప ఖనిజ పరిశ్రమ ఏది ?
జ: కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ
43) కుద్రముఖీ ప్రాంతంలో కలుషితమైన పెద్ద నది ఏది ?
జ: భద్రానది
44) 1956-95 మధ్యకాలంలో ఏర్పాటైన అణువిదయుత్ కేంద్రాలను 2035 నాటికి పూర్తిగా మూసివేయాలని ఏ దేశం భావిస్తోంది ?
జ: బ్రిటన్
45) భూమి వేడెక్కుతున్న విషయాన్ని మొదటగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు ?
జ: 1827లో ఫోరీర్
46) పర్యావరణ మార్పులపై అంతర ప్రభుత్వ ప్యానెల్ (IPCC) ని ఎవరు ఏర్పాటు చేశారు ?
జ:1988లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, ప్రపంచ వాతావరణ సంస్థ కలసి సంయుక్తంగా
46) రియో ధరత్రి సదస్సు ఎక్కడ జరిగింది ? ఎన్ని దేశాలు పాల్గొన్నాయి ?
జ: 1992 జూన్ లో 117 దేశాలు రియోడిజైనరీలో జరిగింది.
47) వాతావరణ మార్పులపై అంతర్జాతీయ స్థాయిలో కుదిరిన మొదటి ఒప్పందం ఏది ?
జ: క్యోటో ప్రోటో కాల్ (1997లో )
48) కుళ్ళిన పదార్థాల నుంచి వెలువడే వాయువు ఏది ?
జ: అమ్మోనియా
49) పాదరసం పదర్థాలు రేణువుల వల్ల వచ్చే వ్యాధి ఏది ?
జ: మినిమెటా
( జపాన్ లో పాదరసం మింగిన చేపలు తినడం వల్ల వచ్చింది)
50) నీటిలో కుళ్ళిన పదార్థాల నుంచి వెలువడే వాయువు ఏది ?
జ: మీథేన్