తెలంగాణ – శీతోష్ణస్థితి

1) తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది?
జ: అధిక ఉష్ణోగ్రత, అధిక చలి (అర్థశుష్క శీతోష్ణస్థితి)
2) వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువుగా ఎక్కడ ఉంటుంది?
జ: రామగుండం లేదా కొత్తగూడెం
3) తెలంగాణలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది?
జ: అదిలాబాద్
4) అధిక వర్షపాతం సంభవించే జిల్లా ఏది?
జ: అదిలాబాద్
5) అత్యల్ప వర్షపాతం సంభవించే జిల్లా ఏది?
జ: మహబూబ్ నగర్
6) నైరుతి రుతుపవన కాలంలో అదిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది?
జ: అదిలాబాద్
7) తెలంగాణలో 24 గంటల్లో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదయింది?
జ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పేరూరు.
8) తెలంగాణలో వేసవిలో కురిసే వర్షానికి గల పేరేమిటి?
జ. మ్యాంగో షవర్ వర్షాలు
9) రాష్ట్రంలో సాధారణ సగటు వర్షపాతం ఎంత ?
జ: 906.6 మిమీ
10) నైరుతి రుతుపవనాల కాలంలో ఎంత వర్షపాతం ఉంటుంది ?
జ: 715 మిమీ (80శాతం)
11) ఈశాన్య రుతుపవనాల కాలంలో ఎంత వర్షపాతం ఉంటుంది ?
జ: 129 మిమీ
12) నైరుతి రుతుపవనాల కాలం ఏది ?
జ: జూన్ టు సెప్టెంబర్
13) హైదరాబాద్ లో ఏ రుతుపవనాల కాలంలో అత్యధిక వర్షం పడుతుంది ?
జ: ఈశాన్య రుతుపవనాలు
14) ఉత్తర తెలంగాణలో అధిక వర్షపాతం ఏ నెలలో పడుతుంది ?
జ: జులైలో
15) రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఏ నెలలో ప్రవేశిస్తాయి ?
జ: జూన్ నెల రెండో వారంలో.