తెలంగాణ సమాజం-సంస్కృతి కళలు

1) ఒక జాతి లేదా ఒక దేశం తనదైన భౌతికంగా మానసికంగా దైనందిన జీవితంలో సాధించిన ప్రగతిని సంభవించే మూల్యాలను ఏమంటారు?
జ: నాగరికత లేదా సంస్కృతి
2) సంస్కృతిని విశ్లేషించుటకు భవిష్యత్ తరాల వారి కోసం పరిరక్షించు కోవాల్సినవి ఏమిటి?
జ: కట్టు, బొట్టు.ఆహార-విహారాలు,
3) ప్రజల ఆర్థిక స్తోమత, చైతన్యం వేటిపై ఆధారపడి ఉంటాయి?
జ: పాలక వ్యవస్థ
4) ప్రజలు నవాబుల వేషాలను అనుకరించడం ఎక్కడ కనిపించేది?
జ: తెలంగాణలో
5) నిజాం, గోల్కొండ పాలకుల కాలంలో గౌరవంగా భావించి జనం ఏ వేషాల్లో కనిపించేవారు ?
జ: పైజామాలు, షేర్వాణీలు, కుచ్చు టోపీలు
6) వివాహిత స్త్రీలు అలంకరించుకునే ఆభరణాలు ఏంటి?
జ: గంటె పుస్తెలు, మట్టెలు
7) గ్రామాల్లో ప్రసిద్దమైన పరిశ్రమ ఏది?
జ: చేనేత పరిశ్రమ
8) తెలంగాణ ప్రజల ముఖ్యమైన ఆహారధాన్యాలు ఏమిటి?
జ: వరి, మొక్కజొన్న, పచ్చ జొన్న, తెల్ల జొన్న, సజ్జలు, రాగులు, తైడలు
9) తెలంగాణలో నిజాం కాలంలో నిత్యారాధన జరిగిన దేవాలయాలు ఎన్ని?
జ: 650
10) తెలంగాణలోని గ్రామదేవతలు ఎవరు?
జ: ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, గంగమ్మ ముత్యాలమ్మ పోలేరమ్మ మారెమ్మ మొ.
11) నిజాం కాలంలోని గిరిజనుల జాతర్లు ఏమిటి?
జ: మేడారం సమ్మక్క జాతర, కీసలాపురం భీమదేవుని జాతర
12) హైదరాబాదు నగరం వెలుపల నవాబుల కాలంలో ప్రసిద్దమైన దర్గాలు ఏవి?
జ: జహంగీరు పీరీల దర్గా, ఉర్సు, ఖాజీపేట దర్గా.